పులిపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 45:
పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట [[రంగస్థలం]] పై ప్రవేశించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచున్న పులిపాటి [[తెనాలి]] రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. [[స్థానం నరసింహారావు]], [[బందా కనకలింగేశ్వర రావు]], [[బళ్ళారి రాఘవ]], [[ఉప్పాల వెంకటరత్తయ్య]] వంటి మహామహుల సరసన [[మద్రాసు]], [[మైసూరు]], [[మహారాష్ట్ర]], [[బెంగాల్]] వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.
 
నటులు రాగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రదర్శనలు జరుగుతున్న నాటకాలలో [[అర్జునుడు]], నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, చెకుముకి శాస్త్రి, వెంగళరాయడు, [[భరతుడు]], [[నారదుడు]] పాత్రలను పోషించడమే కాక, 1932లో [[సినిమా]] రంగంలో ప్రవేశించి [[చింతామణి]]లో భవానీ శంకరుడు, [[హరిశ్చంద్ర]]లో నక్షత్రకుడు, [[సారంగధర]]లో సుబుద్ధి, [[పాశుపతాస్త్రం]]లో నారదుడుగా నటించారు. [[మోహినీ రుక్మాంగద]], [[సతీ తులసి]], [[చంద్రహాస (1941 సినిమా)|చంద్రహాస]], [[తల్లిప్రేమ]], [[విష్ణుమాయ]] చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఈయన మొత్తం పన్నెండు సినిమాలలో నటించాడు.
 
పులిపాటి వెంకటేశ్వర్లుకు రెండుసార్లు గజారోహణ సన్మానం జరిగింది. 1960లో [[సంగీత నాటక అకాడమీ]] ఫెలోషిప్ లభించింది.