శుక్రుడు జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

శుక్ర గ్రహం - దోష నివారణ శుక్రుడు రాక్షసులకు గురువు. భృగు పుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీ గ్రహం. తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. ఋతువు - వసంతం, జాతి -బ్రాహణ, అధి దేవత - ఇంద్రాణి. రుచులలో పులుపుకు ప్రతీక, 7 సంవత్సరాల వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. తత్వం-జలతత్వం, దిక్కు - ఆగ్నేయము, రత్నము - వజ్రం, లోహం -వెండి, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము -రజోగుణం, ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంత...
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2409:4070:2E2C:9F0D:0:0:DE08:3801 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2940173 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1:
శుక్రశుక్రుడు రాక్షస గురువు, భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం. రుచులలో పులుపుకు ప్రతీక, తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. జాతి -బ్రాహణ, అధి దేవత - ఇంద్రాణి. ఏడు సంవత్సరాల వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. శ్లేష్మ, వాత ప్రకృతిని సూచిస్తాడు. తత్వము -జలతత్వం, దిక్కు -ఆగ్నేయము, రత్నము -వజ్రము, లోహము -వెండి, ఋతువు -వసంతం, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము -రజోగుణము, ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. రవి, చంద్రులు శత్రువులు. శని, బుధులు మిత్రులు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం ఇరవై సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.శుక్ర గ్రహం రచన డా.కోమర్రాజు భరద్వాజ్ శర్మ - దోష నివారణ
శుక్రుడు రాక్షసులకు గురువు. భృగు పుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీ గ్రహం. తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. ఋతువు - వసంతం, జాతి -బ్రాహణ, అధి దేవత - ఇంద్రాణి. రుచులలో పులుపుకు ప్రతీక, 7 సంవత్సరాల వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. తత్వం-జలతత్వం, దిక్కు - ఆగ్నేయము, రత్నము - వజ్రం, లోహం -వెండి, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము -రజోగుణం, ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. రవి, చంద్రులు శత్రువులు. శని, బుధులు మిత్రులు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం 20 సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.
శుక్రలగ్నం 1 నుంచి 6వ స్థానం వరకు ఆధిపత్యం వహిస్తే శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. శుభానికి అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఆధిపత్యం వహిస్తే ఆ జాతకులు ఆయుష్మంతంగా జీవిస్తారు. ధైర్యవంతులుగా ఉంటారు. ఇతరులను తమ ఆధీనంలోకి తీసుకుని అధికారం చెలాయించే సామర్థ్యం గలవారుగా ఉంటారు. ఎటువంటి కార్యాన్నై‌నా పట్టుదలతో పూర్తి చేస్తారు.
శుక్రుడు రెండోస్థానంలో ఉంటే కుటుంబ బాధ్యతలను చేపడతారు. పెద్దలకు మర్యాద ఇవ్వటంలో, కుటుంబ సభ్యులతో ఆనందదాయకంగా గడుపుతారు. విద్యారంగంలో రాణిస్తారు. సాధు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులను ఆకర్షించే ఛాయను కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు. భాగస్వాముల మధ్య అనుచరులుగా ఉంటారు. మూడో స్థానంలో శుక్రుడు ఆధిపత్యం వహిస్తే గట్టి పట్టుతో ఏ కార్యాన్నైనా సాధిస్తారు. కళలను ఆస్వాదించే వారుగా ఉంటారు. ప్రయాణాలలో ఆసక్తి చూపుతారు. భోజనప్రియులుగా ఉంటారు.
4వ స్థానంలో ఆధిపత్యం వహిస్తే పరిశోధనలో ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. మంచి స్నేహితుల సహకారం అందుతుంది. 5వ స్థానంలో ఉంటే బుద్ధికుశలత కలిగి ఉంటారు. రాజకీయ ప్రవేశం చేయటం జరుగుతుంది. క్రీడలు వంటి వినోదాత్మక రంగాల్లో ఆసక్తి చూపుతారు. ఆరో స్థానంలో ఆధిపత్యం వహిస్తే జీవితంలో కష్టసుఖాలు సమపాళ్లలో లభిస్తాయి. యోగాలను లభించటం వంటివి జరుగుతాయి. శత్రువుల చెడును ఎదురించే పోరాడగలిగే యోధులుగా ఉంటారు.
శుక్ర కారణ వ్యాధులు
శుక్ర ప్రభావం వల్ల గర్భాశయ వ్యాధులు, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాదులు ఏర్పడతాయి. కుజుడితో కలిసిన గొంతు నొప్పి. టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి. బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం, శనితో కలిసిన సుఖ వ్యాధులు, రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాదులు, కేతువుతో కలిసిన సంతాన లేమి మొదలైన వ్యాధులకు శుక్రుడు కారకుడు.
శుక్ర గ్రహ నివారణ కోసం..
శుక్రగ్రహ నివారణ కోసం చేయాల్సిన కార్యక్రమాల్లో ఇది ఒకటి. మేడి చెట్టు శుక్రుని వృక్షము. ప్రతి శుక్రవారం ఉదయం అయిదున్న నుంచి ఆరున్నర లోపు చిన్న రాగి లేదా ఇత్తడి, స్టీల్..(ఇందులో ఏదైనా పర్వలేదు) చెంబు తీసుకుని దానిలో నీటిని పోసి గంధం కలిపి, ఆ నీటిని మేడి చెట్టుకు పోయాలి. అక్కడే దీపం వెలిగించాలి. దానిని పూజించి రావాలి. ఇలా చేసిన రోజు సాయంత్రం తెల్లటి గుడ్డ, అనుమాలు దానం ఇవ్వండి. ఇలా పదహారు వారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల వారి శుక్ర దోషానికి పరిహారమగును. నిజానికి మేడి చెట్టు దేవాలయములకు అందుబాటులో ఉంది.
 
== కారకత్వములు ==
"https://te.wikipedia.org/wiki/శుక్రుడు_జ్యోతిషం" నుండి వెలికితీశారు