అంతర్జాతీయ ద్రవ్య నిధి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: → (3), ) → )
పంక్తి 34:
1944 లో బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో ప్రధానంగా హ్యారీ డెక్స్టర్ వైట్, జాన్ మేనార్డ్ కీన్స్ ల ఆలోచనల నుండి ఇది రూపుదిద్దుకుంది. <ref>{{వెబ్ మూలము|url=https://www.imf.org/external/pubs/ft/wp/2002/wp0252.pdf|title=IMF working paper}}</ref> 1945 లో 29 సభ్య దేశాలతో, అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంతో అధికారికంగా ఉనికి లోకి వచ్చింది. చెల్లింపుల సంక్షోభాలు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల నిర్వహణలో ఇది ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తోంది. <ref name="Explaining Change">{{Harvnb|Lipscy|2015}}.</ref> సంస్థలో సభ్యత్వం ఉన్న దేశాలు కోటా విధానం ద్వారా ఒక సంచయానికి నిధులు చేకూరుస్తాయి. చెల్లింపుల సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలు ఈ సంచయం నుండి డబ్బు తీసుకుంటాయి. 2016 నాటికి, ఫండ్‌లో 477 బిలియన్ల ఎక్స్‌డిఆర్ (సుమారు $ 667 బిలియన్) లున్నాయి. <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/en/About/Factsheets/IMF-at-a-Glance|title=The IMF at a Glance|accessdate=15 December 2016}}</ref>
 
ఫండ్ పనులతో పాటు, గణాంకాల సేకరణ, విశ్లేషణ, సభ్యుల ఆర్థిక వ్యవస్థలపై పర్యవేక్షణ, నిర్దుష్ట విధానాల కోసం డిమాండు చెయ్యడం వంటి ఇతర కార్యకలాపాల ద్వారా, <ref name="There is No Invisible Hand">{{వెబ్ మూలము|title=There is No Invisible Hand|url=https://hbr.org/2012/04/there-is-no-invisible-hand|publisher=Harvard Business Review|date=10 April 2012}}</ref> IMF తన సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. <ref>Escobar, Arturo (1980). "Power and Visibility: Development and the Invention and Management of the Third World". ''Cultural Anthropology'' 3 (4): 428–443.</ref> ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌లో పేర్కొన్న సంస్థ లక్ష్యాలివి: <ref>{{వెబ్ మూలము|url=https://www.imf.org/external/pubs/ft/aa/pdf/aa.pdf|title=imf.org: "Articles of Agreement, International Monetary Fund" (2011)}}</ref> అంతర్జాతీయ ద్రవ్య సహకారం, అంతర్జాతీయ వాణిజ్యం, అధిక ఉపాధి, మార్పిడి రేటు స్థిరత్వం, స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సభ్య దేశాలకు వనరులను అందుబాటులో ఉంచడం. <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/pubs/ft/aa/index.htm#art1|title=Articles of Agreement of the International Monetary Fund – 2016 Edition|publisher=}}</ref> IMF నిధులు రెండు ప్రధాన వనరుల నుండి వస్తాయి: కోటాలు, రుణాలు. కోటాల ద్వారా సభ్య దేశాల నుండి సేకరించే నిధులు IMF నిధుల్లో సింహభాగం. ఒక్కో సభ్యుని కోటా పరిమాణం, ప్రపంచంలో దాని ఆర్థిక, ద్రవ్య ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ఎక్కువ ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన దేశాలకు కోటాలు పెద్దగా ఉంటాయి. IMF వనరులను పెంచే సాధనంగా కోటాలు ఎప్పటికప్పుడు పెరుగుతూంటాయి. <ref>{{వెబ్ మూలము|url=https://www.imf.org/en/About/Factsheets/Sheets/2016/07/14/12/21/IMF-Quotas|title=IMF Quotas}}</ref> IMF వనరులు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో ఉంటాయి.
 
