వేంగి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
క్రీ.శ.300 నుండి 1100 మధ్యకాలంలో తీరాంధ్రప్రాంతలో నెలకొన్న రాజ్యాన్ని ''''''వేంగి''' రాజ్యం''' అని, ఆ రాజ్యం రాజధాని లేదా ప్రధాన నగరాన్ని ''''''వేంగి''' నగరం''' లేదా '''విజయవేంగి''' అని చరిత్ర కారులు నిర్ణయిస్తున్నారు. అప్పుడు వేంగి అనబడే స్థలం ప్రస్తుతం [[పెదవేగి]] అనే చిన్న [[గ్రామం]]. ఇది [[పశ్చిమగోదావరి జిల్లా]]లో [[ఏలూరు]] పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఉంది.
 
వేంగి రాజ్యం ఉత్తరాన [[గోదావరి నది]], ఆగ్నేయాన మహేంద్రగిరి, దక్షిణాన [[కృష్ణా నది|కృష్ణానది]] మధ్య ప్రాంతంలో విస్తరించింది. వేంగి రాజ్యం [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]]<nowiki/>లో ఒక ముఖ్యమైన ఘట్టం. [[పల్లవులు]], [[శాలంకాయనులు]], [[బృహత్పలాయనులు]], [[తూర్పు చాళుక్యులు]], ముసునూరి కమ్మ నాయకులు వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు. వేంగి రాజ్యం ద్వితీయార్ధంలో, అనగా తూర్పు [[చాళుక్యులు|చాళుక్యు]]<nowiki/>ల కాలంలో (వీరినే "వేంగి చాళుక్యులు" అని కూడా అంటారు.) తెలుగు భాష రాజ భాషగా గైకొనబడి, పామర భాష (దేశి) స్థాయి నుండి సాహిత్య భాష స్థాయికి ఎదిగింది.
[[దస్త్రం:Pedavegi Archeological findings.JPG|right|300px|thumb|పెదవేగి త్రవ్వకాలలో బయల్పడిన శిల్పాలు. అక్కడి శివాలయంలో భద్రపరచబడినవి]]
 
== "వేంగి" పేరు ==
"వేంగి" అనే పేరు పురాతనమైనదిగా కనిపించడం లేదు. కంచి వద్ద 'వెంగో' లేక 'వేంగి' అనే పేరు ఉన్నదని, ఆంధ్ర దేశం మధ్యలో ఈ పేరు గల నగరం ఏర్పడడానికి కారణాన్ని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన [[చిలుకూరి వీరభద్రరావు]] ఈ విధంగా ఊహించాడు. ("ఆంధ్రుల చరిత్రము - ప్రధమ భాగము") <ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp [[ఆంధ్రుల చరిత్రము]] - చిలుకూరి వీరభద్రరావు] ప్రచురణ: విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి - 1910లో చెన్నపురి ఆనంద ముద్రణాశాల యందు ముద్రింపబడియెను. వెల 1-4-0. రాజపోషకులు: [[బొబ్బిలి]] రాజా, [[పిఠాపురం]] రాజా, [[మునగాల]] రాజా</ref> -
:ఈ దేశము పూర్వము నాగులచే పరిపాలింపబడెడిది. దక్షిణ దేశమందలి నాగులలో "అఱవలార్" ఒక తెగ. [[కాంచీపురం|కాంచీ]] పురమునకు దక్షిణదేశమున ఉండే వారు గనుక ఆ ప్రదేశం "ఆఱవనాడు" అనబడింది. కనుకనే టాలెమీ వంటి విదేశీ చరిత్రకారులు మైసోలియా (కృష్ణానది) దక్షిణ ప్రాంతాన్ని "ఆశార్‌నోరి" (అర్ వార్ నాయ్) అని పేర్కొన్నారు. మొట్టమొదట కృష్ణా గోదావరి మధ్య దేశం "కూడూహార విషయం" అనబడేది. దానికి రాజధాని "కూడూరా" ([[గూడూరు]] లేక గుడివాడ?). ఏ కారణము చేతనో రాజధాని మార్చుకొనవలసి వచ్చినది. సాలంకాయన గోత్రుడైన పల్లవరాజులలో నొకరు ఒక నూతన [[నగరము]]<nowiki/>ను నిర్మింపజేసి దానికి "బెబ్బులి" అనే అర్ధం వచ్చే "వేంగి" అనే పేరు పెట్టాడు. అక్కడినుండి పాలించే రాజులు వేంగిరాజులని, వారిచే జయింపబడిన దేశాన్ని వేంగి దేశమని అనడం మొదలుపెట్టారు. ... క్రీ.శ. 4 శతాబ్దంలో [[అలహాబాదు]] శాసనంలో వేంగిని ప్రస్తావించారు గనుక అంతకు పూర్వమే అనగా క్రీ.శ. 2వ లేదా 3వ శతాబ్దంలో వేంగి నగరం ఏర్పడి ఉండవచ్చును.
 
