గృహలక్ష్మి మాసపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''గృహలక్ష్మి మాసపత్రిక''' ఒక ప్రత్యేకంగా [[మహిళ]]ల కోసం ప్రముఖ వైద్యులు [[కే. ఎన్. కేసరి]] నడిపించిన మాసపత్రిక. ''స్త్రీల ఆరోగ్యసౌభాగ్యములను పెంపొందించుట కేర్పడిన సచిత్ర మాసపత్రిక'' అని ఈ పత్రిక ప్రకటించుకుంది.
 
[[గరిమెళ్ల సత్యనారాయణ]] ఈ పత్రికకు 1930లలో కొంతకాలం సంపాదకునిగా పనిచేశారు. ఈ పత్రిక స్వంత ముద్రణాలయం లోధ్ర ప్రెస్‌లో ముద్రించబడింది.
 
==వ్యవస్థాపకులు==
'''కె.ఎన్.కేసరి''' (జననం-[[1875]]. మరణం-[[1953]]) గా పేరు పొందిన ఈయన అసలు పేరు '''కోట నరసింహం'''. ప్రముఖ ఔషదశాల '[[కేసరి కుటీరం]]' స్థాపకుడు. కేసరి కోట నరసింహం చేతికి ఎముకలేని దానశీలిగా ప్రసిద్ధి గాంచారుపేరొందాడు. స్త్రీ జనోద్దరణకై ఈ పత్రికను స్థాపించాడు.
==విశేషాలు==
ఈ పత్రిక తొలి సంచిక మార్చి 1928లో వెలువడింది. ఈ పత్రిక 1942లో అనివార్యమైన యుద్ధపరిస్థితులలో తాత్కాలికంగా నిలిచిపోయి 1946లో తిరిగి ప్రారంభమైంది. ఈ పత్రికలో ప్రతి సంచికలోనూ [[సి.ఎన్.వెంకటరావు]] మొదలైన ప్రసిద్ధ చిత్రకారుల తైలవర్ణ చిత్రాలు ప్రచురించేవారు. [[కనుపర్తి వరలక్ష్మమ్మ]], [[వావిలికొలను సుబ్బారావు]], [[కల్లూరు అహోబలరావు]], [[విశ్వనాథ కవిరాజు]], [[గంటి కృష్ణవేణమ్మ]], [[వెల్లాల ఉమామహేశ్వరరావు]], [[దుర్గాబాయి దేశముఖ్|గుమ్మడిదల దుర్గాబాయమ్మ]], [[అనుముల వెంకటశేషకవి]], [[బుచ్చిబాబు (రచయిత)|శివరాజు వెంకట సుబ్బారావు]], [[కవికొండల వెంకటరావు]], [[అంగర వెంకటకృష్ణారావు]] మొదలైనవారి రచనలు ఉన్నాయి.
పంక్తి 49:
==గృహలక్ష్మి స్వర్ణకంకణము==
{{main|గృహలక్ష్మి స్వర్ణకంకణము}}
20వ శతాబ్దంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు కె.యన్. కేసరి 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, తదితర రంగాలలో విశిష్టసేవ చేసిన స్త్రీలను సత్కరిస్తున్నారు. ఆధునిక యుగంలో స్త్రీలని క్రమపద్ధతిలో ఏటా సత్కరించడం ఈ స్వర్ణకంకణముతో మొదలయింది. ఇంతవరకు సుమారు ఒక 60 మంది మహిళలు గృహలక్ష్మి స్వర్ణకంకణముతో సత్కారం పొందారు.
 
==మూలాలు==