"అంగ్ సాన్ సూకీ" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (clean up, replaced: మరియు → , (18), typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు (2), అక్టోబర్ → అక్టోబరు, లొ → లో, ఆర్ధిక → ఆర్థిక)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
}}
 
'''ఆంగ్ సాన్ సూకీ''' 1945 [[జూన్]] మాసంలో జన్మించింది. ఆమె బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. ఆమె [[బర్మా]]లో ప్రముఖ రాజకీయవాది, "నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ " (ఎన్ ఎల్ డి) చైర్ పర్సన్. 1990 జనరల్ ఎన్నికలలో ఎన్ ఎల్ డి 59% ఓట్లను, 81% (మొత్తం 485 స్థానాలలో 382 స్థానాలు) [[పార్లమెంట్]] స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఆమె 1987 నుండి 2010లో విడుదల అయ్యేవరకూ దాదాపు 15 సంవత్సరాలకాలం గృహనిర్బంధంలోనే ఉంచబడింది. ఆమె [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో ప్రముఖ రాజకీయఖైదీగా గుర్తించబడింది.
 
సూకీ 1990లో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో, షాఖ్రోవ్ పురస్కారం అందుకున్నది. 1991లో [[నోబుల్ బహుమతి]] అందుకున్నది. [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం]] అంతర్జాతీయ అవగాహన కొరకు ఆమెకు జవహర్ లాల్ పురస్కారం ఇచ్చింది.[[వెనుజులా]] ప్రభుత్వం ఆమెకు " సైమన్ బోలీవర్ " పురస్కారం ఇచ్చి గౌరవించింది. 2007 లో [[కెనడా]]
ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ 19 తారీఖున రంగూన్ (ప్రస్తుతం యాంగన్) లో పుట్టింది. ఆమె తండ్రి అయిన [[ఆంగ్ సాన్]] 1947 లో బర్మా సైన్య స్థాపకుడే కాక బర్మీయుల స్వాతంత్ర్యం కొరకు ఆంగ్లేయులతో దౌత్యం నడిపాడు. అదే సంవత్సరం ఆయన తన రాజకీయ శత్రువుల చేత కాల్చి చంపబడ్డాడు. ఆమె తన తమ్ములైన సాన్ లిన్, ఆంగ్ సాన్ ఊ తల్లి పోషణలో బర్మాలో నివసించారు. ఆంగ్ సాన్ ఊ తమ ఇంటి వద్ద ఉన్న అలంకార సరస్సులో పడి తన ఎనిమిదవ సంవత్సరంలో మరణించాడు. పెద్ద సహోదరుడైన సాన్ లిన్ [[కాలిఫోర్నియా]] లోని శాన్ డియోగోకు వలస వెళ్ళి తరువాత సంయుక్తరాష్ట్రాల పౌరుడు అయ్యాడు. ఆంగ్ సాన్ మరణించిన తరువాత [[కుటుంబము|కుటుంబం]] ఇన్యా లేక్ ప్రాంతానికి నివాసం మార్చుకున్నది. అక్కడ సూకీకి వైవిధ్యమైన నేపథ్యం కలిగిన ప్రజల పరిచయం అయింది. రాజకీయ నేపథ్యం, మతం వాటిలో ప్రధానమైనవి. సూకీ " మెథడిస్ట్ ఇంగ్లీషు ఉన్నత పాఠశాల"లో విద్యాభ్యాసం సాగించింది. ఆమె తరువాత [[బౌద్ధ]] మతానికి చెందినది.
 