అసలు ఈ చిన్న గ్రామమే ఒకనాటి వేంగి మహానగరమా? అనే ప్రశ్నకు [[చిలుకూరి వీరభద్రరావు]] ఇలా వివరణ ఇచ్చాడు.
:వేంగీ దేశమునకు ముఖ్య పట్టణముగా నుండిన వేంగి నగరం కృష్ణా మండలంలోని యేలూరుకు ఉత్తరాన 8 మైళ్ళ దూరములోనున్నది. ఆ స్థానమున నిపుడు [[పెదవేగి]], చినవేగి అను పల్లెలు మాత్రమున్నవి. వీనికి [[దక్షిణం|దక్షిణము]]<nowiki/>గా 5 మైళ్ళ దూరమున [[దెందులూరు|దెందులూర]]<nowiki/>ను గ్రామం కలదు. ఈ గ్రామంనకు గంగన్నగూడెము, సేనగూడెము అను శివారు పాలెములు చుట్టునునున్నవి. ఇవియన్నియుంగలిసి ఒక మహా పట్ణముగనుండి వేంగీపురమని పిలువంబడుచుండెను. ఈ ప్రదేశమునందు శిధిలమైపోయిన [[శివాలయము]]లు పెక్కులు గలవు. జ్ఞానేశ్వరుని యొక్క విగ్రహములు నాలుగు దెందులూరుకు దక్షిణముగానున్న చెఱువు సమీపముననుండినవి. వానిలో నొకటి మిక్కిలి పెద్దదిగానున్నది. ఈ గ్రామంనకు [[తూర్పు]] ప్రక్కను భీమలింగము దిబ్బయను పేరుగల యెత్తైన యొక పాటి దిబ్బ గలదు. దానికుత్తరముగా నూకమ్మ చెఱువును, దాని నడుమనొక మట్టి దిబ్బయు, దానిపై రెండు రాతి నందులును గలవు. దానిని నారికేళవారి చెఱువని చెప్పుదురు. వాని గట్లపైని రెండు శిలా శాసనములు నిలువుగానుండియు, మరిరెండు సాగిలబడియు నుండినవి. [[పెదవేగి]]కిని, చినవేగికిని నడుమ మఱియొక మంటిదిబ్బ గలదు. వీనిన్నింటిని పరిశోధించి చూడగా వేంగీపురము మిక్కిలియున్నత స్థితి యందుండిన మహానగరముగానుండెననుటకు సందియము లేదు. .... వేంగీపురమనియెడి మహానగరమొకటి యిక్కడుండెనా యని కొందఱు సంశయించుచుండిరి గాని విజయదేవవర్మ యొక్కయు, విజయనందివర్మ యొక్కయు శాసనములా సంశయమును నివారించినవి. దండియను మహాకవి [[కొల్లేరు]]ను వర్ణించుచు దానికి ననతి దూరముగానుండిన యీ వేంగీపురమునే యాంధ్ర నగరియని పిలిచియున్నాడు. విజయదేవవర్మ, విజయనందివర్మ [[శాసనము]]<nowiki/>లలో నుదాహరింపబడిన చిత్రరధస్వామి దేవాలయమిప్పటికిని నిలిచియుండి యఅ పేరుతోనే పిలువంబడుచున్నది. (''ఈ రచన 1910లో ప్రచురితమయ్యింది'')
 
అయితే వేంగి అన్న పేరు పూర్వచారిత్రిక దశకు చెందిన అత్యంత పురాతనమైన గ్రామాల పేర్లలో ఒకటిగా డాక్టర్ పి.వి.పరబ్రహ్మశాస్త్రి వర్గీకరించారు.<ref>ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం:పి.వి.పరబ్రహ్మశాస్త్రి:ఎమెస్కో బుక్స్:2013 ప్రచురణ:పేజీ.23</ref>
 
