2019–21 కరోనావైరస్ మహమ్మారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
చైనా నుంచి 2020 జనవరి 20న కోవిడ్-19 దక్షిణ కొరియాకి వ్యాపించినట్టు నిర్ధారణ అయింది. ఫిబ్రవరి 20 నాటికి దక్షిణ కొరియా హెల్త్ ఏజెన్సీ చెప్పుకోదగ్గ స్థాయిలో నిర్ధారిత కేసుల పెరుగుదల ఉన్నట్టు గమనించింది.<ref name="ThomReut_SKorea_zombie" /> దీనికి డేగు అన్న ప్రదేశంలో షించియోంజీ చర్చ్ ఆఫ్ జీసెస్ అన్న కొత్త మతపరమైన ఉద్యమానికి చెందిన ఒక కూటమి ఇందుకు ప్రధానమైన కారణమని గుర్తించారు.<ref name="ThomReut_SKorea_zombie2" /><ref name="zMJnB" /> వుహాన్ నుంచి డేగు ప్రాంతానికి వచ్చి ఈ కూటముల్లో పాల్గొన్న షించియోంజీ చర్చి భక్తులు ఈ వ్యాప్తి విజృంభణకు కారకులని అనుమానిస్తున్నారు.<ref name="b82186" /><ref name="koreabiomed" /> ఫిబ్రవరి 22 నాటికి 9,336 మంది చర్చి అనుచరుల్లో 1,261 మంది, అంటే 13 శాతం మందిలో కోవిడ్-19 లక్షణాలు బయటపడ్డాయి.<ref name="BOQ2O" /> ఈ 9వేల పైచిలుకు వ్యక్తులను సెల్ఫ్-క్వారంటైన్లో ఉంచారు. అదే రోజున 229 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో కొన్ని కేసులు అప్పటివరకూ వైరస్ బాధిత ప్రాంతాలతోనూ, రోగులతోనూ ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో దేశంలో కరోనావైరస్ 2019 వ్యాప్తి కొత్త దశలోకి వచ్చిందని దక్షిణ కొరియా మంత్రి కిమ్ పేర్కొన్నాడు.<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51598296|title=కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య|date=2020-02-22|work=BBC News తెలుగు|access-date=2020-04-04|language=te}}</ref>
 
2020 ఫిబ్రవరి 23న దక్షిణ కొరియా అత్యధిక స్థాయి అప్రమత్తత ప్రకటించింది.<ref name="GKvzB" /> ఫిబ్రవరి 28న దేశంలో 2 వేలకు పైగా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి,<ref name="MPKfs" /> ఫిబ్రవరి 29 నాడు 3,150 కేసులు నిర్ధారణ అయ్యాయి.<ref name="SPmG7" /> ముగ్గురు సైనికులు కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో మొత్తం మిలటరీ బేస్‌లన్నిటినీ క్వారంటైన్ చేశారు.<ref name="b821862" /> మొదట్లో అధ్యక్షుడు మూన్ జే-ఇన్ చేపట్టిన చర్యలు, ప్రతిస్పందన పట్ల దక్షిణ అమెరికా సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు కొరియన్లు ప్రభుత్వం ఈ అవుట్‌బ్రేక్‌లో సరిగా పనిచేయలేదంటూ మూన్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ పిటీషన్లపై సంతకాలు చేశారు. మరికొందరు అతని ప్రతిస్పందనను అభినందించారు.<ref name="imx38" />
==చూడండి==
* [[భారతదేశలొ 2020 కరోనావైరస్ వ్యాప్తి]]