పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి using AWB
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
;[[ఆంధ్ర ప్రదేశ్]]<nowiki/>లో చిరకాలం నుండి ప్రచారంలో వున్న కళా రూపం పిచ్చుకుంటులవారి కథ. ఈ కథ, పిచ్చుకుంటుల వారనే జాతి వారు చెపుతూ వుంటారు. ఈ నాటికీ వారు వెనుక బడ్డ ప్రాంతాలలో కనిపిస్తూ వుంటారు. మన వంశాల గోత్ర నామాలను వర్ణిస్తూ [[గోత్రము|గోత్రాలను]] చెపుతారు. వీరు చెప్పే కథల్లో ప్రాముఖ్య మైనదీ, చారిత్రాత్మకమైనదీ, వీరోచితమైనదీ [[శ్రీనాథుడు|శ్రీనాథ మహా కవి]] రచించిన ''పల్నాటి వీరచరిత్ర ''. ఈ కథను ప్రారంభిస్తే దాదాపు పది హేను రాత్రులు చెపుతారు. పిచ్చుకుంటుల కథలో శృంగార, వీర, కరుణ రసాలకు ఎక్కువ అవకాశముంది.
;తెలుగు జానపద సంగీతానికి వేల సంవత్సరాలుగా ప్రాణభిక్ష పెట్టిన వారు భిక్షుక గాయకులు. పిచ్చుకుంట్లు, శారదకాండ్రు, వీరముష్టులు, జంగాలు, దాసర్లు, బుడబుక్కల, బవనీలు, జక్కులవాళ్ళు, బొమ్మలాటగాళ్ళు . [[పిచ్చికుంట్ల]] వారు వంశ, కుల, గోత్రాలను, రామయణ, భారతాది కథలను అన్ని కుటుంబాల వారికి చెబుతూ ధాన్యం, సంభావనలు తీసుకొనే వారు, కొమ్ము ఊదేవారు.ఎక్కువగా ప్రకాశం జిల్లా నుండి వచ్చారు.
 
పంక్తి 10:
దాన మొసగరే ధర్మాత్ములార.
</poem>
అని వర్ణించాడు. పై వివరణను బట్టి వారు [[అంగవైకల్యం]] కల కుంటి వారనీ, అంధులనీ తెలియటమే కాక, ''దాన మొసగరే ధర్మాత్ములార '' ఆనడాన్ని బట్టి వారు [[యాచకులు|యాచకులని]] అర్థమౌతూ ఉంది. ఆనాడు [[శ్రీశైలం|శ్రీశైల క్షేత్రానికి]] వెళ్ళే యాత్రికుల్ని యాచిస్తూ వుండే వారని తెలుస్తూ ఉంది. వీరిని [[కోస్తాంధ్ర]]<nowiki/>లో పిచ్చి గుంటలాళ్ళని పిలుస్తూ వుంటారు. మరి కొన్ని చోట్ల పిచ్చుక కుంటల వాళ్ళనీ, - పిచ్చుకుంటలాళ్ళనీ, రక రకాలుగా పిలుస్తూ వుంటారు. వీరు భిక్షమెత్తే వారు కనుక భిక్షక శబ్దం పిచ్చకుంటులుగా మారిపోయి వుండవచ్చు. 1995 లో ఈ కులం పేరును [[వంశరాజ్]]<nowiki/>గా మార్చారు. వీరు బీ.సి.ఏ గ్రూపు లోని 18 వ [[కులం]].
 
;పద్యం
పంక్తి 26:
 
==మూర్తీ భవించిన శైవం==
పిచ్చుకుంటుల వారందరూ మూర్తీ భవించిన వీర శైవ మతాన్ని ఆరాధించారు. విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా వీరు శక్తి ఉపాసనా పరులు. రేణుకా మహాత్మ్యాన్ని, పోచమ్మ, ఎల్లమ్మ, మరిడమ్మ, మూహూరమ్మ కథలను ప్రచారం చేయడమే కాక వారు నమ్మిన దేవతల [[కొలువు]]<nowiki/>లు కొలుస్తారు. వీరికి మూల దైవం శ్రీ శైల మల్లిఖార్జునుడే.
 
==పిచ్చుకుంటుల పేరెందుకు వచ్చింది==
పంక్తి 48:
 
==రాయలసీమలో==
[[రాయలసీమ]]లో వున్న పిచ్చు కుంట్లు వీర శైవులు. [[రాయలసీమ]]<nowiki/>లో వీరు ఎలనాగి రెడ్డి కథ ఎనిమిది రాత్రులు పాడతారు. వీరి గురువులు [[జంగాలు]], పురోహితులు కూడా. వీరు మొదట గంట, తిత్తి మాత్రమే ఉపయోగించే వారు. తరువాత జంగాల ప్రభావం వల్ల చేత [[తంబుర]], గుమ్మెతలు ఉపయోగించే వారు. [[తెలంగాణా]]లో [[జంగాలు]] ఉపయోగించే బుడిగెలు ఇటువంటివే, వీరి వేషం జంగాల వేషంలాగే నిలువు టంగీ షరాయి, నడికట్టు [[తలపాగా]] వుంటుంది.<ref>డా: తంగిరాల సుబ్బారావు గారు జానపద కళోత్సవాల సంచిక</ref>
 
==పాత కథలూ,కొత్త కథలూ==
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు