తేకుమళ్ళ రాజగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
జానపద వాజ్మయ భిక్షువు గా పేరుపొందిన నేదునూరి గంగాధరం గారు తేకుమళ్ళ రాజగోపాలరావు గారి సూచనల ప్రకారమే కట్టుకథలు, పొడుపు కథలు, యుక్తి లెక్కలు మొదలైన వాటిని సేకరించారు.
 
కందుకూరి వీరేశలింగం తో కలసి ఒకే కళాశాలలో బి.ఎ చదువుకున్నారు. వారిద్దరూ మంచి మిత్రులు. 1902-05 వరకు గుత్తిలో ఉపాధ్యాయునిగా పనిచేసి తరువాత విజయనగరం రిప్పన్ హిందూ థియాలాజికల్ హైస్కూలులో కొంతకాలం పనిచేసాడు. తరువాత మద్రాసు లోని ఒక క్రైస్తవ కళాశాలలో రాజగోపాలరావు ఉపన్యాసకునిగా పనిచేసాడు. అతను గొప్ప చారిత్రక పరిశోధకుడు. క్రీ.శ 898 నాటి యుద్ధమల్లుని శాసనం లోని మధ్యాక్కర అని మొట్టమొదట కనుగొన్నాడు. తమిళభాష కంటే తెలుగు భాషే పురాతనమైనదని సిధ్ధాంతీకరించాడు.
 
1918 నుండి 1923 వరకు సౌత్ ఇండియన్ రీసెర్చ్ అనే ఆంగ్ల పత్రికను అచ్చు వేసేవాడు.
 
ఇతని పూర్వీకులు తల్లిదండ్రులు హిందువులు అయినప్పటికీ వీరేశలింగం ప్రభావంతో బ్రహ్మమతంలోకి ప్రవేశించాడు. తరువాత దాని నుండి బయటికి వచ్చి 1916లో హిందూమతాన్ని సంక్సరించుకోవడం అవసరమని తలచి ఆర్ష సమాజం స్థాపించాడు. 1936లో ఆర్ష పత్రికను స్థాపించి కొంతకాలం నడిపాడు.
 
ఆంధ్రసరస్వతీ గ్రంథమాల స్థాపించి అనేక పుస్తకాలను అచ్చువేయించాడు. తెలుగులోనే కాక అతను కన్నడ, ఇంగ్లీషు భాషలలో కూడా పుస్తకాలను రచించాడు.
 
అతను 1938 డిసెంబరు 8న మరణించాడు.<ref>{{Cite web|url=http://www.peddapuram.in/tekumalla-raja-gopala-rao/|title=TEKUMALLA RAJA GOPALA RAO – Mana Peddapuram|language=en-US|access-date=2020-07-22}}</ref>