కె. చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆయన → అతను (15), ఈయన → ఇతను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 17:
}}
 
'''[[చక్రవర్తి]]''' గుంటూరు జిల్లా, [[తాడికొండ]] మండలం, [[పొన్నెకల్లు]] వాస్తవ్యుడు . అతను అసలు పేరు '''కొమ్మినేని అప్పారావు'''. అతను దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. అతను 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. [[1936]] [[సెప్టెంబరు 8]]వ తేదీన జన్మించాడు. ప్రాథమిక విద్య పొన్నెకల్లు. గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ. అతను [[మేనమామ]] కుమార్తె అయిన రోహిణి దేవిని [[పెళ్ళి|వివాహం]] చేసుకొని 1958లో [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>తో [[చెన్నై|మద్రాసు]] చేరాడు. ఇతను రెండవ కుమారుడు [[కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి|శ్రీ]] కూడా తెలుగు సినిమా సంగీతకారుడిగా విశేశంగా రాణించాడు.
 
==అతను గురించి==
పంక్తి 26:
 
==సంగీత దర్శకునిగా==
''ఫలోమా'' అనే [[మలయాళ భాష|మలయాళ]] చిత్రం [[హిందీ భాష|హిందీ]] దబ్బింగుకి వచ్చింది, దానికి అప్పారావుని సంగీత దర్శకునిగా తీసుకున్నారు. టైటిల్స్‌లో అన్నీ హిందీ పేర్లే ఉన్నాయి, వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకని సినిమావారు అతనుకు చెప్పి చక్రవర్తిగా వేశారు. [[మూగ ప్రేమ]] (1970) చిత్రంకి అతను సంగీత దర్శ్కత్వం వహించారు, అందులోనూ చక్రవర్తి పేరు ఖాయమైంది. ఈ విధంగా అప్పారావు చక్రవర్తిగా మారాడు. [[మూగ ప్రేమ]]<nowiki/>లో పాటలు బాగున్నాయి అని పేరు వచ్చిన తరువాత, [[భలే గూఢచారి]] (1970), [[తల్లీ కూతురు]] (1971)లకు సంగీత దర్శకత్వం వహించారు. మూగ ప్రేమలో ''ఈ సంజెలో...'', ''నాగులేటి వాగులోన...'' పాటలు పేరు తెచ్చినట్లు, తల్లీ కూతురు పాటలు కూడా పేరు తెచ్చాయి. అయినా అతను అంతగా పేరు తెచ్చుకోలేదు. కొంత కాలం ప్రయత్నాలు అటూ-ఇటూ సాగాయి. వీటి మధ్య దర్శకుడు [[సి.ఎస్.రావు]] దగ్గర సహాయ దర్శకుడిగా చేరి [[నిలువు దోపిడి]], [[మళ్ళీ పెళ్ళి (1970 సినిమా)|మళ్ళీపెళ్ళి]], [[కంచుకోట]], [[పెత్తందార్లు]] సినిమాలకు పనిచేశాడు. మధ్య మధ్యలో తనకి ఇష్టమై శాఖ సంగీతాన్ని విడిచి పెట కుండా పాటలూ పాడేవాడు. [[శారద (1973 సినిమా)|శారద]] చిత్రంతో సినీ రంగంలో స్థిరపడ్డారు. [[అక్కినేని నాగేశ్వరరావు]]తో ప్రేమాభిషేకం, [[నందమూరి తారకరామారావు|ఎన్.టి.రామారావు‌]]తో [[కొండవీటి సింహం (1969 సినిమా)|కొండవీటి సింహం]] వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించి 850 తెలుగు చిత్రాలకు సంగీతాన్ని అందిచారు. చక్రవర్తి కొన్ని చిత్రాలలో కూడా నటించారు.చివరిసారిగా [[నిన్నే ప్రేమిస్తా]] చిత్రంలో [[సౌందర్య]] నాన్నగారిగా నటించారు.
 
== సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/కె._చక్రవర్తి" నుండి వెలికితీశారు