అండమాన్ సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

+వృక్షజాలం, +జంతుజాలం
చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లో → లో , లు → లు , నుండీ → నుండి , → (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
| reference =<ref name=bse>[http://bse.sci-lib.com/article057639.html Andaman Sea], [[Great Soviet Encyclopedia]] (in Russian)</ref><ref name=brit>[http://www.britannica.com/EBchecked/topic/23505/Andaman-Sea Andaman Sea], Encyclopædia Britannica on-line</ref>
}}
'''అండమాన్ సముద్రం''' ఈశాన్య [[హిందూ మహాసముద్రం]] లో ఉన్న మార్జినల్ సముద్రం. ఇది మార్తాబన్ గల్ఫ్ వెంట [[మయన్మార్]], [[థాయిలాండ్]] తీరప్రాంతాల మధ్య ఉంది. మలయ్ ద్వీపకల్పానికి పడమటి వైపున ఉంది. అండమాన్ సముద్రానికి పశ్చిమాన ఉన్న [[బంగాళాఖాతము|బంగాళాఖాతం]] నుండి దీన్ని వేరు చేస్తూ మధ్యలో [[అండమాన్ దీవులు|అండమాన్]] [[నికోబార్ జిల్లా|నికోబార్]] [[అండమాన్ దీవులు|దీవులు]] ఉన్నాయి. దీని దక్షిణ కొసన బ్రీహ్ ద్వీపం ఉంది. అండమాన్ సముద్రాన్ని చారిత్రికంగా '''బర్మా సముద్రం''' అని కూడా పిలుస్తారు <ref name="IHO">{{వెబ్ మూలము|url=http://www.iho.int/iho_pubs/standard/S-23/S-23_Ed3_1953_EN.pdf|title=Limits of Oceans and Seas, 3rd edition|year=1953|publisher=International Hydrographic Organization|accessdate=7 February 2010}}</ref>  
 
సాంప్రదాయికంగా, ఈ సముద్రం తీరప్రాంత దేశాల మధ్య చేపల పెంపకం కోసం, ఆ దేశాల రవాణా కొరకూ ఉపయోగపడింది. దాని [[పగడపు దిబ్బ|పగడపు దిబ్బలు]], ద్వీపాలూ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. [[2004 సునామీ|2004 లో వచ్చిన హిందూ మహాసముద్ర భూకంపం, సునామీ]] కారణంగా మత్స్య, పర్యాటక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
పంక్తి 30:
 
== వృక్షజాలం ==
అండమాన్ సముద్రం తీరప్రాంతాల్లో మడ అడవులు, సముద్రపు గడ్డి మైదానాలూ ఉంటాయి. మడ అడవులు 600 చ.కి.మీ. మలయ్ ద్వీపకల్పంలోని థాయ్ తీరాలలో, సముద్రపు పచ్చికబయళ్ళు త్9 చ.కి.మీ విస్తీరణం లోనూ ఉన్నాయి. <ref name="Panjarat3">{{వెబ్ మూలము|author=Panjarat|title=Sustainable Fisheries in the Andaman Sea Coast of Thailand|url=https://www.un.org/depts/los/nippon/unnff_programme_home/fellows_pages/fellows_papers/panjarat_0708_thailand_PPT.pdf|work=United Nations}}</ref> {{Rp|25–26}} తీరప్రాంత జలాల్లో అధికంగా ఉండే ఉత్పాదకతకు మడ అడవులు ఎక్కువగా కారణం. వాటి వేర్లు, నేలను, అవక్షేపాలను పట్టుకుంటాయి. చేపలకు, చిన్న జల జీవులకూ వేటజీవుల నుండి ఆశ్రయం కల్పిస్తాయి. మడ చెట్లు గాలి నుండి తరంగాల నుండీనుండి తీరాన్ని రక్షిస్తాయి. వాటి మృతభాగాలు జల ఆహార గొలుసులో భాగం. అండమాన్ సముద్రంలోని థాయ్ మడ అడవులలో చాలా భాగాన్ని 1980 ల నాటి ఉప్పునీటి రొయ్యల పెంపకం సమయంలో తొలగించారు. 2004 సునామీ కారణంగా మడ అడవులు కూడా గణనీయంగా దెబ్బతిన్నాయి. ఆ తరువాత వాటిని కొంతవరకూ తిరిగి నాటారు. కాని మానవ కార్యకలాపాల కారణంగా వాటి విస్తీర్ణం క్రమంగా తగ్గుతూనే ఉంది. <ref name="Panjarat3" /> {{Rp|6–7}}
 
అండమాన్ సముద్రంలోని పోషకాల యొక్క ఇతర ముఖ్యమైన వనరులు సీగ్రాస్, మడుగులు, తీర ప్రాంతాల బురద అడుగులు. బొరియల్లోను, సముద్రగర్భం లోనూ జీవించే అనేక జీవులకు అవి ఆశ్రయాన్నిస్తాయి. అనేక జల జాతులు రోజూ సీగ్రాస్‌ నుండి, సీగ్రాస్‌కూ వలస పోతూంటాయి. సముద్ర తీర పడకలను దెబ్బతీసే మానవ కార్యకలాపాలలో తీరప్రాంత పరిశ్రమలు, రొయ్యల పొలాలు, ఇతర రకాల తీరప్రాంత అభివృద్ధి కార్యక్రమాల నుండి వెలువడే వ్యర్థ జలాలు, అలాగే ట్రాలింగ్, పుష్ నెట్స్, డ్రాగెట్ల వాడకమూ ఉన్నాయి. 2004 నాటి సునామీ అండమాన్ సముద్రం వెంట 3.5% సీగ్రాస్ ప్రాంతాలు ఇసుక అవక్షేపణ వలన ప్రభావితమయ్యాయి. 1.5% ప్రాంతంలో పూర్తిగా ఆవాస నష్టం జరిగింది. <ref name="Panjarat4">{{వెబ్ మూలము|author=Panjarat|title=Sustainable Fisheries in the Andaman Sea Coast of Thailand|url=https://www.un.org/depts/los/nippon/unnff_programme_home/fellows_pages/fellows_papers/panjarat_0708_thailand_PPT.pdf|work=United Nations}}</ref> {{Rp|7}}
పంక్తి 48:
థాయిలాండ్ ఒక్కటే 2005 లో 9,43,000 టన్నుల చేపలను <ref>[https://books.google.com/books?id=LBlo3nNXy_UC&pg=PA403 Review of Fisheries in OECD Countries 2009: Policies and Summary Statistics], OECD Publishing, 2010 {{ISBN|92-64-07974-2}} p. 403</ref> 2000 లో 7,10,000 టన్నుల చేపలనూ పట్టింది. ఆ 7,10,000 టన్నులలో, 4,90,000 ట్రాలర్లతో (1,017 నౌకలు), 184,000 పర్స్ సీన్ ద్వారా (415 నౌకలు) 30,000 గిల్నెట్స్ ద్వారానూ పట్టింది. థాయ్‌లాండ్ పట్టిన మొత్తం సముద్ర చేపల్లో 41 శాతం థాయ్‌లాండ్ గల్ఫ్‌లోను, 19 శాతం అండమాన్ సముద్రంలోనూ పట్టారు. నలభై శాతం థాయిలాండ్ [[ EEZ|EEZ]] బయట పట్టుకున్నారు. <ref name="GP-2012">{{Cite book|url=http://www.greenpeace.org/seasia/PageFiles/536808/english-singlePages.pdf|title=Oceans in the Balance, Thailand in Focus|date=c. 2012|publisher=Greenpeace Southeast Asia (Thailand)|location=Bangkok|access-date=11 July 2017}}</ref>
 