సూకీ తల్లి ఖిన్‌కీ కొత్తగా రూపొందించబడిన బర్మా ప్రభుత్వంలో రాజకీయ ప్రాముఖ్యత సంపాదించింది. 1960లో ఆమె భారతదేశప్రభుత్వానికి , [[నేపాల్]] ప్రభుత్వానికి రాజకీయ ప్రతినిధులను నియమించింది. ఆమెను అనుసరించిన ఆంగ్ సాన్ సుకీ [[ఢిల్లీ]] లోని జీసెస్ అండ్ మేరీ స్కూల్ కాన్వెంటులో విద్యాభ్యాసం పూర్తిచేసి న్యూఢిల్లీ శ్రీ రాం కాలేజ్‌లో పట్టభద్రురాలైంది. ఆమె 1964లో పొలిటికల్ పట్టభద్రురాలైంది. సూకీ తన విద్యాభ్యాసం కొనసాగించి 1969లో ఆక్స్‌ఫర్డ్ హాస్ కాలేజ్ నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్ , ఎకనమిక్స్ మాస్టర్ డిగ్రీ పొందింది. విద్యాభ్యాసం తరువాత ఆమె కుటుంబ మిత్రుడూ ఒకప్పుడు బర్మా పాప్ గాయకుడు అయిన మా తాన్ ఈతో [[న్యూయార్క్]] నగరంలో నివసించింది. ఆమె సంయుక్త రాష్ట్రాలలో మూడు సంవత్సరాలు ప్రణాళిక వ్యవహారాల శాఖలో పని చేసింది. 1971లో సూకీ టిబెటన్ సంస్కృతి స్కాలర్" డాక్టర్ మైకేల్ ఆరిస్"ను వివాహం చేసుకుని భూటాన్‌లో నివసించసాగింది. తరువాత సంవత్సరంలో ఆమె [[లండన్]] నగరంలో తన మొదటి సంతానమైన అలెగ్జాండర్ ఆరిస్‌కు జన్మనిచ్చింది. 1977లో ఆమె రెండవ కుమారుడైన కింకు జన్మనిచ్చింది. 1985-1987 మధ్య కాలంలో బర్మీస్ సాహిత్యంలో రీసెర్చ్ స్టూడెంటుగా లండన్ లోని " ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ " అనే [[పాఠశాల]]<nowiki/>లో పనిచేసింది. 1990లో ఆమె ఆనరరీ ఫెలోగా ఎన్నిక చెయ్యబడింది. తరువాత రెండు సంవత్సరాలు ఆమె సిమ్లాలోని " ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాంస్డ్ స్టడీస్ "లో ఫెలోగా ఉన్నది. ఆమె గవర్నమెంట్ ఆఫ్ యూనియన్‌లో కూడా పనిచేసింది.
 
1988లో బర్మాకు తిరిగి వచ్చిన సూకీ ప్రారంభంలో రోగగ్రస్థురాలైన తల్లి కొరకు అక్కడే ఉండి పోయింది. తరువాత మెల్లగా ప్రజాస్వామ్య ఉద్యమానికి [[నాయకత్వం]] వహించింది.
 
=== గృహనిర్బంధం ===
ఆంగ్ సాన్ సూకీ 21 సంవత్సరాల కాలంలో 15 సంవత్సరాలు గృహనిర్బంధంలోనే జీవితం గడిపింది. ఆమె రాజకీయజీవితం ఆరంభించిన కాలం నుండి ఆమెకు అనేక సందర్భాలలో తనపార్టీ నాయకులతో సమావేశాలు, విదేశీ అతిధులతో కలయిక వంటివి నిరాకరించబడ్డాయి. సూకీ ఒక ముఖాముఖిలో తాను గృహనిర్బంధంలో ఉన్న సమయయంలో ఆమె తన భర్త పంపిన మనస్తత్వ పుస్తకపఠనం, [[రాజకీయాలు]], జీవితకథలను చదవడంతో గడిపానని వివరించింది. ఆమె కొన్నిమార్లు [[పియానో]]<nowiki/>వాయించడం, అనుమతించిన అతిధులతో సమావేశాలు వంటి వాటితో ఆమె సమయం గడిచింది. మాధ్యమం కూడా సూకీని చూడడానికి వీలుపడకుండా కట్టడి చేయబడింది. 1994 సెప్టెంబరు 20 తేదీన పత్రికా సంపాదకుడైన మౌరిజియో జియూలినో ఆమె చాయాచిత్రాలు తీస్తున్న సమయంలో అధికారులతో అడ్డగించబడి ఫొటో ఫిలిం, టేపులు మిగిలిన వ్రాతలు స్వాధీనం చేసుకొనబడ్డాయి. బదులుగా ఆమె గృహనిర్బంధ కాలంలో 1994 లో బర్మా నాయకుడైన జనరల్ ఖిన్ న్యుయంట్ తో మొదటిసారిగా సమావేశం జరిగింది. సూకీ ఆరోగ్యం క్షీణించి కొన్ని సందర్భాలలో [[వైద్యశాల|ఆసుపత్రి]]<nowiki/>లో చేర్చబడింది.
 
బర్మా ప్రభుత్వం సూకీని అడ్డగించి గృహనిర్బంధంలో పెట్టడం బర్మాదేశం సమాజ శాంతి భద్రత లను, దేశ స్థిరత్వాన్ని భూస్థాపితం చేసినట్లు భావించబడింది. 1975లో అమలు చేయబడిన "స్టేట్ ప్రొటెక్షన్ ఏక్ట్" (ఈ చట్టం ప్రభుత్వానికి ప్రజలను విచారణ లేకుండా ఐదు సంవత్సరాల కాలం నిర్బంధంలో ఉంచడానికి అనుమతిస్తుంది), సెక్షన్ 22 చట్టం " తిరుగుబాటు దార్ల ప్రమాదం నుండి దేశాన్నిరక్షించాలి " అన్న కారణంతో అమలుకు తీసుకురాబడింది. ఆమె తన విడుదల కొరకు వదలకుండా అప్పీలు చేస్తూనే వచ్చింది. 2010 నవంబరు 12 న నిరంకుశ ప్రభుత్వం నేపథ్యంలో పనిచేసిన " యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యు.ఎస్.డి.పి)ఎన్నికలలో గెలిచిన తరువాత దాదాపు 20 సంవత్సరాల తరువాత నిరంకుశ ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీ విడుదల పత్రాలమీద సంతకం చేసింది. సూకీ గృహనిర్బంధం 2010 నవంబర్ 13 తేదీన ముగింపుకు వచ్చింది.
 