== చరిత్రలో వివిధ దశలు ==
పూర్వ కాలంలో కాలి నడక మార్గాలు, [[ఓడ]] రేవులు జనుల ప్రయాణాలకు, వివిధ సంస్కృతుల మేళనానికి ముఖ్యమైన వేదికలు. [[యాత్రికులు]], పండితులు, వ్యాపారులు, [[కళాకారులు]] ఈ మార్గాలలో ప్రయాణిస్తూ భిన్న సంప్రదాయాల ఏకీకరణకు కారకులయ్యారు. వీటివల్లనే [[చరిత్ర]]<nowiki/>లో అధిక భాగం అనేక రాజ్యాలుగా ఉన్నా గాని భారతదేశం అనే బలమైన భావన అంకురించడం సాధ్యమయ్యింది. ఆంధ్ర తీరంలో (శాతవాహనుల కాలం నుండి) ఎన్నో [[ఓడ]] రేవులు ఉండేవి. వీటి ద్వారా దేశ, విదేశ వాణిజ్యం జరిగేది. ఈ మార్గాలలో ఆంధ్ర దేశం ముఖ్యమైన కూడలిగా ఉండేది. ఐదు ప్రధాన మార్గాలు "వేంగి" అనే చోట కలిసేవి. అందువల్లనే ఆంధ్ర రాజ్యమంటే వేంగి రాజ్యమని కూడా ఒకోమారు ప్రస్తావించబడేది. వీటిలో [[ఈశాన్యం|పూర్వోత్తర]] మార్గం కళింగ రాజ్యాలకు వెళ్ళేది. [[దక్షిణం|దక్షిణ]] మార్గం ద్రవిడ ప్రాంతాలకు, [[నైఋతి]] మార్గం [[కర్ణాటక]] దిశలోను, [[ఉత్తరం|ఉత్తర]] మార్గం కోసల దేశానికి, [[వాయువ్యం|పశ్చిమోత్తర]] మార్గం [[మహారాష్ట్ర]] ప్రాంతానికి దారి తీసేది. ఇవి ప్రధానంగా బౌద్ధ భిక్షువులు ప్రయాణించి [[బుద్ధుడు]] ఉపదేశించిన సందేశాన్ని వినిపించిన మార్గాలు. ఇప్పుడు బయల్పడిన ప్రధాన బౌద్ధారామ శిథిలాలు దాదాపు అన్నీ ఈ మార్గాలలో ఉన్నాయి. ([[నాగార్జున కొండ]], [[అమరావతి]] లేదా [[ధరణికోట]], ఘంటసాల వంటివి). వీటిలో కొన్ని [[అశోకుడు|అశోకుని]] కంటే ముందు కాలానివి.<ref>http://www.indiaprofile.com/religion-culture/buddhisminandhra.htm ఇది ఒక టూరిజమ్ వెబ్ సైటులో ఉన్నది. వారు ఈ విషయానికి ఆధారాలు తెలుపలేదు.</ref><ref>http://www.lakehouse.lk/mihintalava/gaya02.htm {{Webarchive|url=https://web.archive.org/web/20080625015649/http://www.lakehouse.lk/mihintalava/gaya02.htm |date=2008-06-25 }} శ్రీలంక బౌద్ధం సైటులోని సమాచారం</ref>
 
[[చిలుకూరి వీరభద్రరావు]], [[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు]], డి.సి.సర్కార్, Dr.Hultzsch, Dr.Fleet, Col.Todd, [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]], డా.గోపాలాచారి వంటి ప్రముఖ చరిత్రకారులు వేంగి రాజ్యం చరిత్రను అధ్యయనం చేశారు. [[కొల్లేరు]], [[దెందులూరు]], [[ఏలూరు]] శాసనాలు వేంగి చరిత్ర ప్రాంభ దశను అధ్యయనం చేయడానికి ప్రధాన ఆధారాలు. అయితే వీటిలో ప్రస్తావించిన "వేంగి" అనేది రాజ్యం పేరో, లేక నగరం పేరో స్పష్టంగా తెలియడంలేదు.<ref name="Gopalachari">Early_History_Of_The_Andhra_Country by K. Gopalachari, published by University_Of_Madras, (Research work in 1941)</ref>.
 
పెదవేగి సమీపంలో [[గుంటుపల్లె]], [[జీలకర్రగూడెం]], [[కంఠమనేనివారిగూడెం]] వంటి ప్రాంతాలలో క్రీ.పూ. 200 నాటి బౌద్ధారామ అవశేషాలు బయల్పడినందువలన [[శాతవాహనులు|శాతవాహనుల]], [[ఇక్ష్వాకులు|ఇక్ష్వాకుల]], కాలం నాటికే ఇది ఒక ముఖ్యమైన నగరం అయి ఉండే అవకాశం ఉంది. 4వ శతాబ్దంలో ఇక్ష్వాకుల సామ్రాజ్యం (విజయ పురి శ్రీపర్వత సామ్రాజ్యం) పతనమయ్యేనాటికి విజయవేంగిపురం ఒక పెద్ద నగరం. [[విష్ణుకుండినులు|విష్ణుకుండిను]]<nowiki/>ల కాలంలోను, తూర్పు [[చాళుక్యులు|చాళుక్యు]]<nowiki/>ల ఆరంభ కాలంలోను ఆంధ్ర దేశానికి రాజకీయంగాను, సాంస్కృతికంగాను వేంగిపురం ఒక ప్రధానకేంద్రంగా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది.<ref>The Ancient City of Vengipura : Archaeological Excavations at Peddavegi/I.K. Sarma. Delhi, Book India Publishing Co., 2002, ISBN 81-85638-15-2. https://www.vedamsbooks.com/ (''Vijaya Vengipura was a flourishing city in ancient Andhra after the decline of Sriparvata Vijayapuri of the Ikshvaku dynasty by about 4 century A.D. During the Vishnukundi and early Eastern Chalukyan rule Vengipura played a crucial role as a political centre as well as a great cultural capital of Andhradesa'')</ref>
 
