అహ్మద్ నగర్ కోట: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశ కోటలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎చరిత్ర: Typo fixing, typos fixed: → , ) → )
పంక్తి 4:
 
== చరిత్ర ==
[[File:GRAY(1852)_pg339_AHMEDNUGGUR_-_DUMREE_MUSJID.jpg|link=https://en.wikipedia.org/wiki/File:GRAY(1852)_pg339_AHMEDNUGGUR_-_DUMREE_MUSJID.jpg|thumb|250x250px|అహ్మద్ నగర్ కోట (ఎడమ) ]]
ఈ కోటను మాలిక్ అహ్మద్ నిజాం షా, సుమారుగా 15, 16 శతాబ్దాలలో నిర్మించాడు. అహ్మద్ నగర్ పట్టణానికి ఆ పేరు అతడి పేరిటే వచ్చింది. అతడు నిజాం షాహి వంశంలో తొలి సుల్తాను. తొలుత దీన్ని మట్టితో నిర్మించారు. తరువాత హుస్సేన్ నిజాం షా 1559 లో దీన్ని బలోపేతం చెయ్యడం మొదలుపెట్టి 1562 లో పూర్తి చేసాడు. 1596 ఫిబ్రవరిలో చాంద్ బీబీ మొగలుల దండయాత్రను తిప్పి కొట్టింది. కానీ 1600 లో అక్బరు మళ్ళీ దండెత్తినపుడు ఈ కోటా మొగలుల వశమై పోయింది.<ref name="mtdc">{{cite web|url=http://www.maharashtratourism.gov.in/MTDC/HTML/MaharashtraTourism/Default.aspx?strpage=../MaharashtraTourism/TouristDelight/Forts/AhmadnagarFort.html|title=Ahmednagar fort|publisher=Maharashtra Tourism Development Corporation|accessdate=2009-03-10}}</ref><ref name="sen2">{{Cite book|title=A Textbook of Medieval Indian History|last=Sen|first=Sailendra|publisher=Primus Books|year=2013|isbn=978-9-38060-734-4|pages=164}}</ref><ref>{{Cite book|title=Advanced study in the history of medieval India.|last=Mehta, Jaswant L.|date=1990|publisher=Sterling Publ|isbn=9788120710153|location=|pages=271|oclc=633709290}}</ref>
 
ఔరంగజేబు తన 88 వ ఏట 1707 ఫిబ్రవరి 20 న ఈ కోట లోనే మరణించాడు. 1724 లో ఈ కోట నిజాముల వశమైంది. 1759 లో మరాఠాలకు ఆ తరువాత 1790 లో సిందియాలకూ చేజిక్కింది. రెండవ మాధవరావు మరణం తరువాత ఏర్పడిన అస్థిర పరిస్థితుల్లో దౌలత్ సిందియా ఈ కోటను, దాని చుట్టుపట్ల ఉన్న ప్రాంతాన్నీ వశపరచుకున్నాడు. 1797 లో అతడు నానా ఫడ్నవీసును ఈ కోటలోనే బంధించాడు.
 
1803 లో రెండవ [[ఆంగ్లో-మరాఠా యుద్ధాలు|ఆంగ్లో మరాఠా యుద్ధం]]<nowiki/>లో [[వెల్లెస్లీ|వెల్లస్లీ]] మరాఠాలను ఓడించడంతో ఈ కోట [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|ఈస్టిండియా కంపెనీ]] పరమైంది..
"https://te.wikipedia.org/wiki/అహ్మద్_నగర్_కోట" నుండి వెలికితీశారు