జానకి మందిరం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 24:
''' జానకి మందిరం ''' (నేపాలీ: जानकी मन्दिर) నేపాల్ లోని మిథిలా ప్రాంతంలో జానక్‌పూర్‌ లోని ఒక హిందూ ఆలయం. ఇది హిందూ దేవత [[సీత]] కు అంకితం చేయబడింది. <ref>{{cite web|title=Janaki Temple|url=http://janakpurdham.com/janaki-temple/|website=Janakpurdham|archiveurl=https://web.archive.org/web/20160115231609/http://janakpurdham.com/janaki-temple/|archivedate=15 January 2015}}</ref>
 
ఇది హిందూ-కొయిరి నేపాలీ నిర్మాణకళకు ఒక ఉదాహరణ. నేపాల్ లోని కోయిరి శిల్పకళకు ఇది చాలా ముఖ్యమైన నమూనాగా పరిగణించబడుతుంది. పూర్తిగా ప్రకాశవంతమైన తెల్లని మొఘల్ మరియు, కొయిరి గోపురాల మిశ్రమ శైలిలో 4,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినది. ఈ నిర్మించిన ఆలయం ఎత్తు 50 మీటర్లు ఉంటుంది. <ref>{{cite web |url=https://www.lonelyplanet.com/nepal/janakpur/attractions/janaki-mandir/a/poi-sig/1432882/357173 |title=Janaki Mandhir |work=[[Lonely planet]] |date=30 July 2017 |access-date=30 July 2017 }}</ref> ఈ మందిరం పూర్తిగా రాతితో మరియు, పాలరాయితో చేసిన మూడు అంతస్థుల నిర్మాణం. దీని 60 గదులు నేపాల్ యొక్క జెండాతో రంగు గ్లాసులతో, చెక్కడాలు మరియు, చిత్రలేఖనాలు, అందమైన జాలక కిటికీలు మరియు, టర్రెట్లతో అలంకరించబడ్డాయి. ఇతిహాసాలు మరియు, పురాణాలు ప్రకారం, రామాయణం కాలంలో జనక మహారాజు ఈ ప్రాంతాన్ని (విదేహ రాజ్యంగా పిలుస్తారు) పాలించాడు. తన కుమార్తె జానకి (సీత), తన స్వయంవరంలో, తన భర్తగా దైవాంశ సంభూతుడయిన [[శ్రీరాముడు]] ను ఎన్నుకుంది, [[అయోధ్య]] కు రాణి అయింది. వారి వివాహ వేడుక సమీప ఆలయంలో జరిగింది. దీనినే వివాహా మండపం అంటారు. 2008 లో తాత్కాలికంగా ఈ ప్రదేశం యునెస్కో గుర్తింపు పొందింది. <ref>https://whc.unesco.org/en/tentativelists/5261/</ref>
 
 
పంక్తి 31:
 
==చరిత్ర==
ఈ ఆలయం నౌ లఖ మందిర్ ("తొమ్మిది లక్షలు" అర్ధం) గా ప్రసిద్ది చెందింది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన వ్యయం ఒకే మొత్తంలోనే ఉంది: అనగా తొమ్మిది లక్షలు లేదా తొమ్మిది వందల వేల రూపాయలు అయ్యింది. అందుకే ఈ పేరు వచ్చింది. 1910 ఎడి లో భారతదేశం తికాగఢ్ (తికంఘర్) రాణి విరిష్ భాను ఈ ఆలయాన్ని నిర్మించటం జరిగింది. 1657 లో, దేవత సీత యొక్క బంగారు విగ్రహం చాలా అరుదుగా గుర్తించబడింది, సీత అక్కడ నివసించినట్లు చెబుతారు. అక్కడ సన్యాసి షుర్‌కిషోర్ దాస్ దేవత [[సీత]] చిత్రాలను కనుగొన్నాడు, ఈ పవిత్ర స్థలంలోనే నిర్మించినట్లు పురాణం పేర్కొంది. నిజానికి, షుర్‌కిషోర్ దాస్‌ ఆధునిక జనక్‌పూర్ వ్యవస్థాపకుడు, గొప్ప సెయింట్ మరియు, కవి. సీతా ఉపాసనా (సీతా ఉపనిషత్తు అని కూడా పిలుస్తారు) తత్వశాస్త్రం గురించి బోధించాడు. ఈ ప్రదేశంలోనే రాజు జనకుడు (సీరధ్వాజుడు) శివ ధనస్సు స్వయంవరం నిర్వహించినట్లు పేర్కొనబడింది. ఏప్రిల్ 2015 లో వచ్చిన భూకంపం కారణంగా, 2015 ఏప్రిల్ 26 నాటికి, ఈ ఆలయం పాక్షికంగా కుప్పకూలిందని తెలుస్తోంది. <ref>{{cite web |url=http://m.ndtv.com/world-news/nepal-earthquake-takes-heavy-toll-on-temples-758276 |title=Nepal Earthquake Takes Heavy Toll on Temples |work=[[NDTV]] |date=26 April 2015 |access-date=3 May 2015 }}</ref>
 
==తీర్థయాత్ర==
ప్రతి సంవత్సరం, [[నేపాల్]], [[భారతదేశం]], [[శ్రీలంక]] మరియు, ఇతర దేశాల నుండి వేలాదిమంది భక్తులు శ్రీరాముని మరియు, సీతను ఆరాధించటానికి '''రామ జానకి ఆలయాన్నీ''' సందర్శిస్తారు. రామ నవమి, వివాహ పంచమి, దషైన్ మరియు, తిహార్ పండుగలలో అనేకమంది ఆరాధకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
==సందర్శన==
భారతదేశంలోని జామ్ నగర్ లేదా సీతామర్హి నుండి టాక్సీ ద్వారా చేరుకోవచ్చును. ఇది జనక్‌పూర్ నుండి సుమారు 30 కిలోమీటర్లు మరియు, 45 కిలోమీటర్లు ఉంటుంది. జనక్‌పూర్ నకు భారతదేశంలోని ఏ నగరము నుండి కూడా సరాసరి (ప్రత్యక్ష) విమానాలు లేవు. <ref>https://www.holidify.com/places/janakpur/how-to-reach.html</ref>
===వీసా విధానం===
భారతీయులకు నేపాలుకు వెళ్ళటానికి వీసా అవసరం లేదు.
===బస్సు===
బస్సు ద్వారా జనక్‌పూర్ చేరుకోవాలంటే, ఖాట్మండు మరియు, సమీపంలోని భారతీయ నగరాల నుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
===విమానం===
ఖాట్మండు నుండి రోజువారీ విమానాలు కలిగిన విమానాశ్రయం జనక్‌పూర్. ఈ మార్గంలో కొన్ని ఎయిర్లైన్స్ 17-20 ప్రయాణీకుల సామర్ధ్యం ఉన్న విమానాలతో పనిచేస్తాయి.
"https://te.wikipedia.org/wiki/జానకి_మందిరం" నుండి వెలికితీశారు