"కోదాటి నారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
చి (→‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి (→‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
'''కోదాటి నారాయణరావు''' ([[డిసెంబరు 15]], [[1914]] - [[నవంబరు 11]], [[2002]]) గ్రంథాలయోద్యమం నేత మరియు, విశాలాంధ్ర ప్రచారకులు.
 
వీరు [[నల్గొండ జిల్లా]] [[రేపాల]] గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి రంగారావు గారు రేపాల కరణంగా చేసేవారు. రేపాలలోని శ్రీ లక్ష్మీనరసింహ మనోహర బాలభారతీ పుస్తక భాండాగారం బాల్యం నుండే అతన్ని ఆకర్షించింది. దాని కార్యకర్తగా గ్రంథాలయ మంచి చెడ్డలు చూసేవారు. ప్రాథమిక తర్వాత [[సూర్యాపేట]]లో [[మెట్రిక్]] పూర్తిచేశారు. ఆర్థిక కారణాల వలన సాయం కళాశాలలో చేరి పట్టా పొందారు. ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. వీరు కొంతకాలం [[గోలకొండ]] పత్రికలో పనిచేసి, జర్నలిజంపై ఆసక్తి కలిగి మందుకుల నరసింగరావు సంపాదకత్వంలోని "రయ్యత్" పత్రికలో ఏజెంట్ గా పనిచేశారు. తర్వాత ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజన్సీ తీసుకోవడంతో ప్రజా జీవనంతో సంబంధంలో ఏర్పడింది. వీరు అస్పృశ్యతా నివారణోద్యమం, [[గ్రంథాలయోద్యమం]], జాతీయోద్యమం లలో ప్రముఖ పాత్ర పోషించారు. [[ఖమ్మం]]లోని [[విజ్ఞాన నికేతన గ్రంథాలయం]] ఆయన కృషి వలన స్థాపించబడింది. గ్రంథాలయోద్యమం ద్వారా విశాలాంధ్రకు నాందిపలికాడు. విజ్ఞాన నికేతనానికి జరిగే వార్షికోత్సవాల ద్వాతా నిజాం మరియు, బ్రిటిష్ వారిలో ప్రముఖులను కోదాటి సమావేశపరిచేవారు.
 
1944లో [[ఇల్లెందు]]లో 25వ ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు [[బూర్గుల రామకృష్ణారావు]] అధ్యక్షతన జరిగింది. [[కోస్తా]], [[రాయలసీమ]], [[తెలంగాణ]] ప్రాంతాల నుండి అనేకమంది ప్రముఖులు విచ్చేశారు. విశాలాంధ్ర స్వరూపాన్ని ఆ సభ ప్రతిబింబించింది. గ్రంథాలయోద్యమం యావదాంధ్ర దేశానికి ప్రాతినిధ్యం వహించే ఉద్యమంగా మారింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879795" నుండి వెలికితీశారు