*
* పల్లవులు - క్రీ.శ. 440 - 616 - వీరి రాజధాని [[వినుకొండ]]. వీరి రాజ్యంలో వేంగి కూడా ఒక ముఖ్య నగరం.
* తూర్పు చాళుక్యులు - క్రీ.శ. 616 నుండి 1160 వరకు. పల్లవులనుండి వేంగి నగరాన్ని జయించి కుబ్జవిష్ణువర్ధనుడు (బాదామిలోని తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యంగా) రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు చాళుక్యుల కాలం [[తెలుగు]] భాష పరిణామంలో ముఖ్య సమయం. వీరు [[తెలుగు]]<nowiki/>ను అధికార భాషగా స్వీకరించి దాని ప్రగతికి [[పునాదులు]] వేశారు. వేంగి రాజ్యంలో [[రాజమహేంద్రవరం]] ఒక మణిగా వర్ణించబడింది. క్రమంగా (కొన్ని యుద్ధాలలో వేంగి ప్రాంతాన్ని కోల్పోవడం వలన) తూర్పు చాళుక్యుల చివరి రాజులు తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు.
 
== శిధిలావశేషాలు ==
పంక్తి 35:
[[దస్త్రం:APvillage Pedavegi 1.JPG|250px|thumb|right|పెదవేగి గ్రామంలో పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో బయల్పడిన శిథిలాలు (ధనమ్మదిబ్బ?) ]]
పెదవేగిలోని ధనమ్మ దిబ్బ వద్ద జరిపిన త్రవ్వకాలలో దిబ్బ మధ్యన పెద్ద రాతి కట్టడము బయల్పడినది. దీనిని ఒక [[బౌద్ధ మతము|బౌద్ధ]] స్థూపముగా గుర్తించారు.
ఆ ప్రదేశములో దొరికిన వస్తువులలో మట్టి పాత్రలు, ఒక రాతి బద్దలో చెక్కబడిన నంది, [[పూసలు]], కర్ణాభరణాలు, పాచికలు కూడా ఉన్నాయి. ఇంకో ప్రత్యేక కనుగోలు పారదర్శకమైన కార్నేలియన్ రాయితో తయారు చేసిన ఒక అండాకార భరిణె. 2x2x6 సె.మీల పరిమాణము కలిగిన ఈ భరిణపై ఒక దేవతామూర్తి చెక్కబడిఉన్నది. ఇది నగరాన్ని పర్యవేక్షించే [[గ్రామ దేవతలు|నగర దేవత]] అయ్యుండవచ్చని పురావస్తు శాఖ భావిస్తున్నది.<ref>{{Cite web |url=http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom6.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-03-30 |archive-url=https://web.archive.org/web/20080224180055/http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom6.html |archive-date=2008-02-24 |url-status=dead }}</ref> చాలా శిల్పాలను [[శివాలయం]]<nowiki/>లోని వరండాలో ఉంచారు.
 
వేంగి రాజులు, ముఖ్యంగా శాలంకాయనులు "చిత్రరధస్వామి"ని పూజించినట్లు తెలుస్తున్నది (''భగవత్ చిత్రరధస్వామి పాదానుధ్యాతః''). ఈ చిత్ర రథ స్వామి [[శివుడు|శివు]]<nowiki/>ని రూపమో, [[విష్ణువు]] రూపమో, లేక [[సూర్యుడు|సూర్యు]]<nowiki/>ని రూపమో తెలియడం లేదు.<ref>Excerpts from Dr.Gopalachari Thesis: '' The tutelary deity of the Vaingeyakas was Citrarathasvami
("bhagavat Citraraihasvami padanudhyatah"). Sanskrit Lexicons
give Citraratha as the name of the sun, the vahana of Agni and some
పంక్తి 70:
పల్లవుల అధికారం కృష్ణానదీ తీరం దక్షిణ భాగానికే పరిమితమైన కాలంలో కృష్ణానది ఉత్తర తీరంలో కొద్దికాలం మాత్రమే బృహత్పలాయనుల అధికారం సాగింది. కనుక వేంగి ప్రాంతం వారి అధీనంలో ఉండి ఉండాలి. కాని వీరి గురించిన ఆధారాలు చాలా తక్కువ. ఒకే ఒక కొండముది తామ్రశాసనం ఆధారంగా వీరు 300 ముండి 325 వరకు రాజ్యం చేసినట్లు భావిస్తున్నారు. వీరి రాజధాని [[కోడూరు]] కావచ్చును.
 
ఇక్ష్వాకుల సామంతులైన బృహత్పలాయనులు కృష్ణానది [[ఉత్తర]] తీరంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. వీరి వంశచరిత్రను తెలిపే ఒకే ఒక శాసనం కొండముది తామ్ర (రాగి) శాసనం. [[గుంటూరు జిల్లా]]<nowiki/>లోని [[తెనాలి]] దగ్గరలో ఉన్న గ్రామమే ‘కొండముది’. ఈ శాసనాన్ని బృహత్పలాయన రాజు జయవర్మ వేయించాడు. ఇందులో జయవర్మ పూర్వీకుల గురించి ప్రస్తావన లేదు. ఐతే ఇతడు బృహత్పలాయన గోత్రీకుడని ఈ శాసనం తెలియజేస్తోంది.
 
