పి.హేమలత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
ఆమె స్వస్థలం [[కృష్ణా జిల్లా]]<nowiki/>లోని [[గుడివాడ]]. ఆమె 1926లో జన్మించింది. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పెద్ద అభిలాష ఉండేది కాదు. అయితే ఆమె భర్త శేషగిరి రావు ప్రోత్సాహంతో నటిగా కెరీర్ ప్రారంభించింది. శేషగిరిరావు నాటక కళాభిమాని, రంగస్థల నటుడు కావడంతో ఆమెను నాటకాలలోకి ప్రవేశ పెట్టాలని అభిలషిస్తూ ఉండేవారు. ఏలూరు నాటక కళా పరిషత్తులో రావూరి గారు రచించిన "పరితాపం" అనే నాటకంలో ఆమె భర్త సహకారంతో నటించింది. తొలిసారిగా నటించినందుకు ఆమెకు బహుమతి కూడా వచ్చింది. మొదటి ప్రయత్నంలోనే ప్రత్యేక బహుమతి పొందిన ఆమెను పాలకొల్లు అదర్శ మండలి పినిశెట్టి శ్రీరామమూర్తి తమ నాటకం "పల్లె పడుచు" లో ఆమె చేత జమీందారిణి రమాదేవి పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు. ఈ నాటకం ఆంద్ర ప్రదేశ్ అంతా ప్రదర్శించబడి జమీందారిణి పాత్రలో అందరికీ సుపరితురాలింది.
 
 
 
== సినీరంగ జీవితం ==
[[నందమూరి తారక రామారావు|యన్టీఆర్]] హీరోగా [[తాతినేని ప్రకాశరావు]] దర్శకత్వంలో రూపొందిన '[[పల్లెటూరు (సినిమా)|పల్లెటూరు']] చిత్రంతో హేమలత సినిమారంగంలో అడుగు పెట్టింది. అప్పటి నుంచీ యన్టీఆర్, ఏయన్నార్ వంటి అగ్రకథానాయకుల చిత్రాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ వచ్చింది. ముఖ్యంగా యన్టీఆర్ నటించిన పలు చిత్రాల్లో ఆయనకు తల్లిగా నటించి అలరించింది. అనేక చిత్రాల్లో సాధుమూర్తిగా నటించిన హేమలత '[[బలిపీఠం (సినిమా)|బలిపీఠం]]' వంటి చిత్రాల్లో గయ్యాళి పాత్రలూ పోషించింది.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-130931#!|website=www.andhrajyothy.com|access-date=2020-07-12}}</ref> ఆమె శోభ, [[మహాకవి క్షేత్రయ్య]], [[అంతా మనవాళ్లే|అంతా మన వాళ్లే]], [[వరకట్నం (సినిమా)|వరకట్నం]] [[పరివర్తన (1954 సినిమా)|పరివర్తన]], [[కన్యాశుల్కం (సినిమా)|కన్యాశుల్కం]], [[భాగ్యదేవత|భాగ్య దేవత]], [[అత్తలు కోడళ్లు|అత్తలు-కోడళ్లు]] మొదలైన చిత్రాలలో నటించింది.
"https://te.wikipedia.org/wiki/పి.హేమలత" నుండి వెలికితీశారు