పుష్పం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి పరిపత్రాలు - పుష్పరచన
పంక్తి 51:
ఇందులో కూడా పుష్పాసనం గిన్నె మాదిరి ఉండినప్పటికి, అండకోశం గిన్నె అడుగు భాగంలో, గిన్నె అంచు భాగంలో రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి ఉంటాయి.
 
== పరిపత్రాలు - పుష్పరచన ==
పుష్పంలోని నాలుగు ప్రధాన భాగాలలో వెలుపలి వలయంలో ఉండు రెండు భాగాలైన రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళిని ''పరిపత్రాలు'' అంటారు. పుష్పం మొగ్గదశలో ఉన్నప్పుడు ఈ రెండు భాగాలు అమరి ఉండు విధానాన్నే పుష్పరచన అంటారు. ఇవి మూడు రకాలు. అవి...
 
=== వివృత పుష్పరచన ===
రక్షక పత్రావళి లేదా ఆకర్షణ పత్రావళిలోని వాటి భాగాల అంచులు ఒక దానితో ఒకటి తగలకుండా దూరంగా అమరి ఉంటాయి. ఉదా: క్రూసిఫెరి
 
=== కవాటయుత పుష్పరచన ===
రక్షక పత్రావళి లేదా ఆకర్షణ పత్రావళిలోని వాటి భాగాల అంచులు ఒక దానితో ఒకటి కలిసిపోయి అమరి ఉంటాయి. ఉదా: కంపోజిటే
 
=== చిక్కైన పుష్పరచన ===
రక్షణ పత్రావళి లేదా ఆకర్షణ పత్రావళిలోని వాటి భాగాల అంచులు ఒక దానితో ఒకటి తాకుతూ అమరి ఉంటాయి. ఈ విధమైన అమరిక మూడు రకాలు. అవి...
 
==== అవరోహక ఇంబ్రికేట్ ====
పరిపత్రాలలో ప్రతి ఒక భాగం దాని ముందున్న భాగాన్ని కప్పుతూ ఉంటుంది. ఉదా: పాపిలియోనేసి
 
==== ఆరోహక ఇంబ్రికేట్ ====
పరిపత్రాలలో ప్రతి ఒక భాగం దాని వెనుకున్న భాగాన్ని కప్పుతూ ఉంటుంది. ఉదా: సిసాల్ఫినేసి
 
==== క్విన్ కన్‌షియల్ ====
ఈ రకపు పుష్పరచనలో 5 పరిపత్రాలు ఉంటాయి. వీటిలో రెండు పూర్తిగా లోపలికి, రెండు వెలుపలికి, మిగిలిన పరిపత్రపు ఒక అంచు లోపలికి, మరో అంచు వెలుపలికి ఉంటుంది. ఉదా:ఇంపోమియా
 
=== ఆకర్షణ పత్రాలు ===
సంపూర్ణ పుష్పంలో రెండవ వలయాన్ని ఆకర్షణ పత్రాలు అంటారు. ఇవి వివిధ వర్ణాలలో ఉండి, కీటకాదులను ఆకర్షించి, పరాగ సంపర్కానికి ఉపయోగపడతాయి. ఇవి అసంయుక్తంగా గాని, సంయుక్తంగా గాని అమరి ఉంటాయి.
 
==== అసంయుక్త ఆకర్షణ పత్రాలు ====
1.శిలువాకారపు ఆకర్షణ పత్రాలు. ఉదా: బ్రాసికేసి
 
2.రోజేషియాస్ ఆకర్షణ పత్రాలు. ఉదా: [[మందార]]
 
3. కేరియో ఫిల్లేషియాస్ ఆకర్షణ పత్రాలు . ఉదా: కేరియో ఫిల్లమ్
 
4.పాపిలియోనేషియస్ ఆకర్షణ పత్రాలు . ఉదా:పాపిలియోనేసి
 
==== సౌష్టవయుత ఆకర్షణ పత్రాలు ====
1. గరాటు ఆకారపు ఆకర్షణ పత్రాలు. ఉదా: [[ఉమ్మెత్త]]
 
2. నాళికాకారపు ఆకర్షణ పత్రాలుఉదా:కంపొజిటే
 
3. గంటాకారపు ఆకర్షణ పత్రాలు ఉదా: కుకుర్బిటేసి
 
4. హైపోక్రెటారిఫార్ం. ఆకర్షణ పత్రాలుఉదా: బిళ్ళగన్నేరు
 
5. రొటేట్ ఆకర్షణ పత్రాలు ఉదా: [[జిల్లేడు]]
 
==== పాక్షిక సౌష్టవయుత ఆకర్షణ పత్రాలు ====
1.నాళికాకారపు ఆకర్షణ పత్రాలు ఉదా: కంపొజిటే కుటుంబంలోని కిరణపుష్పకాలు
 
2. పెదవి ఆకారపు ఆకర్షణ పత్రాలు ఉదా: [[తులసి]]
 
3. ముఖబద్ద ఆకారం.ఆకర్షణ పత్రాలు ఉదా: [[కనకాంబరాలు]]
<br />
== పుష్పం ప్రత్యేకత, పరాగసంపర్కం ==
[[పుప్పొడి]]<nowiki/>ని బదిలీ చేయడానికై, పుష్పించే మొక్కలు ఒత్తిడిని ఎదుర్కొంటాయి, ఇది మొక్కల స్వభావ తీరును పుష్ఫాల స్వరూప శాస్త్రంలో విలక్షణంగా ప్రతిబింబిస్తాయి. పుప్పొడి, వివిధ వాహనాల ద్వారా మొక్కల మధ్య బదిలీ అవుతుంది. కొన్ని మొక్కలు జీవం లేని వాటిని వాహనాలుగా ఉపయోగించుకొంటాయి -ఉదాహరణకు గాలి (అనేమోఫిలీ), కొన్ని సందర్భాల్లో నీటిని హైడ్రోఫిలీ, ఇతర జీవ వాహనాలు -కీటకాలు (ఏంటోమొఫిలీ), పక్షులు (ఒర్నితోఫిలీ), గబ్బిలాలు (చిరోప్తేరోఫిలీ) లేక ఇతర జంతువులు. కొన్ని మొక్కలు బహుళ వాహనాలను వాడుకొంటాయి, కాని ఇవన్నీ చాలా ప్రత్యేకమైనవి.
"https://te.wikipedia.org/wiki/పుష్పం" నుండి వెలికితీశారు