ధర్మాంగద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
== నిర్మాణం ==
ధర్మాంగద నిర్మాణానికి సరస్వతీ టాకీసు వారు రూ.లక్షా పాతిక వేలు పెట్టుబడి పెట్టారు. అయితే 1948లో నిర్మాతలు ఆ పెట్టుబడితో సినిమాను పూర్తిచేయలేక మళ్ళీ సరస్వతీ టాకీస్ వారి వద్దకు మరికొంత డబ్బుకోరుతూ వెళ్ళారు. అయితే సరస్వతీ టాకీస్ వారు అందుకు నిరాకరించారు, అప్పటికే వారు ఫైనాన్షియర్లుగా వ్యవహరిస్తూండడంతో మరెవరూ డబ్బిచ్చి నిర్మాణం కొనసాగనిచ్చేందుకు ముందుకురాలేదు. పూర్తైనంతవరకూ ఫిల్ములను ఈ సమస్యల వలన జూన్ 29, 1948న వేలంపాట పెట్టారు. సినిమాలో పనిచేసిన నిపుణులకు, నటులకు కూడా సరిగా చెల్లించలేక నిర్మాతలు ఇబ్బందులు పడ్డారు. చివరకు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సినిమా నిర్మాణం కొనసాగి 1949లో విడుదలైంది.<ref name="రూపవాణి కథనం">{{cite news|last1=విలేకరి|first1=మూర్తి|title=ధర్మాంగద అను పాముపాట, లేక వేలంపాట|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=21717|accessdate=24 July 2015|work=రూపవాణి|issue=4|date=1 జూన్ 1948}}</ref>
==పాటలు==
ఈ చిత్రంలోని పాటలను తాపీ ధర్మారావు వ్రాయగా, గాలిపెంచల నరసింహారావు సంగీతాన్ని అందించాడు.
# కుమారి స్నానపువేళా తడవేలా నడవేల రా - బృందం
# దీక్షా కంకణ ధారీ విజయీభవ విజయీభవ - ఘంటసాల
# దేశదేశములకేగి తెచ్చామండీ ఘనమైన ఘోర సర్పాలా - పిఠాపురం, లింగమూర్తి బృందం
# రాజా మా రాజా మారాజ నిమ్మల పండా - కె. శివరావు, టి. కనకం బృందం
# ఆశా యిక లేదా ఆశావేశము లేదా జీవితమంతా చీకటికాదా -
# ఆడజన్మ మహిమా భళిరే వర్ణింపగ వశమా పుట్టిన యింటికి - ఘంటసాల
# ఇన్నిబాధల పాల్జేసి నన్ను ఉసురు పెట్టినది చాలక (పద్యం) -
# కలికిరో చావనెంచదగు కాలము మించెనుసుమ్మా (పద్యం) - ఘంటసాల
# కరుణ వినరయ్య సూర్యచంద్రాదులారా (పద్యం) -
# చూడరా నరుడా చూడరా ఈశుని దయరా పరమేశుని -
# జయహో జయహో జై చంద్రమౌళీ పాపదళనహేళీ - ఘంటసాల బృందం
# జయహే జయహే జయ జయ జయహే స్వస్తిక సుందర రూపా -
# దీనురాలి మొరవినవా సానుభూతి గనవా -
# దు:ఖభాజనౌ నను దయగనరా ఓ దయాళులారా -
# నాగరాజా నమో దయ మాపూజ చేకొనుమో -
# ముదితరాధికామనోహరా జై గోకుల విహారీధీరా -
# యముని హుంకృతి సైతమరికట్టి సావిత్రి (పద్యం) -
# యెదురు చూచుటేనా నాధా దరిశనభాగ్యము గనలేనా -
# యెచట యేనాడు కని విని యెరుగనట్టి (పద్యం) -
# సకల భోగేశా యీశా సచ్చిదానంద యీశా మహేశా -
# స్వాగతమో యువరాణీ పురభాగ్యదేవతా పారళిమాతా -
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ధర్మాంగద" నుండి వెలికితీశారు