వేంగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 172:
==ఇతరాలు==
{{main|నన్నయ}}
* పైన చెప్పినట్లుగా వేంగి రాజ్యం, తూర్పు చాళుక్యుల పాలన తెలుగువారి చరిత్రలో సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న కాలం. నన్నయ భట్టు, నారాయణ భట్టు మహాభారత ఆంధ్రీకరణను ప్రారంభించారు. ఈ కాలంలోనే శాసనాలలో తెలుగు కనిపించ సాగింది. కుబ్జవిష్ణువర్ధనుని చేజెర్ల శాసనంలో సగం పైగా తెలుగు. అతని కుమారుడు జయసింహ వల్లభుని విప్పర్ల, మాచెర్ల శాసనాలు తెలుగు. వేంగి రాజ్యానికి సమాంతరంగా నడచిన రేనాటి చోడులు కూడా తమ శాసనాలు తెలుగులో వేయించారు. వానిలో ధనంజయుని [[కలమళ్ళ శాసనం]] (క్రీ.శ.575) మనకు లభించిన మొట్టమొదటి [[తెలుగు శాసనాలు|తెలుగు శాసనం]].
* చరిత్రలో చాలా సార్లు జరిగినట్లుగానే రాజవంశాలలోని అంతఃకలహాలు, పొరుగు రాజ్యాల సామ్రాజ్య విస్తరణాకాంక్ష దేశాన్ని బలపడకుండా చేశాయి. వేంగి, ధరణికోట, యనమదల, కంభం, నెల్లూరు వంటి వగరాలు పలుమార్లు ధ్వంసం చేయబడ్డాయి.
* ఈ కాలంలో రాయలసీమ, తెలంగాణ ప్రాంతం ఎక్కువ భాగం ఇతర రాజుల సామంతరాజుల పాలనలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు