చైనాలో కరోనావైరస్ మహమ్మారి 2019-2020: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పరిచయం సమాప్తం
పంక్తి 33:
ఇన్ఫెక్షనులు పెరిగే కొద్దీ భయం ప్రజలలో భయం పెరిగింది. దీనితో చైనాలో స్థానిక వివక్ష, చైనా బయట జాతి వివక్ష పెరిగిపోయాయి. ఈ వివక్షల బారిన పడవద్దు అని ప్రభుత్వాలు సూచించిననూ ఆ ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి <ref>{{Cite web|url=https://www.fox61.com/article/news/wuhan-coronavirus-reaches-india-as-countries-evacuate-citizens-from-china/520-2f5f428a-93a3-4719-87db-2dd869537aea|title=వివక్షలకు దారి తీసిన కరోనా వైరస్|website=fox61.com|access-date=2020-04-04}}</ref> . చైనాలో సాంఘిక మాధ్యమాల ద్వారా కొన్ని పుకార్లు సృష్టించబడగా ప్రసార మాధ్యమాలు, ప్రభుత్వాలు ఈ అపోహలను తొలగించే ప్రయత్నం చేశాయి. ఇటువంటి గాలివార్తలను, విమర్శలను ప్రభుత్వం సెన్సారు చేస్తూ వైరస్ వ్యాప్తిపై అధికారిక స్పందనను వెలుగులోకి తీసుకువచ్చింది. <ref>{{Cite web|url=https://www.nytimes.com/2020/03/14/business/media/coronavirus-china-journalists.html|title=సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించిన చైనా పౌరులు. సెన్సారు చేసిన ప్రభుత్వం|website=nytimes.com|access-date=2020-04-04}}</ref> <ref>{{Cite web||url=https://www.nytimes.com/2020/03/10/world/asia/coronavirus-china-xi-jinping.html|title=ప్రజలలోకి వెళ్ళి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్|website=nytimes.com|access-date=2020-04-04}}</ref>
 
24 మార్చి 2020 నాటికి వైరస్ వ్యాప్తి నియంత్రణ అయ్యిందని, ప్రస్తుతం ఈ వ్యాధి ఒకరి నుండి ఇంకొకరికి సోకకుండా నివారణ చర్యలు పకడ్బందీగా అమలు చేశామని చైనా ప్రకటించింది <ref>{{Cite web||url=http://english.scio.gov.cn/m/topnews/2020-03/24/content_75852078.htm|title=చైనా లో నియంత్రించబడ్డ కరోనా వైరస్|website=english.scio.gov.cn|access-date=2020-04-04}}</ref>
 
4 ఏప్రిల్ 2020 న కరోనా వైరస్ కు మృతి చెందిన వారికి నివాళులను అర్పిస్తూ చైనాలో, ఇతర దేశాలలోని చైనీసు రాయబార కార్యాలయాలలో జాతీయ పతాకాలను సగం ఎత్తులోనే ఎగురవేసింది. ఆ రోజు జరిగే అన్ని వినోద కార్యక్రమాలను నిలిపివేసింది. <ref>{{Cite web||url=https://www.scmp.com/news/china/politics/article/3078271/coronavirus-china-stage-day-mourning-saturday-thousands-killed|title=కరోనా మృతులకు చైనా నివాళి|website=www.scmp.com|access-date=2020-04-04}}</ref> <ref>{{Cite web||url=http://www.xinhuanet.com/english/2020-04/04/c_138945730.htm|title=సగం ఎత్తునే ఎగురవేయబడ్డ చైనీసు జాతీయ పతాకాలు|website=xinhuanet.com|access-date=2020-04-04}}</ref>