తెలుగు సాహిత్యం యుగ విభజన: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శ్రీనాధ → శ్రీనాథ (3) using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 3:
 
==యుగ విభజన సౌలభ్యం==
యుగ విభజన అనేది అధ్యయనంలో ఒక కొండగుర్తుగా ఉపయోగపడుతుంది. కొన్ని విశిష్టమైన, సమానమైన ధర్మాలు గల కాలాన్ని ఒక "యుగం" అని వ్యవహరిస్తారు.<ref name="ReferenceA">ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర</ref> అంటే ఒక కాలంలోని సాహిత్యంలో సమానమైన, లేదా విలక్షణమైన అంశాలను ఆ యుగం పేరుతో గుర్తిస్తారు. యుగ విభజన ఎలా చేసినా గాని అది సమగ్రం మరియు, నిర్దుష్టం అని చెప్పలేము. అందేదో ఒక విధముగా అతి వ్యాప్తి, అవ్యాప్తి దోషములు కనిపిస్తూనే ఉంటాయి. ఒకే విధమైన కావ్యములు వివిధ కాలాలలో వెలువడవచ్చును. ఒకే కాలంలో బహువిధాలైన రచనలు కూడా రావచ్చును. ఒక కాలంలో పెక్కురు ఉద్ధండులైన పండితులుండవచ్చును. వాఙ్మయకారులు తమ అభిరుచిని బట్టి సౌకర్యం కోసం ఎలాగైనా యుగ విభజన చేయవచ్చును.<ref>దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము</ref>
వాఙ్మయంలో అంతర ప్రవృత్తి, బాహ్య ప్రవృత్తి అనే రెండు అంశాలున్నాయి. ఇవి కాలాన్నిబట్టి మారడం మనం గ్రహించవచ్చును. అందుకు బయటి భాషా, జాతుల సంపర్కం ఒక కారణం. సమాజాంతర్గతమైన మార్పులు మరొక కారణం. సాహితీ ప్రక్రియలలో అంతకు ముందు కాలంనుండి ఒక ముఖ్యమైన మార్పు సంభవించిన "హద్దు"ను యుగం మారందని చెప్పే సమయంగా భావించవచ్చును. సాహిత్య చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు సాహితీమూర్తులనే యుగకర్తలుగా గుర్తించడం భావ్యం అని పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయం.
 
పంక్తి 17:
* ఆయా కాలాలలో ప్రముఖంగా వెలువడిన సాహిత్య ప్రక్రియలను బట్టి - పురాణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, గద్య గేయ యక్షగాన యుగము, ఖండకావ్య (భావ కవితా) యుగము ఇలా..
 
* ఆయా కాలాలలో ప్రసిద్ధులైన, మరియు ఇతరులకు మార్గ దర్శకులైన కవులను బట్టి - నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాథ యుగము ఇలా..
 
* [[దివాకర్ల వేంకటావధాని]] - తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్రము"లో - కావ్య ప్రక్రియలను బట్టి - ప్రాఙ్నన్నయ యుగము, భాషాంతరీకరణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, దక్షిణాంధ్ర యుగము, ఆధునిక యుగము