చదలవాడ ఉమేశ్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యము, విద్య: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 40:
 
==బాల్యము, విద్య==
ఉమేశ్ చంద్ర [[మార్చి 19]], [[1966]] న [[గుంటూరు]] జిల్లా [[పెదపూడి (అమృతలూరు మండలం)]] గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించారు. తండ్రి [[హైదరాబాదు ఆల్విన్]] సంస్థలో ఉద్యోగి. [[హైదరాబాద్]] పబ్లిక్ [[పాఠశాల]]<nowiki/>లో చదివిన పిదప [[నిజాం కళాశాల]] నుండి బి.ఎ. ([[1987]]), [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]] నుండి యం.ఎ. ([[1989]]) పట్టాలు పొందారు. రెండింటిలోను ప్రథముడిగా నిలచి [[బంగారం|బంగారు]] పతకాలు సాధించారు<ref>http://www.umeshchandra.org/</ref>.
 
==ఉద్యోగ పర్వము==
[[1991]]లో 'భారత పోలీస్ సేవ' లో ఎన్నికై, 'జాతీయ పోలీస్ అకాడెమీ' లో శిక్షణ పొందారు. [[1992]] నుండి [[1994]] వరకు [[వరంగల్లు]]లో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేశారు. "జన జాగృతి" కార్యక్రమము ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యారు. [[1994]] [[అక్టోబరు]]లో [[పులివెందుల]]<nowiki/>కు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి, సామాన్య ప్రజల అభిమానము చూరగొన్నారు. [[ఫిబ్రవరి]] [[1995]] లో [[వరంగల్లు]] తిరిగివచ్చి 'ప్రత్యేక విధుల అధికారి' గా నేరస్థులను అరికట్టారు. ప్రజలతో మమేకమై [[పోలీసులు|పోలీసుల]]<nowiki/>పై సంఘములోగల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు. [[1995]] [[జూన్]] లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది [[కడప జిల్లా]]కు తిరిగి వచ్చారు. [[జూన్]] [[1997]] నుండి [[ఏప్రిల్]] [[1998]] వరకు [[కరీంనగర్ జిల్లా]] పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించారు.
 
[[నవంబరు]] [[1998]] లో ఉప ఇనస్పెక్టర్ జనరల్ (సంక్షేమము, ఆటలు) గా పదోన్నతి పొందారు.
 
==విషాదము==
ఉమేశ్ చంద్ర [[సెప్టెంబరు 4]], [[1999]] న [[హైదరాబాదు]]<nowiki/>లో కారులో వెళ్తూ ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. ఆతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.<ref>http://www.indianexpress.com/ie/daily/19990905/ige05005.html</ref>.
 
[[సెప్టెంబరు 4]], [[2000]] న ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
"https://te.wikipedia.org/wiki/చదలవాడ_ఉమేశ్_చంద్ర" నుండి వెలికితీశారు