రామాయణ విషవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 5:
ఈ గ్రంథం వాల్మీకి రామాయణంపై ఆధారితమైనది. ఇది వాల్మీకి రామయణంలోని కాండాల వరుసక్రమాన్ని యధాతధంగా పాటిస్తుంది. [[బాలకాండ]], [[అయోధ్యకాండ]], [[అరణ్యకాండ]], కిష్కిందకాండ, [[యుద్ధకాండ]], [[సుందర కాండ|సుందరకాండ]], [[ఉత్తరకాండము|ఉత్తరకాండ]]. వాల్మీకి రామాయణం ఏడు అధ్యాయాలుగా వెలువడగా, విషవృక్షము మూడు భాగాలుగా వెలువడింది. ఒక్కొక్క భాగము దాదాపు 700 పేజీల [[పుస్తకము]]. అదే విధంగా వాల్మీకి రామాయణం 2,400 శ్లోకాలతో కూడుకున్నదైతే, రామయణ విషవృక్షం 16 పెద్ద కథలు, వాటికి అనుబంధంగా 11 వ్యాఖ్యానాలతో, విమర్శకు మద్దతుగా సంస్కృత మూలాన్ని ఉదహరిస్తూ 600 పాదపీఠికలతో కూడిఉన్నది.
 
రంగనాయకమ్మ ఈ గ్రంథ రచనకై [[తెలుగు లిపి]]<nowiki/>లో ప్రచురితమైన రెండు సంస్కృత మూల గ్రంథాల యొక్క సహాయం తీసుకొన్నది. వీటిలో శ్లోకాలకు ప్రతిపదార్ధాలతో పాటు, తెలుగులో టీకాతాత్పర్యాలు ఇవ్వబడినవి. ఈ రెండు గ్రంథాలు 1900-1955ల మధ్య గట్టుపల్లి శేషాచార్యులు, చదలవాడ సుందరరామశాస్త్రులచే రచించబడి శశిలేఖ ముద్రాక్షరశాల (చెన్నై), [[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] వారిచే ప్రచురించబడినవి.
 
ముఖ్యపాఠ్యం కాకుండా రామాయణ విషవృక్షానికి 1, 2 భాగాలకు పొడువాటి ముందుమాటలునూ, మూడవ భాగానికి చివరలో పెద్ద ఉపసంహార పాఠ్యమున్నూ ఉన్నాయి. ఈ మూడు భాగాలు మూడు సంవత్సరాలు వరుసగా 1974, 75, 76లలో వెలువడ్డాయి. ఇవి అనేక మార్లు పునర్ముద్రించబడ్డాయి కూడా. 200 వరకు మొదటి భాగం ఏడుసార్లు, రెండవ భాగం ఆరుసార్లు, మూడవ భాగం నాలుగుసార్లు ముద్రించబడ్డాయి.<ref>http://ranganayakamma.org/summary_of_vishavruksham.htm</ref>
"https://te.wikipedia.org/wiki/రామాయణ_విషవృక్షం" నుండి వెలికితీశారు