"వెన్నా వల్లభరావు" కూర్పుల మధ్య తేడాలు

వెన్నా వల్లభరావు [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] మండలం, [[బేతవోలు]] గ్రామంలో వెన్నా హనుమంతరావు, లక్ష్మీనాగేశ్వరమ్మ దంపతులకు 1956లో జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్య బేతవోలు గ్రామంలో, కాలేజీ విద్య [[గుడివాడ]]లో పూర్తి అయ్యింది. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఎ., "భగవతీ చరణ్ వర్మాకే ఉపన్యాసోమే వ్యక్తి ఔర్ సమాజ్" అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి పట్టాలను అందుకున్నాడు. ఇతడు తన ఉపాధ్యాయులు యార్లగడ్డ అంకినీడు, కొచ్చెర్లకోట వెంకట సుబ్బారావుల ప్రోత్సాహంతో హిందీ భాషపట్ల మక్కువ పెంచుకున్నాడు. కళాశాలలో చేరే సమయానికే హిందీ ప్రచారసభ వారి అన్ని పరీక్షలు పూర్తి చేశాడు. చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలోని [[ఆంధ్ర లయోలా కళాశాల]]లో హిందీ అధ్యాపకుడిగా చేరి 2014లో అక్కడే హిందీ విభాగాధిపతిగా పదవీవిరమణ చేశాడు.
==రచనలు==
ఇతడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజులలో [[యార్లగడ్డ లక్ష్మీప్రసాద్]], హిందీ విభాగాధిపతి ఆదేశ్వరరావుల ప్రోత్సాహంతో అనువాద రచనకు శ్రీకారం చుట్టాడు.
 
==పురస్కారాలు==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2932728" నుండి వెలికితీశారు