[[మలేషియా]] చేపల ఉత్పత్తి బాగా తక్కువగా ఉంది. మయన్మార్‌ ఉత్పత్తి సుమారుగా అంతే లేదా కొద్దిగా ఎక్కువ గానీ ఉంటుంది. <ref>Cassandra De Young [https://books.google.com/books?id=_7JD1V3PijUC&pg=PA178 Indian Ocean], Food & Agriculture Org., 2006 {{ISBN|92-5-105499-1}}, pp. 39, 178</ref> చేపల కోసం మయన్మార్, థాయిలాండ్ ల మధ్య ఉన్న పోటీ అనేక ఘర్షణలకు దారితీసింది. 1998, 1999 లలో, ఈ ఘర్షణలు ఇరువైపులా మరణాలకు దారితీసాయి. సైనిక ఘర్షణకు దరిదాపుల్లోకి వెళ్ళాయి. ఈ రెండు సందర్భాల్లోనూ, వివాదాస్పద సముద్ర ప్రాంతాలలో చేపలు పడుతున్న థాయ్ ఫిషింగ్ బోట్లను అడ్డుకోవడానికి బర్మీస్ ఓడలు ప్రయత్నించినప్పుడు థాయ్ నావికాదళం జోక్యం చేసుకుంది. యుద్ధ విమానాలను మోహరించాలని థాయ్ జాతీయ భద్రతా మండలి భావించింది. థాయ్ ఫిషింగ్ బోట్లను మలేషియా నావికాదళం కూడా అడ్డుకుంటూ ఉంటుంది. విదేశీ జలాల్లో లైసెన్స్ లేకుండా చేపలు పట్టకుండా థాయ్ ప్రభుత్వం తన సొంత మత్స్యకారులను హెచ్చరించాల్సి వచ్చింది <ref>Alan Dupont [https://books.google.com/books?id=uGaINo0FofcC&pg=PA103 East Asia imperilled: transnational challenges to security], Cambridge University Press, 2001 {{ISBN|0-521-01015-2}} pp. 103–105</ref>
 
థాయ్‌లాండ్‌లో 2004 సముద్ర ఉత్పత్తి: పెలాజిక్ ఫిష్ 33 శాతం, డీమెర్సల్ ఫిష్ 18 శాతం, సెఫలోపాడ్ 7.5 శాతం, క్రస్టేసియన్స్ 4.5 శాతం, పనికిరాని చేపలు 30 శాతం, ఇతరాలు 7 శాతం. <ref name="Panjarat">{{వెబ్ మూలము|author=Panjarat|title=Sustainable Fisheries in the Andaman Sea Coast of Thailand|url=https://www.un.org/depts/los/nippon/unnff_programme_home/fellows_pages/fellows_papers/panjarat_0708_thailand_PPT.pdf|work=United Nations}}</ref> {{Rp|12}} పనికిరాని చేపల్లో, తినకూడని జాతులు, తక్కువ వాణిజ్య విలువ కలిగిన తినదగిన జాతులు, చేపల పిల్లలూ ఉంటాయి. వీటిని తిరిగి సముద్రం లోకి వదిలేస్తారు. <ref name="Panjarat" /> {{Rp|16}} పెలాజిక్ చేపల్లో ఆంకోవీస్ (19 శాతం), ఇండో-పసిఫిక్ మాకేరెల్ (18 శాతం), సార్డినెల్లాస్ (14 శాతం), స్కాడ్ (11 శాతం), లాంగ్‌టైల్ ట్యూనా (9 శాతం), ఈస్టర్న్ లిటిల్ టూనా ''(''6 శాతం), ట్రెవాలీస్ (6 శాతం), బిగ్‌ఐ SCAD (5 శాతం), ఇండియన్ మాకెరెల్ ''(''4 శాతం), కింగ్ మాకెరెల్ ''(''3 శాతం), టార్పెడో SCAD ( ''మెగలాస్పిస్ కార్డిలా'', 2 శాతం), తోడేలు హెర్రింగ్స్ (1 శాతం), ఇతరులు (2 శాతం) ఉంటాయి. <ref name="Panjarat" /> {{Rp|13}} డీమెర్సల్ చేపల్లో పర్పుల్-స్పాటెడ్ ''బిజీ'', థ్రెడ్‌ఫిన్ బ్రీమ్, బ్రష్‌టూత్ లిజార్డ్ ఫిష్, సన్నని బల్లి ఫిష్, జింగా రొయ్యలు ఉన్నాయి. స్పానిష్ మాకేరెల్, కారంగిడే, టార్పెడో స్కాడ్ మినహా చాలా జాతులను ''1970-90'' ల నుండి అతిగా (ఓవర్ ఫిషింగ్) ''పట్టారు''. మొత్తం ఓవర్ ఫిషింగ్ రేటు 1991 లో పెలాజిక్ లు 333 శాతం, డీమెర్సల్ జాతులకు 245 శాతం. <ref name="Panjarat" /> {{Rp|14}} సెఫలోపాడ్స్‌ను స్క్విడ్, కటిల్ ఫిష్, మోలస్కులుగా విభజించారు. థాయ్ జలాల్లో స్క్విడ్, కటిల్ ఫిష్ లు 10 కుటుంబాలు, 17 ప్రజాతులు, 30 కి పైగా జాతులూ ఉన్నాయి. అండమాన్ సముద్రంలో పట్టుబడిన ప్రధాన మోలస్క్ జాతులు స్కాలోప్, బ్లడ్ కాకిల్ చిన్న-మెడ క్లామ్. వాటిని పట్టాలంటే, సముద్రపు అడుగును దేవే గేర్లు అవసరం. ఇవి సముద్రపు అడుగుభాగాన్ని దెబ్బతీస్తాయి, అంచేత వీటికి ప్రజాదరణ లేదు. కాబట్టి, మోలస్క్ ఉత్పత్తి 1999 లో 27,374 టన్నుల నుండి 2004 లో 318 టన్నులకు తగ్గిపోయింది. 2004 లో మొత్తం సముద్ర ఉత్పత్తులలో క్రస్టేసియన్లు 4.5 శాతం మాత్రమే ఉండగా, విలువలో మాత్రం అవి 21 శాతం ఉన్నాయి. అరటి రొయ్యలు, టైగర్ రొయ్యలు, కింగ్ రొయ్యలు, పాఠశాల రొయ్యలు, బే ఎండ్రకాయలు, మాంటిస్ రొయ్యలు, ఈత పీతలు, మట్టి పీతలు వీటిలో ప్రధానంగా ఉంటాయి. 2004 లో మొత్తం క్యాచ్‌లో స్క్విడ్, కటిల్ ఫిష్ 51,607 టన్నులు, క్రస్టేసియన్లు 36,071 టన్నులు ఉన్నాయి. <ref name="Panjarat" /> {{Rp|18–19}}
 
=== ఖనిజ వనరులు ===
పంక్తి 56:
 
=== పర్యాటకం ===
అండమాన్ సముద్రం లోని మలయ్ ద్వీపకల్పపు పశ్చిమ తీరం, [[అండమాన్ దీవులు|అండమాన్]] [[నికోబార్ జిల్లా|నికోబార్ దీవులు]], [[మయన్మార్]] లు [[పగడపు దిబ్బ|పగడపు దిబ్బలతో]], ఆఫ్షోర్ దీవులతో అలరిస్తూ ఉంటాయి. 2004 సుమత్రా భూకంపం, సునామీ కారణంగా దెబ్బతిన్నప్పటికీ, అవి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. <ref>[https://books.google.com/books?id=CiTAx3unBkYC&pg=PA585 World and Its Peoples: Eastern and Southern Asia], Marshall Cavendish, 2007 {{ISBN|0-7614-7631-8}} p. 585</ref> సమీప తీరంలో అనేక సముద్ర జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. ఒక్క థాయిలాండ్‌లోనే 16 ఉన్నాయి, వాటిలో నాలుగు [[యునెస్కో]] [[ఆసియా, ఆస్ట్రలేషియాల్లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా|ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో]] చేర్చే ప్రతిపాదనలో ఉన్నాయి. <ref name="Panjarat2">{{వెబ్ మూలము|author=Panjarat|title=Sustainable Fisheries in the Andaman Sea Coast of Thailand|url=https://www.un.org/depts/los/nippon/unnff_programme_home/fellows_pages/fellows_papers/panjarat_0708_thailand_PPT.pdf|work=United Nations}}</ref> {{Rp|7–8}}
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/అండమాన్_సముద్రం" నుండి వెలికితీశారు