మల్లమ్మ కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
 
ఏరువాకలో అరకలు దున్నుతున్న వీరారెడ్డిపై పిడుగులు పడి ఎడ్లు చనిపోతాయి. వీరారెడ్డి చూపు పోతుంది. ఇవన్నీ ఎడ్లకు హారతినిచ్చి ఎదురు వచ్చిన మూలానే అని అత్త, తోడికోడలు ఆడిపోసుకుంటారు. ఆ దోషం పోవడానికి సహస్రఘటాభిషేకం చేయాలంటారు. వేయి కడవలూ రాత్రికిరాత్రే మల్లమ్మనే తోడమన్నారు. మల్లమ్మ తన శక్తి కొలదీ తోడింది. ఇక తోడలేక గంగాభవానీని ప్రార్థించింది. గంగ కరుణించింది. బిందెలు నిండాయి. అత్తకి, తోడికోడలుకి కళ్ళు కుట్టాయి. ఎలాగైనా ఆమెపై కక్ష తీర్చుకోవాలనుకున్నారు. అదను కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
 
శివుడి ప్రదక్షిణ చేస్తున్న మల్లమ్మను ఆ ఊళ్ళో తిరుగుబోతు రంగడు బలాత్కరించబోతాడు. అది చూసిన అమ్మలక్కలు మల్లమ్మ చెడిపోయిందని అత్తతో చెబుతారు. ఆమె నమ్మింది. కానీ ఆ సమయంలో పొలం నుండి తిరిగి వస్తున్న వెంగళరెడ్డి రంగడిని కొట్టి మల్లమ్మను కాపాడుతాడు. కానీ నలుగురు దృష్టిలో చెడిపోయిన మల్లమ్మను ఇంటిలోనికి రాకుండా పశువులపాకలో ఉండమన్నారు అత్త, తోడికోడలు. పూజకు విగ్రహాలు కూడా తీసుకోవడానికి వీలులేదన్నారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మల్లమ్మ_కథ" నుండి వెలికితీశారు