2019 అక్టోబరు 1 నుండి IMF మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి), చైర్ వుమన్ గా [[బల్గేరియా|బల్గేరియన్]] ఎకనామిస్ట్ క్రిస్టాలినా జార్జివా నిర్వహిస్తోంది. <ref>{{వెబ్ మూలము|url=https://www.apnews.com/3a8293b07f91434193221028f96aea68|title=Economist who grew up in communist Bulgaria is new IMF chief|date=25 September 2019}}</ref>
 
1 2018 అక్టోబరు నుండి గీతా గోపీనాథ్‌ను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమించారు. ఆమె ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్‌డి పొందింది. ఐఎంఎఫ్ లో నియామకానికి ముందు ఆమె [[కేరళ]] ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా పనిచేసింది. <ref>{{వెబ్ మూలము|url=https://www.imf.org/en/News/Articles/2018/10/01/pr18386-christine-lagarde-appoints-gita-gopinath-as-imf-chief-economist|title=Christine Lagarde Appoints Gita Gopinath as IMF Chief Economist}}</ref>
పంక్తి 71:
IMF లోని సభ్య దేశాలన్నీ సార్వభౌమ దేశాలు కావు. అందువల్ల IMF లోని అన్ని "సభ్య దేశాలు" ఐక్యరాజ్యసమితిలో సభ్యులు కావు. <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/country/index.htm|title=IMF – Country Information|publisher=}}</ref> అలాంటివి [[అరుబా|అరూబా]], కురకావ్, హాంకాంగ్ [[మకావు]], [[కొసావో]]<nowiki/>లు . <ref name="imfkos">{{వెబ్ మూలము|title=Republic of Kosovo is now officially a member of the IMF and the World Bank|url=http://www.kosovotimes.net/flash-news/676-republic-of-kosovo-is-now-officially-a-member-of-the-imf-and-the-world-bank.html}}</ref> <ref name="imfkospr">{{cite press release|title=Kosovo Becomes the International Monetary Fund's 186th Member|publisher=International Monetary Fund|date=29 June 2009|url=http://www.imf.org/external/np/sec/pr/2009/pr09240.htm|accessdate=29 June 2009}}</ref> IMF లోని సభ్యులందరూ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (IBRD) సభ్యులే. అలాగే అక్కడి సభ్యులు ఇక్కడా సభ్యులే.
 
మాజీ సభ్యులు [[క్యూబా]] (ఇది 1964 లో వెళ్ళిపోయింది), <ref name="cuba">{{వెబ్ మూలము|title=Brazil calls for Cuba to be allowed into IMF|work=Caribbean Net News|date=27 April 2009|url=http://www.caribbeannetnews.com/cuba/cuba.php?news_id=15996&start=0&category_id=5|accessdate=7 May 2009}}{{Dead link|date=August 2017|bot=InternetArchiveBot}}</ref> [[తైవాన్|రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) ]]<nowiki/>లు. తైవాన్ అప్పటి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మద్దతును కోల్పోవడంతో 1980 లో UN నుండి తొలగించారు. దాని స్థానంలో [[చైనా|పీపుల్స్ రిపబ్లిక్ చైనా]] చేరింది. <ref name="wsj">{{Cite news|url=https://www.wsj.com/articles/SB124154560907188151|title=Kosovo Wins Acceptance to IMF|last=Andrews|first=Nick|date=7 May 2009|work=The Wall Street Journal|access-date=7 May 2009|last2=Bob Davis|quote=Taiwan was booted out of the IMF in 1980 when China was admitted, and it hasn't applied to return since.}}</ref> అయితే, "తైవాన్ ప్రావిన్స్ ఆఫ్ చైనా" ఇప్పటికీ అధికారిక IMF సూచికలలో ఉంది. <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/pubs/ft/weo/2012/01/weodata/co.htm|title=World Economic Outlook Database for April 2012 – Country information|date=17 April 2012|accessdate=7 November 2012}}</ref>
 
క్యూబాతో పాటు, ఐఎంఎఫ్‌కు చెందని ఇతర ఐరాస దేశాలు [[అండొర్రా|అండోరా]], [[లైచెన్‌స్టెయిన్|లీచ్టెన్‌స్టెయిన్]], [[మొనాకో]], [[ఉత్తర కొరియా]] .
పంక్తి 231:
|1 1994 సెప్టెంబరు - 2001 ఆగస్టు 31
|స్టాన్లీ ఫిషర్
|{{Flagcountry|United States}} {{Flagcountry|Israel}}
|ఆర్థికవేత్త, సెంట్రల్ బ్యాంకర్, బ్యాంకర్
|-