ఐఖ్యరాజ్యసమితి బర్మాప్రభుత్వ ఈ ఏకపక్ష ఖైదును గురించి తమ అభిప్రాయం తెలియజేస్తూ ఇది స్వాతంత్రాన్ని అణగదొక్కే ఈ ఏకపక్ష నిర్ణయం " ఆర్టికల్ 9 యూనివర్సల్ డిక్లరేషన్ " ప్రకారం మానవహక్కుల ఉల్లంఘన అని ఖండిస్తూ సుకీని విడుదల చేయమని బర్మా అధికారులను కోరింది. బర్మా అధికారులు ఆ అభ్యర్ధను తోసిపుచ్చింది. బర్మా ప్రభుత్వం తమ ప్రత్యుత్తరంలో " ఆంగ్ సాన్ సుకీని ఖైదు చేయలేదు, ఆమెను రక్షణ కొరకు మాత్రమే సురక్షితమైన నిర్బంధంలో ఉంచాము. తరువాత దేశీయ చట్టఉల్లంఘన నెపంతో సుకీ మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఆ చర్యలను మాయాన్మార్ పోలీస్ ఫోర్స్ అధికారి బ్రిగ్-జనరల్ ఖిన్-యి నిరాకరించాడు. 2007 జనవరి 18తేదీన
ప్రభుత్వం చేత నడుపబడుతున్న " న్యూ లైట్ ఆఫ్ మాయన్మార్ " నోబుల్ బహుమతి ధనాన్ని ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను చెల్లించకుండా దేశం వెలుపల వెచ్చించబడిందని సుకీని నిందిస్తూ ప్రచురించింది. ఐక్యరాజ్య యు.ఎస్ కు చెందిన ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌంసిల్ నిర్ణయంతో ఆ నిందారోపణ అపజయంపాలైంది. వారు ఇది అంతర్జాతీయ బధ్రతకు బెదిరింపని బర్మాప్రభుత్వాన్ని ఖందించారు. ఈ నిర్ణయం జుంటా ప్రభుత్వంతో బలంసిన సంబంధాలు కలిగి ఉన్న చైనాప్రభుత్వ బలమైన వ్యతిరేకత కారణంగా వీగిపోయింది. (తరువాత చైనా ప్రభుత్వం [[రష్యా]], [[దక్షిణ ఆఫ్రికా|దక్షిణాఫ్రికా]]<nowiki/>లతో చేరి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసింది).
 
2007 నవంబరులో సుకీ తన రాజకీయ మద్దతుదారులైన నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ నాయకులను ప్రభుత్వ మంత్రి సమక్షంలో కలుసుకున్నారు. [[ఐక్యరాజ్య సమితి|ఐక్యరాజ్యసమితి]] దూత ఇబ్రహీం గాంబారి రెండవసారి బర్మాకు వచ్చి వెళ్ళిన కొన్ని గంటల తరువాత జుంటా ప్రభుత్వ టెలువిషన్‌లో అధికారిక ప్రకటన చేసాడు. సుకీతో సంభాషించడానికి ఆహ్వానం ఎన్.ఎల్.డి నిర్ధారించిందని ఆ ప్రకటన సారాంశం. 2009 జూలై 3 తేదీన ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ బాన్ కీ-మూన్ బర్మాకు వెళ్ళి సుకీని విడుదల చేయమని ప్రజాప్రభుత్వ సంస్కరణలు చేయమని బర్మా ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువచ్చాడు. ఏమైనప్పటికీ ఆయన బర్మాను విడిచి పోయే సమయంలో జుంటా అధికారి సుకీని కలుసుకోవడానికి నిరాకరించడం వలన తాను చాలా నిరాశకు గురి అయ్యానని అన్నాడు. అలాగే ఆయన వారు ముఖ్యమైన అవకాశాన్ని జారవిడుచుకున్నందుకు కూడా తాను చాలా నిరాశకు గురి అయ్యానని బర్మా ప్రభుత్వ అధికారులతో అన్నాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2983364" నుండి వెలికితీశారు