జయవర్మ తన పదో రాజ్య పాలనా కాలంలో కూదూర హారంలోని ‘పాంతూర గ్రామాన్ని’ 8 మంది బ్రాహ్మణులకు బ్రహ్మధేయంగా దానమిచ్చాడు. ఇతని ఇష్టదైవం [[మహేశ్వరుడు]]. [[కొండముది]] శాసనం ప్రకారం ‘కూదూరు’ (గూడూరు) రాజధానిగా కృష్ణానది ఉత్తర తీరాన్ని పాలించినట్లు తెలుస్తోంది. జయవర్మ పల్లవుల చేతిలో ఓడిపోయాడు. పల్లవ శివస్కంధవర్మ దక్షిణదేశ రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్న సమయంలో జయవర్మ నాటి ‘కర్మరాష్ర్టం’ (కమ్మ రాష్ర్టం) లోని కొంత భాగాన్ని ఆక్రమించి ఉండొచ్చని బి.ఎస్.ఎల్. హనుమంతరావు అభిప్రాయం.<ref>[http://appscgroup1n2.blogspot.in/2013/06/blog-post_8.html ఎ.పి.పి.యస్.సి.గ్రూప్స్ బ్లాగు నుండి]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
పంక్తి 76:
== శాలంకాయనులు ==
{{main|శాలంకాయనులు}}
వేంగి రాజధానిగా పరిపాలించినట్లుగా స్పష్టమైన ఆధారాలతో (ఏలూరు శాసనం ద్వారా) తెలియవస్తున్న మొదటి రాజులు శాలంకాయనులు. "శాలంకాయన" అనేది గోత్రనామమని, వంశం పేరు కాదని తెలుస్తున్నందువలన చరిత్రకారులు వీరిని వర్ణించడానికి "వైంగేయికులు" అనే పదాన్ని వాడుతున్నారు. [[సముద్ర గుప్తుడు|సముద్రగుప్తు]]<nowiki/>ని [[అలహాబాదు]] ప్రశస్తిలో కూడా "వైంగేయక" అనే చెప్పబడింది.<ref name="Gopalachari"/>
 
"మైసోలియా" (కృష్ణా తీర ప్రాంతం) లో "బెన్‌గొరా" (వేంగీపురం) చెంత "సాలెంకీనాయ్" (శాలంకాయనులు) ఉన్నట్లు గ్రీకు చరిత్ర కారుడు టాలెమీ క్రీ.శ.130లో వ్రాశాడు.<ref>The Ancient City of Vengipura : Archaeological Excavations at Peddavegi/I.K. Sarma. Delhi, Book India Publishing Co., 2002, ISBN 81-85638-15-2. https://www.vedamsbooks.com/cgi-bin/main.cgi?no31025.htm{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} - ''Infact Ptolemy (140 A.D.), refers to Vengi as the capital city of the Salankayanas.''</ref> అయితే ఆ బెన్‌గొరా (Bengaouron) అనేది వేంగీపురం కాదని కొందరు చారిత్రికుల అభిప్రాయం.<ref>''Excerpt from Gopalachari's thesis'':
పంక్తి 113:
[[ఏలూరు]], [[పెదవేగి]], [[గుంటుపల్లె]], [[కానుకొల్లు]], [[కొల్లేరు]], [[కంతేరు]], [[పెనుగొండ]] వంటి వివిధ శాసనాల ద్వారా [[శాలంకాయనులు|శాలంకాయనుల]] గురించి కొన్ని వివరాలు తెలుస్తున్నాయి.
 
శాలంకాయనుల స్వతంత్రాధికారాన్ని హస్తివర్మ క్రీ.శ.320లో స్థాపించి ఉండవచ్చును. వివిధ శాసనాలలో ఇతనిని "నానాప్రకార విజయస్య" (గుంటుపల్లి), "అనేక సమరావాప్త విజయ" (పెదవేగి), "సమరముఖ నిర్మాత కర్మ" (కానుకొల్లు), "ధర్మమహారాజ" (గుంటుపల్లి) అనే బిరుదులతో వర్ణించారు.<ref name="BSL">ఆంధ్రుల చరిత్ర - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్)</ref> ఈ వర్ణనలను బట్టి ఇతడు వేంగి ప్రాంతంలో సామంతులను జయించి రాజ్యాన్ని స్థిరపరచాడని భావించవచ్చును. ఇతడు [[సముద్ర గుప్తుడు|సముద్ర గుప్తు]]<nowiki/>ని సమకాలీనుడు.
 
హస్తివర్మ కుమారుడు నందివర్మ (350-385). ఇతడు తిరుగుబాటుదారులను అణచివేసి [[కృష్ణానది]] దక్షిణానికి కూడా వేంగి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతడు ధార్మిక చింతనపరుడు. "వివిధధర్మ ప్రధానస్య" అని పెదవేగి శాసనంలోను (కనుక వారు బౌద్ధ, వైదిక ధర్మాలను రెంటినీ ఆదరించినట్లు తెలుస్తున్నది), "ఆర్జిత ధర్మ ప్రదానస్య, గీసహస్రదాయి" అని గుంటుపల్లి శాసనంలోను వర్ణింపబడ్డాడు. ఇతని తరువాత ఇతని [[తమ్ముడు]] దేవవర్మ, కొడుకు అచండవర్మల మధ్య అధికారం కోసం అంతర్యుద్ధం జరగడం వలన శాలంకాయనుల ప్రతిష్ఠ దిగజారింది. అంతే గాకుండా ఉత్తరాన పిష్ఠపురం ([[పిఠాపురం]]) లో మాఠరులు, దక్షిణాన కర్మరాష్ట్రంలో బలవంతులై శాలంకాయనులతో పోరాడసాగారు. క్రీ.శ.5వ శతాబ్ది ప్రాంతంలో శాలంకాయనుల రాజ్యం అస్తమించింది. వారిలో చివరిరాజు విజయనందివర్మ గుంటుపల్లిలోని బౌద్ధ క్షేత్రానికి దానధర్మాలు చేశాడు.
పంక్తి 121:
== విష్ణుకుండినులు ==
{{main|విష్ణుకుండినులు}}
శాతవాహనులు, చాళుక్యులు మధ్యకాలంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన వారిలో విష్ణుకుండులు ప్రసిద్ధులు. ఒక శతాబ్దం కాలం కృష్ణా, నర్మదా నదుల మధ్య అధికారం వెరపి అనేక రాజకీయ, సాంస్కృతిక సంప్రదాయాలను నెలకొల్పారు.<ref name="BSL"/>. వారు శ్రీపర్వత స్వామి భక్తులమని, వారి రాజ్యం శ్రీ పర్వత ఉభయ పార్శ్వాలలో విస్తరించి ఉన్నదని చెప్పుకొన్నారు. వారి వంశం గురించి, [[రాజధాని]] గురించి, రాజ్యం ఎల్లలగురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. సుమారుగా 375-570 మధ్యకాలంలో వీరి రాజ్యం సాగింది. వీరి ముఖ్యుడైన గోవిందవర్మ (425-465) ఉత్తరాన వేంగి శాలంకాయనులనూ, దక్షిణాన కర్మరాష్ట్రంలోని [[పల్లవులు|పల్లవుల]]<nowiki/>నూ ఓడించి రాజ్యాన్ని [[పిఠాపురం]] నుండి [[గుండ్లకమ్మ]]<nowiki/>వరకూ విస్తరించాడు.
 
విష్ణుకుండి రాజులందరిలో మాధవవర్మ (465-515) ప్రసిద్ధుడు. జైత్రయాత్రలు సాగించి రాజ్యాన్ని విస్తరించాడు. వాకాటకులతో వివాహసంబంధం కలుపుకొని నర్మదానది వరకూ రాజ్యాన్ని విస్తరించాడు. ఉత్తరాన కళింగాన్ని జయించాడు. అదను చూసుకొని మరలా కృష్ణాతీరం వరకు ఆక్రమించిన పల్లవులనోడించి కర్మరాష్ట్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకొన్నాడు. కళింగ దండయాత్ర తరువాత మాధవవర్మ వేంగి సమీపంలోని [[దెందులూరు]] పురానికి తన రాజధానిని మార్చాడు.<ref name="BSL"/>.
 
తరువాతి రాజులలో క్రమంగా అంతఃకలహాలు, పశ్చిమాన [[చాళుక్యులు|చాళుక్యు]]<nowiki/>ల విజృంభణ, పల్లవులతో కొనసాగుతున్న వైరం - ఇవి క్రమంగా విష్ణుకుండినుల అధికార పతనానికి దారి తీశాయి. 566లో పల్లవరాజు పృథ్వీమహారాజుతో జరిగిన యుద్ధంలో అప్పటి విష్ణుకుండి రాజు విక్రమేంద్రుడు మరణించడంతో విష్ణుకుండి వంశం పాలన అంతమయ్యింది.
 
== పల్లవులు, రణ దుర్జయులు ==
పంక్తి 139:
[[దస్త్రం:Inscription Pedavegi.JPG|right|thumb|పెదవేగి త్రవ్వకాలలో లభించిన ఒక శాసనం]]
{{main|తూర్పు చాళుక్యులు}}
వేంగిలో చాళుక్య రాజ్య స్థాపన ఆంధ్రచరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది. తూర్పు చాళుక్యులనబడే వీరు తీరాంధ్రాన్ని మాత్రమే పాలించారు. ఆంధ్ర దేశ ఐక్యతను సాధించలేకపోయారు ([[శాతవాహనులు|శాతవాహనుల]] తరువాత [[కాకతీయులు]] మాత్రమే ఈ పని చేశారు.) ఇతర ప్రాంతాలలో పల్లవ సామంతులు, బాణ వైదుంబులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు పాలన సాగించారు. అంతే గాకుండా వేంగి చాళుక్యులు పశ్చిమ (కన్నడ) ప్రాంతంనుండి దండెత్తి వచ్చినవారు అయినా కాని వీరు ఆంధ్రులకొక వ్యక్తిత్వాన్ని, [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] వారసత్వాన్ని సాధించగలిగారు. "జన్మభూమిశ్చాళుక్యానాం దేశో వేంగితి పశ్రుతః" అని చాటి ప్రజా క్షేమాన్ని కాంక్షించి పాలించారు. నాటివరకు రాజాస్థానాలలో ఆదరణ లేని తెలుగు భాషను ఆదరించి విశేష ప్రచారం తెచ్చిపెట్టారు.అందు చేత తూర్పు చాళుక్యుల చరిత్రయే ఈ యుగంలో ఆంధ్రుల చరిత్ర అనడంలో సందేహానికి తావుండరాదు<ref name="BSL"/>. [[శాతవాహనులు|శాతవాహను]]<nowiki/>ల కాలంలో [[సంస్కృతము|సంస్కృతం]] పండిత భాష, ప్రాకృతం రాజభాష, [[తెలుగు]] పామరుల భాష<ref>పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర</ref>. వేంగి చాళుక్యుల కాలంలోనే తెలుగు పండిత భాషగాను, ప్రజల భాషగాను, రాజభాష గాను మూడు వన్నెల ఔన్నత్యాన్ని సమకూర్చుకొంది. మార్గకవితను సేవించుచుండిన ఆంధ్రులకు తెలుగు కవితను పుట్టించి, '''తెలుగు నిలిపిన''' యశము చేకూర్చిన ఘనత (నన్నయకు కాదు) చాళుక్య రాజులకు దక్కింది<ref>'''మును మార్గ కవిత లోకంబున వెలయగ దేశి కవిత పుట్టించి తెనుంగును నిలిపిరంద్ర విషయంబున జన చాళుక్య రాజు మొదలుగ పలువుల్''' - [[నన్నెచోడుడు]]</ref>.
 
క్రీ.శ. 624లో (ఈ సంవత్సరం పై విభిన్నాభిప్రాయాలున్నాయి) బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి వేంగి రాజ్యాన్ని (ఏలూరు దగ్గర జరిగిన యుద్ధంలో) జయించాడు. అతని [[తమ్ముడు]] కుబ్జ విష్ణువర్ధనుడు (624-641) అన్న ఆశీస్సులతో వేంగిని స్వతంత్రరాజ్యంగా పాలించనారంభించాడు. ఇతడు మహావీరుడు. పరిపాలనా దక్షుడు. ఇతని భార్య అయ్యణమహాదేవి జైన మతాభిమాని.
పంక్తి 147:
కుబ్జ విష్ణువర్ధనుని తరువాత గుణగ విజయాదిత్యుడు, వాళుక్యభీముడు, జటాచోడ భీముడు, రాజరాజ నరేంద్రుడు ముఖ్యమైన వేంగి చాళుక్య రాజులు. అయితే అంతఃకలహాలు, రాష్ట్రకూటులతో యుద్ధాలు వేంగిని విపరీతమైన నష్టాలకు గురిచేశాయి. 772లో రాష్ట్రకూట ధ్రువుడు పంపిన సేనలు వేంగిపై దండెత్తి అప్పటి విష్ణువర్ధనుని ఓడించి సామంతునిగా చేసుకొన్నాడు. దీనితో వేంగి ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బ తింది. తరువాత 12 సంవత్సరాలు వారి మధ్య ఎడతెరిపి లేకుండా పొరులు జరుగుతూనే ఉన్నాయి. 813లో చాళుక్య రాజు రెండవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులనోడించి తిరిగి వేంగి సింహాసనాన్ని అధిష్టించాడు. వేంగి ప్రాభవాన్ని పునరుద్ధరించాడు. ఇతడు 108 యుద్ధాలు చేసి రాష్ట్రకూటులను పారద్రోలినట్లు [[శాసనాలు]] చెబుతున్నాయి. ఇతడు గొప్ప కళా పండిత పోషకుడు.
 
తరువాతి రాజులలో [[గుణగ విజయాదిత్యుడు]] (848-891) తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు. ఒక యుద్ధంలో రాష్ట్రకూట రాజు (రట్టేశుని) చేత ఓడిపోయాడు. తరువాతి [[యుద్ధం]]<nowiki/>లో వారిని ఓడించి, వారి రాజ్యాలలో వీరవిహారం చేసి తూర్పు చాళుక్యులు పొందిన పరాభవాలకు ప్రతీకారం చేయడమే కాక దక్షిణాపథంపై అధిపత్యం సాధించాడు. ఇతని తరువాత అంతఃకలహాలవల్ల వేంగి రాష్ట్రకూటుల దండయాత్రలకు తట్టుకొనే శక్తి కోల్పోయింది. కొన్ని యుద్ధాలలో జయం, కొన్నింట పరాజయం సంభవిస్తూ ఉండేవి. రెండవ అమ్మరాజు వేంగి సింహాసనాన్ని 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత జటాచోడభీముడు వేంగి, [[కళింగ]] రాజ్యాలలో ఎదురు లేకుండా పాలించాడు.
 
