"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
పర్షియా నుండి భారతదేశానికి తిరిగి వస్తున్న హుమాయూన్, మధ్య దారిలో కాబూల్ పాలకుడు, తిరుగుబాటు సోదరుడైన కమ్రాన్ ను ఓడించాడు. 1553 లో కాబుల్ ను ఆక్రమించినపుడు, అక్కడ కమ్రాన్ నిర్వహిస్తున్న చిత్రశాలను కూడా స్వాధీనం చేసుకొని ఉండవచ్చు. బహుశా ఇక్కడ వున్నప్పుడే హుమాయూన్, మీర్ సయ్యద్ ఆలీ చిత్రకారునితో తన వంశ పూర్వీకుడైన తైమూర్ కు సంబంధించిన "ప్రిన్సెస్ అఫ్ ది హౌస్ అఫ్ తైమూర్" (తైమూర్ ఇంటి రాజకుమారులు) అనే చిత్ర కళాఖండాన్ని సృష్టింపచేసి ఉండవచ్చు. 1553 నాటికి చెందిన ఈ చిత్రం 1.15 చదరపు మీటర్ల కొలతలు గల అతి పెద్ద వస్త్రంపై చిత్రించబడింది. ఇటువంటి పెద్ద చిత్రాలు పర్షియన్ చిత్రకళా సంప్రదాయంలో అసాధారణమైనప్పటికీ మంగోల్ చిత్రకళా సంప్రదాయంలో మాత్రం సాధారణం. ప్రస్తుతం ఇది లండన్ లోని బ్రిటిష్ మ్యూజియంలో వుంది.
 
ఆ తరువాత క్రీ.శ. 1555 లో భారతదేశానికి తిరిగి వచ్చినపుడు హుమాయూన్ తనతోపాటు ఇద్దరు ప్రఖ్యాత పర్షియన్ చిత్రకారులు-మీరు సయ్యద్ ఆలీ, క్వాజా అబ్దుస్ సమద్ లను భారతదేశానికి తీసుకొనివచ్చాడు. వీరు తరువాత కాలంలో చిత్రలేఖనంపై హంజనామా లేదా దస్తాన్-ఇ అమీర్ హంజా (Dastan-e Amir Hamza) అనే గొప్ప సచిత్ర గ్రంధం రచించారు. వీరి రాకతోనే భారతదేశంలో మొఘల్ చిత్రకళ ప్రారంభమైందని పేర్కొంటారు. హుమాయున్ సూచనల కనుగుణంగా, ఈ పర్షియన్ చిత్రకళాకారులు ‘నిజామి ఖమ్సా’తో సహా అనేక ప్రసిద్ధ చిత్రాలను రూపొందించారు. 36 ప్రకాశవంతమైన పేజీలతో వున్న నిజామి ఖమ్సా లోని చిత్రాలలో వివిధ కళాకారుల యొక్క విభిన్న శైలులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ చిత్రాలు సాంప్రదాయక పర్షియన్ కళా ప్రభావం నుండి బయటపడినట్లు కనిపిస్తాయి. ఇవి మాత్రమే కాకుండా హుమాయూన్, కుటుంబ సభ్యుల సమేతంగా తనను రెండు లఘుచిత్రాలలో చిత్రించడం కోసం కొందరు చిత్రకారులను నియమించాడని తెలుస్తుంది. పర్షియన్ కళా సంప్రదాయంలో ఇలా చిత్రించడం చాలా అరుదైనప్పటికీ మొగలులలో ఇది సాధారణ విషయం.
 
===అక్బర్ (1556-1605)===
6,826

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2916113" నుండి వెలికితీశారు