== చాళుక్య చోళులు ==
పంక్తి 153:
చోళ సైన్యాల సాయంతో శక్తివర్మ (909-1011) చోడ భీముని జయించి వేంగి రాజ్యాన్ని ఆక్రమించుకొన్నాడు. తరువాత కొంతకాలం సత్యాశ్రయుని నాయకత్వంలో పశ్చిమ చాళుక్యులకు, చోళులకు [[యుద్ధాలు]] జరిగాయి. దాక్షిణాత్య సార్వభౌమత్వం ఆశించిన పశ్చిమ చాళుక్యులకు, చోళులకు వేంగి యుద్ధరంగమయ్యింది.<ref name="BSL"/>
 
1019లో రాజరాజ నరేంద్రుడు రాజయ్యాడు. అతని పట్టాభిషేకాన్ని ప్రతిఘటించి, విజయాదిత్యుడు కళింగ కుంతల రాజుల సాయంతో వేంగిని ఆక్రమించినాడని, రాజేంద్రచోళుడు వేంగి వరకు నడచి తన కుమార్తె అమ్మంగదేవిని రాజరాజ నరేంద్రునికిచ్చి పెళ్ళి చేసి పట్టాబిషేకాన్ని చేయించాడని చరిత్రకారుడు నేలటూరి వెంకటరమణయ్య అభిప్రాయపడ్డాడు. పట్టాభిషేకం అయిన 9 సంవత్సరాల తరువాత విజయాదిత్యుడు, చాళుక్య జయసింహుడు కలసి వేంగిలో అధిక భాగాన్ని (కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని) ఆక్రమించారు. 1034లో విజయాదిత్యుడు వేంగి నగరం రాజధానిగా [[పట్టాభిషేకం]] జరుపుకొన్నాడు. మిగిలిన భాగాన్ని [[రాజమహేంద్రవరం]] రాజధానిగా పాలిస్తూ రాజరాజ నరేంద్రుడు తిరిగి వేంగి రాజ్యం ఐక్యత కోసం చోళుల సాయం అర్ధించి ఉంటాడు. వేంగి సమీపంలోని కలిదిండి వద్ద జరిగిన భీకరమైన [[యుద్ధం]]<nowiki/>లో (విజయాదిత్యుని) చాళుక్యసైన్యం పరాజయం పొందింది. వేంగి రాజ్యం తిరిగి ఒకటయ్యింది. పశ్చాత్తాపం ప్రకటించిన విజయాదత్యుని రాజరాజ నరేంద్రుడు క్షమించాడు.
 
== వేంగి ప్రాభవం క్షీణత ==
తిరిగి 1042 నుండి రాజరాజ నరేంద్రుని అధికారానికి ప్రమాదం వాటిల్లింది. ఈ కాళంలో చాళుక్య చోళ [[సంఘర్షణ]]<nowiki/>లు తారస్థాయికి చేరడంతో వేంగి రాజ్యం అల్లకల్లోలమయ్యింది. సోమేశ్వరుడనే రాజు 1045 ప్రాంతంలో వేంగి, కళింగ రాజ్యాలను జయించి "వేంగి పురవరేశ్వర" అనే [[బిరుదు]] ధరించాడు. చోళ రాజులు ధరణికోట వద్ద జరిగిన పెద్ద యుద్ధంలో చాళుక్యులను జయించారు గాని వేంగిపై మాత్రం పశ్చిమ చాళుక్యుల పెత్తనం కొనసాగింది. [[రాజరాజ నరేంద్రుడు]] ఆహవమల్ల సోమేశ్వరునితో సమాధానపడి అతని సార్వభౌమత్వాన్ని అంగీకరించి వేంగి<nowiki/>ని పాలించాడు. తరువాత 1061 వరకు రాజరాజనరేంద్రుని పాళన ప్రశాంతంగా సాగింది. అతడు పండిత గోష్ఠిలో ఆసక్తి కలిగిన పరమ ధార్మికుడు. ఈ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉండవచ్చును. అది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం.
 
రాజరాజ నరేంద్రుని మరణానంతరం జరిగిన సంఘటనలలో చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు. కాని అప్పటికి వేంగి రాజ్యానికి పూర్తిగా వ్యక్తిత్వం నశించి చోళ, చాళుక్య సార్వభౌములలో విజేతలైనవారి పక్షమో, లేక వేంగిపై దండెత్తి వచ్చినవారి పక్షమో వహించవలసిన దయనీయ స్థితికి దిగజారిపోయింది <ref name="BSL"/>. అనేక యుద్ధాలు, రాజుల మధ్యలో పంపకాలలో వేంగి నలిగిపోయింది. అవకాశం చిక్కినపుడల్లా ఇతరులు వేంగిని కొల్లగొట్టసాగారు. 1073లో దాహళ ప్రభువు చేది యశఃకర్ణదేవుడు, తరువాత కొద్దికాలానికి గంగరాజ దేవేంద్రవర్మ పెద్ద దండ్లను పంపి వేంగిని దోచుకొన్నారు. 1075లో సప్తమ విజయాదిత్యుడు మరణించడంతో తూర్పుచాళుక్య వంశం అంతరించింది.
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు