వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 266:
* ఈ వోటింగు వలన ఒక మేలు జరిగింది. (ఇది బాగా జరిగింది అని చెప్పే కోవ లోకి రాదు గానీ ఈ విభాగానికే దగ్గరగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాస్తున్నాను) [[వాడుకరి:Meena gayathri.s|మీనాగాయత్రి]] గారు, [[వాడుకరి:Mekala Harika|మేకల హారిక]] గారు, [[వాడుకరి:Nagarani Bethi|నాగరాణి]] గారు - ఈ ముగ్గురు వాడుకరులూ చూపిన విజ్ఞత గురించి చెప్పుకోవాలి. "''అలాగని ఊరుకుంటే ఈ ప్రతిపాదనలు గెలుస్తాయి. కాబట్టి, నేను ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే ప్రతిపాదనలో వ్యతిరేక ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను.''", "''అదే ఆ సమయం లోనే ఈ 30 శాతం నిబంధనం ఉన్నట్లయితే మా వ్యాసాలు పూర్తి నాణ్యతతో ప్రసురించబడేయి. ఈ నిబంధన వాళ్ళ వ్యాసాల యొక్క నాణ్యత పెరగడం తో పాటు, కొత్తగా అనువాదం చేసేసవాళ్ళకి చాల ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.''", "''మరి అలాంటప్పుడు ప్రస్తుతం ట్రాన్సలేషన్ టూల్ లో ఉన్న 30 శాతంని తగ్గిస్తే అప్పుడు రాసే వ్యాసాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ... ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే, ప్రతిపాదన గెలవకుండా వ్యతిరేక ఓటు వేయాలనుకుంటున్నాను.''" ఎందుకు వ్యతిరేకిస్తున్నమో, ఎందుకు వోటెయ్యాలో స్పష్టత ఉంది వాళ్ళకు. వాళ్లకు నా వందనం. వోట్లు కాదు, వాడుకరుల అభిప్రాయాలు అవసరమని తేల్చి చెబుతున్నాయి వారి వ్యాఖ్యలు. ఇంత సహేతుకంగా ఒక్ఖ కారణమైనా, కనీసం ఒక్కటైనా, ఈ ప్రతిపాదకుడు మానవిక అనువాద పరిమితి తగ్గింపుకు చూపి ఉంటే, బహుశా నేను ఈ ప్రతిపాదననూ ఈ వోటింగునూ ఇంత వ్యతిరేకించి ఉండేవాణ్ణి కాదేమో!__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:01, 22 సెప్టెంబరు 2020 (UTC)
* మరొక సంగతి చెప్పాలి - [[వాడుకరి:Vmakumar]] గారి గురించి. అనువాద పరికరాన్ని వాడి చూస్తే దాని పనితీరు గురించి, అది చేసే అనువాద దోషాల గురించీ మరింత తెలుస్తుందని తాను భావిస్తున్నట్టూ, వాడి చూస్తాననీ చెప్పారు. అది ఈ వోటింగు వ్యవహారం మొత్తమ్మీద నేను చూసిన మరొక బ్రైట్‌స్పాట్. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:27, 22 సెప్టెంబరు 2020 (UTC)
* [[User:Chaduvari|చదువరి]] గారు, [[వాడుకరి:Meena gayathri.s|మీనాగాయత్రి]] గారు, [[వాడుకరి:Mekala Harika|మేకల హారిక]] గారు, [[వాడుకరి:Nagarani Bethi|నాగరాణి]] గారు - ఈ ముగ్గురు వాడుకరుల విజ్ఞత పరిగణనలోకి తీసుకోవడం సబబు కాదేమో! ఎందుకంటే వారి వాడుకరి పుటలను పరిశీలించిన పిదప నాకు అర్థమైన విషయం వారు ఈ ప్రతిపాదన చర్చలలో వ్యతిరేఖించిన నిర్వాహకుల వారికి బాగా వ్యక్తిగతంగా తెలిసిన వారు.
 
<<<గతంలో ఇక్కడ మీనాగాయత్రి, నాగరాణి బేతి, మేకల హారిక గార్ల విజ్ఞతను పరిగణించడంపై జరిగిన చర్చ ఈ విభాగంలో జరపడం సముచితం కానందువలన దాన్ని [[#మీనాగాయత్రి, నాగరాణి బేతి, మేకల హారిక గార్ల విజ్ఞతను పరిగణించడంపై చర్చ]] అనే కొత్త విభాగానికి ఉన్నదున్నట్టుగా తరలించాను. గమనించగలరు>>>
1.___[[వాడుకరి:Meena gayathri.s|మీనాగాయత్రి]] గారు--పవన్ సంతోష్ గారి ప్రోత్సాహం తో తెవికీ లో చేరారు.
2.___[[వాడుకరి:Nagarani Bethi|నాగరాణి]] గారు-- ప్రణయ్ రాజ్ వంగరి గారి సతీమణి.
3.___[[వాడుకరి:Mekala Harika|మేకల హారిక]] గారు-- వీరి ప్రొఫైల్ లో పేరు తప్ప ఏ వివరాలు లేవు కానీ నేను భావిస్తున్నా! _______[[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 04:37, 23 సెప్టెంబరు 2020 (UTC)
:[[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారూ, పోనీ ఎవరెవరి విజ్ఞతను పరిగణించమంటారో చెప్పండి. మీ విజ్ఞతను గణించమంటారా, అలాగే గణిస్తాను. పోనీ మీ చుట్టాలో, మిత్రులో ఎవరైనా ఉంటే, వాళ్ళ విజ్ఞతనూ గణించమంటే చెప్పండి, గణించేస్తా. నమస్కారం సార్.
:దేవుడు గారు చెప్పిన పై ముగ్గురూ దేవుడు గారు చెప్పిన/భావిస్తున్న పై వారికి చుట్టాలే కావచ్చు. కానీ వారు ఆ చుట్టరికాన్ని వాడుకునే ఉంబే, ఈ వోటింగుకు ముందు జరిగిన చర్చలోనే వాళ్ల వ్యతిరేకతను రాసి ఉండేవారే కదా. ఈ కనీస మాత్రపు ఇంగితం నాకుంది. నేను ఆ చుట్టరికాన్ని ప్రస్తావించి, ''ఈ చుట్టరికాలు ఉన్నా కూడా వీళ్ళు చర్చలో పాల్గొనలేదు, ఎంత గొప్పవారో'' అని మరింత మంచిగా రాసేసి ఉండొచ్చు, ఆ అవకాశం ఉంది నాకు. కానీ, నేను అలా రాయలేదు, వాడుకరుల చుట్టరికాలను ప్రస్తావించడం పద్ధతి కాదనే మరో ఇంగిత జ్ఞానం కూడా నాకు ఉంది. అందుకే ప్రస్తావించలేదు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:21, 23 సెప్టెంబరు 2020 (UTC)
 
:::[[User:Chaduvari|చదువరి]] గారు, క్షమించండి. మీ నుంచి ఇటువంటి వాఖ్యల్ని నేను ఆశించలేదు. పైన వారు ప్రస్తావించిన వాఖ్యలనే మీరు ఉటంకించి వారి విజ్ఞత గురించి మీరు పైన చాలా గొప్పగా చెప్పారు. మీకు ఒక విషయం. పైన వారి వారి వాడుకరి పుటలలోని విషయమే నేను ప్రస్తావించాను తప్ప నా భాష,భావం కట్టు తప్పలేదు. ఎవరినీ వ్యక్తిగతంగా అనలేదు. నాకు సంబందించిన వారెవ్వరూ ఈ వికీపీడియాలో లేరు. భారత ఎన్నికల కమిషన్ లోని పై పదవుల్లో నా చుట్టాలు ఉండి, నేను అల్ టైమ్ రికార్డులో గెలిచి ఈ దేశానికి ప్రధాన మంత్రి అయితే ఎవరైనా అలాగే అంటారు, కానీ మనం మన విశ్వనీయత నిరూపించుకోవాలి. నా చూట్టాలలో,స్నేహితులలో తెలుగు మాట్లాడితేనే చులకనగా చూసే వారు ఉన్నారు. కాబట్టి నేను తెలుగుకు దూరం కాలేదు. నేను తెలుగుగా ఇప్పటికీ గర్వపడుతా. మీరు వాడిన భావార్ధాలకు బాధ పడుతున్నా. ధన్యవాదాలు. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 07:07, 23 సెప్టెంబరు 2020 (UTC)
:::: [[వాడుకరి:Meena gayathri.s|మీనాగాయత్రి]] గారు తెవికీలో అనువాద వ్యాసాలలో విశేష కృషి చేసారు. [[వాడుకరి:Nagarani Bethi|నాగరాణి]] గారు గత మూడున్నరేళ్ళుగా వికీలో తమ సేవలనందిస్తున్నారు. వారు యాంత్రికానువాదాలపై కృషి చేసారు కాబట్టి వారు అభిప్రాయం చెప్పడంలో తప్పు ఏముంది? వికీ విధానాలపై అవగాహన ఉన్న వారి విజ్ఞత పరిగణనలోకి తీసుకోవడం సబబే. వారు వికీ నిర్వాహకుల బంధువులు కావచ్చు. అది మనకనవసరం. వారి కృషినే పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ అర్జునగారు ప్రతిపాదించిన విషయానికి అనుకూలంగా ఓటు వేస్తే అతని వర్గం, వ్యతిరేకంగా ఓటువేస్తే వ్యతిరేక వర్గం అని ఉండదు. ఇక్కడ ఎవరికి ఎవరూ వ్యక్తిగతంగా స్నేహితులు కాదు, అందరూ వికీ మిత్రులు మాత్రమే.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 15px;">[[User talk:K.Venkataramana|చర్చ]]</span></span> 07:34, 23 సెప్టెంబరు 2020 (UTC)
::::::::[[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారూ, చుట్టరికాలున్నందున వారి విజ్ఞతను పరిగణించకూడదనే మీ మాట ఉంది చూసారూ దానికి జవాబుగా రాసానంతే. హారిక గారి "''ప్రొఫైల్ లో పేరు తప్ప ఏ వివరాలు లేవు కానీ నేను భావిస్తున్నా!''" అని కూడా రాసారు. అన్యాయం కదూ ఆ మాట! నాకు కష్టం కలిగించాయి మీ మాటలు. మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరం అన్న సంగతిని గ్రహించాలి సార్. ఏదేమైనప్పటికీ, మీకు కష్టం కలిగేలా, మీరు బధ పడేలా జవాబిచ్చినందుకు నన్ను మన్నించండి.__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:37, 23 సెప్టెంబరు 2020 (UTC)
:::::::::[[వాడుకరి:Meena gayathri.s|మీనాగాయత్రి]] గారు, [[వాడుకరి:Nagarani Bethi|నాగరాణి]], [[వాడుకరి:Mekala Harika|మేకల హారిక]] గారు, ఈ ముగ్గురు వాడుకరులూ ఈ చర్చలలో వారి అబిప్రాయాలు వెల్లడించి, వారి అబిప్రాయాలతగ్గట్టుగా ఓటుప్రక్రియలో విజ్ఞతతో ఓటు వేయటం నిజంగా అభినందించతగ్గవిషయం.పని కట్టుకని ఆ ముగ్గురిపై [[వాడుకరి:Meena gayathri.s|మీనాగాయత్రి]] గారు, పవన్ సంతోష్ గారి ప్రోత్సాహంతో తెవికీ లో చేరారని, [[వాడుకరి:Nagarani Bethi|నాగరాణి]] గారు, ప్రణయ్ రాజ్ వంగరి గారి సతీమణిని, [[వాడుకరి:Mekala Harika|మేకల హారిక]] గారు-- వీరి ప్రొఫైల్ లో పేరు తప్ప ఏ వివరాలు లేవని, కానీ నేను భావిస్తున్నా! (ఈమె కూడా ఇలాంటి కోవకు చెందిఉండవచ్చు) అనేఅభిప్రాయం వచ్చేలాగున ఈ విభాగంలో వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరం.భార్య కావటం, బంధువులు కావటం, ప్రొఫైల్ లో పేరు తప్ప ఏ వివరాలు లేక పోవటం తప్పు ఎలా అవుతుంది.విజ్ఞత ఉన్నవారు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.వ్యక్తిగతంలోకి చర్చలను లాగటం ఎంత మాత్రం హర్షించతగ్గవిషయంకాదు.ఇక ముందు ఇలాంటివి జరుగకూడదని భావిస్తున్నాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 08:52, 23 సెప్టెంబరు 2020 (UTC)
::::::::[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారు, క్షమించండి, నేను పైన ముందు గానే నా దృక్కోణం చక్కగా వివరించాను. విజ్ఞత ఉన్నవారు మరొక్క సారి చదవగలరు. మీకు పెద్దవారు కానీ ప్రాపంచిక విధానాలు తెలియట్లేదు అని భావిస్తున్నాను. ఎందుకంటే 8 సంవత్సరాలపైన నా ఉద్యోగ పరంగా పలు బహుళ జాతి సంస్థలలో పని చేసి ఆ సంస్థల Code Of Ethics, Code of Conduct నెమరు వేసిన వాడిగా చెప్తున్నాను. నేను చేసిన వాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదు. మీలో ఎవరైనా సరే ఏ బహుళ జాతి సంస్థలో చేస్తే అక్కడి Code of Conduct and Code of Ethics చదివి ఉంటే నా వాఖ్య ఎలా విజ్ఞత లేనిదో తెలుపగలరు. మీరు పని చేసే ఆ సంస్థ ఏదో పేరు చెప్తే ఆ సంస్థ జాల స్థలములోకి వెళ్ళి వారి Code of Conduct and Code of Ethics చదివి తరిస్తాను. వికీపీడియా కూడా అంతర్జాతీయ సంస్థ కావున ఇక్కడ మనం కూడా ఓ లక్ష్యం తో పని చేస్తున్నాం కావున Code of Conduct and Code of Ethics ఎక్కడైనా అవే ఉంటాయి ప్రతి మనిషికి ప్రత్యేకంగా ఉండవు. ____[[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 09:35, 23 సెప్టెంబరు 2020 (UTC)
[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]గారు, ఎలా ఉన్నారు అండీ ? బాగున్నారనే భావిస్తాను. వారి కృషిని నేనేదో తక్కువ చేసినట్టు మాట్లాడొద్దు. నేను అది ఎప్పుడు చేయలేదు. మీరు చెప్పారు కాబట్టి ఇంకా వారి కృషికి అభినందనలు చెప్తున్నా. కానీ బౌగోళిక సంస్థాగత నియమావళి ప్రకారం వెళ్లాల్సిన విధానంలో కాకుండా ఇష్టప్రకారం వెళ్తే అది అవినీతి కిందకు వస్తుంది. ఆంగ్లంలో చెప్పాలంటే Corruption, Conflict of Interest అంటారు. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 12:07, 23 సెప్టెంబరు 2020 (UTC)
::: [[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారూ, ఈ ఓటింగ్ పద్ధతిని నేను తిరస్కరించాను. 1) చర్చలో ఏకాభిప్రాయం ప్రతిపాదనకు వ్యతిరేకంగా వస్తే ఆ ప్రతిపాదన నిలబడిందంటూ అడ్డగోలుగా ప్రతిపాదకుడే ముగిస్తూ ఓటింగ్‌కు వెళ్ళడం తెవికీలో నభూతో నభవిష్యతి. 2) రెండు విషయాలను జమిలిగా ఓటింగ్ ఎప్పుడూ ఎక్కడా పెట్టరు. ఉదాహరణకు పార్లమెంటుకూ, అసెంబ్లీకి ఒకే ఓటు వెయ్యమని చెప్తే అది ప్రజాస్వామ్య ప్రక్రియనే అపహాస్యం చేయడం అవుతుంది. ఇలా రాస్తే వంద కారణాలు ఉన్నాయి. కాబట్టి, నేను ఈ ఓటింగ్ ప్రక్రియను తిరస్కరించాను. ఆనాడూ, ఈనాడూ అదే మాట మీద ఉన్నాను. అర్జున గారు కొద్దిమందినే ఎంచుకుని మెయిళ్ళు పంపారన్నా, కొంతమంది వాడుకరుల పేరుతో అజ్ఞాత వ్యక్తులు ఐపీ అడ్రస్ నుంచి సంతకాలు చేశారన్నా ఈ ఓటింగ్ ప్రక్రియ ఇలాంటిది కాబట్టి ఇంతకన్నా మంచిగా ఏమీ జరగదని పట్టించుకోలేదు. అలాంటిది, నా పేరును మీనాగాయత్రి పేరును ప్రస్తావించి మరీ నిరాధారమైన ఆరోపణ చేయడానికి ఎంత ధైర్యం మీకు? మీనా గాయత్రి కేవలం నేను ప్రోత్సహించి తీసుకువచ్చిన వ్యక్తి మాత్రమే కాదు, నా చెల్లెలు. నేను చేసినవి 100 అనువాదాలైతే, ఆమె చేసినవి 200 పైచిలుకు. ఆమెను పిలవదలుచుకుంటే నెలన్నర క్రితం జరిగిన చర్చలోకే ఆహ్వానించేవాడిని. అలా పిలిచేవాడిని కాదు కాబట్టే, నిత్యం ఆమెతో ఏవోక విషయాలు మాట్లాడుతూనే ఉన్నా ఈ విషయం మాట్లాడకుండా ఊరుకున్నాను. ఓటింగ్ ప్రక్రియకు నేను అన్ని విధాలా వ్యతిరేకం. నా స్టాండ్ ప్రకారం ఈ చర్చలో వ్యతిరేక ఓట్లు వేసినా, అనుకూల ఓట్లు వేసినా ప్రక్రియను సమర్థించినట్టే. అలాంటి నాస్టాండ్‌కీ, ఓటింగ్ ప్రక్రియను వ్యతిరేకిస్తూనే ఓటు వేసిన ఆమె స్టాండ్‌కీ ఏమిటి సంబంధం? ఈ ఓటింగ్ అన్నదొక అసంబద్ధమైన చర్య అన్న నా అభిప్రాయం వల్లనే దీనిపై నేను చెప్పాల్సింది చెప్పి తెవికీలో నేను చేయగల మిగతా పనులు ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు పిలిచి మళ్లీ ఇందులోకి లాగారు. చాలా అయిష్టంగా దిగవలసి వస్తోంది. మనుషులకు నిబద్ధత అనేదొకటుంటుంది. కనీసం అవతలి వ్యక్తి గురించి మీకు తెలియనప్పుడు "సదుద్దేశం" ఆపాదించుకుని చూడాలి. ప్రణయ్ రాజ్ గారు, నాగరాణి గారి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఆయన తలచుకుంటే ఏనాడో ఆవిడను చర్చలో రాయమని కోరేవాడే. మీకు తెలియని ఇంకొక విషయం చెప్తాను, తెలుసుకోండి. [[వాడుకరి:T.sujatha|సుజాత]] గారు వచ్చి అనుకూలంగా ఓటు వేశారు కదా. ఆవిడ భర్త శ్రీరామమూర్తి గారు. ఆయనకు కూడా ఓటింగ్ అర్హత ఉంది. ఐనా ఆయనను ఓటేయమని ఆవిడ ఆహ్వానించనూ లేదు, ఆయనా ఓటు వేయలేదు. మీకు కోడ్ ఆఫ్‌ ఎథిక్స్ తెలుసన్నారు. తగిన సాక్ష్యాధారాలు లేకుండా, ఊహించుకుని అవతలి వ్యక్తి మీద తప్పులు ఆపాదించి అవమానించడాన్ని కార్పొరేట్ ప్రపంచంలో ఏమంటారు? నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ తెలుసు. ఇక్కడ అది ఎందుకు వచ్చింది? కరెప్షన్ అని ఏమీ నిరూపించకుండా ఊహించుకుంటూ ఎలా అంటున్నారు. ఇది నా డిగ్నిటీకి భంగం కాదా? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:53, 23 సెప్టెంబరు 2020 (UTC)
::: ఏమిటీ రభస? ఒక వ్యక్తి పేరు తీసి అడిగేప్పుడు పాటించాల్సిన కనీస మర్యాద అవతలివారు సమాధానమిచ్చేవరకూ అంచనాలకు వచ్చెయ్యకపోవడం. ఏకంగా కరెప్షన్లూ, కాన్ఫిక్ట్ ఆఫ్‌ ఇంటరెస్టులూ అనేయడమేంటి? [[వికీపీడియా:ఐదు మూలస్తంభాలు]] ఒకసారి చదువుకు రండి [[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారూ. అందులో నాలుగవ మూల స్తంభం చదివి మీ వివరణ చెప్పండి మీరన్న మాటలు ఆ గీటురాయి మీద నిలబడతాయో లేదో! --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:57, 23 సెప్టెంబరు 2020 (UTC)
::: ముగ్గురు వాడుకరుల విజ్ఞత పరిగణలోకి తీసుకోరా? అందులోనూ ముగ్గురూ మహిళలేనా? ఒకరు తెలుగు వికీపీడియాలో మరెవరూ చేయనన్ని అనువాదాలు చేసినామె, మరొకరు పొరబాటు అనువాదాలు చేసిన ఒక గ్రూపులోంచి వచ్చి మావి పొరబాట్లని చెప్పినామె, మూడవ ఆమె ఏకీభవించినామె. ఏమిటిదంతా? ఒక్కో ముక్కా చదివే కొద్దీ చాలా విసుగ్గా ఉందీ చర్చ. ఏమిటిదంతా? ఇందుకేనా ఈ చర్చలు ప్రారంభించింది? ఇక్కడ జరుగుతున్నదేమిటి వ్యక్తిత్వ హననాలా? విజ్ఞతా హననాలా? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 16:03, 23 సెప్టెంబరు 2020 (UTC)
::: ఈ విధమైన వివక్షను, నిరాధారమైన ఆరోపణలను ఏ సంస్థలో ఊరుకుంటారు? వికీలో కొన్ని నియమ నిబంధనలున్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనవి - ఐదు మూలస్తంభాలు. వాటిలోకెల్లా చర్చించేవారికి ప్రధానమైనది "వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి" అన్న మూల స్తంభం. "నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప." ఇక్కడ కొందరి విజ్ఞతను కొందరితో సంబంధ బాంధవ్యాలు ఉన్నదన్న ఒకే కారణంతో తిరస్కరించడం, దానికి తోడు అవినీతి వంటి తీవ్రపదజాలం వాడడం ఆ మూలస్తంభాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. నా దారిన నేను అభిప్రాయం చెప్పి, నా పని చేసుకుంటూ పోతూంటే ఇంత హద్దుమీరడమా? మొదటి నుంచీ మీమీద నేను ఒక విధమైన నమ్మకం పెట్టుకున్నాను. క్రమేపీ వికీపీడియా విధానాలు తెలుసుకుని మంచి కృషిచేస్తారని. ఆ విషయం పలు చర్చల్లో కూడా వెల్లడించాను. వ్యక్తిగతంగా మీమీద ఎన్నడూ దాడిచేయలేదు. అలాంటిది, అకారణంగా నామీద ఇంతలేసి నిరాధార ఆరోపణలు చేస్తారు? ఇదేనా మీ విజ్ఞత? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 16:26, 23 సెప్టెంబరు 2020 (UTC)
 
::::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు, నేనెక్కడ మిమ్మలని అగౌరవపరిచాను. నేను ఒక్క మాట కూడా మిమ్మలని లేదా ఆ ముగ్గురిని అగౌరవ పరిచే విధంగా అనలేదు. నేను వారి కృషిని కించపరచలేదు. కానీ నేనేదో వారి కృషిని అవమానించినట్టు, అగౌరవ పరిచినట్టు, వారు మహిళలు కాబట్టి అన్నట్టు దయచేసి చిత్రీకరణ చేయడం ఆపండి. మీరన్న కూడా నాకు గౌరవం ఉంది. ఆ ముగ్గురు అన్నా కూడా గౌరవం ఉంది. మీకు విషయం అర్థం కాలేదని భావిస్తున్నాను.
* నేను ఓ సంస్థలో మేనేజర్ అనుకుందాం, నా కుటుంబ సభ్యులు దాదాపు అందరికీ ఉద్యోగాలిచ్చి, నా శక్తియుక్తులతో వారిని సమావేశాల్లో పొగిడి, వారికే పదోన్నతులు కల్పించానంటే మిగతా ఉద్యోగులు ఏమంటారు ? ఓ ఉద్యోగి ఓ జెన్యూన్ proposal తో వస్తే నేను వ్యతిరేఖం అయితె వీరు ఎవరికి మద్దతు తెలుపుతారు ? ఇది ఏ కారణం గా మంచిది ?
1. ఇక్కడ ఓ బూటకపు ఉద్యోగ కల్పన జరిగింది!(Fictious Hiring & Corruption)
2. నా శక్తియుక్తులతో వారిని సమావేశాల్లో పొగడటం. (Conflict of Interest)
3. నాకున్న అధికారాలను వారి కోసం misuse చేయడం. (not adhering to the organisation policies and abusing of others rightful opinion)
4. వీరికి పదోన్నతులివ్వడం. (Promoting with self Interest/Conflict of Interest)
5. మన వృత్తి రహస్యాలు తెలియకూడనివి వీరికి తెలిసే అవకాశం ఉండటం. (Serious Offence)
నిజానికి ఇక్కడ ముందే అయిష్టత తెలిపిన వారి విజ్ఞత గురించి పొగిడిన లేదా ఈ ముగ్గురు కాకుండా వ్యతిరేఖం తెలపిన ఏ వ్యక్తిని పొగిడినా అది conflict of Interest కిందికి రాదు. నేను వారికి విజ్ఞత లేదు అనలేదు. ఇక్కడ పరిగణన లోకి తీసుకోరాదు అని మాత్రమే అన్నాను. కానీ ఇక్కడ అలా జరుగలేదు. పైన నేను చెప్పిన ఉదాహరణ చక్కగా వర్తిస్తుంది. ఉదాహరణకు నేను కూడా నా కుటుంబ సభ్యులకు ఉద్యోగ అర్హత ఉందని, బాగా కృషి చేసి అనుభవం గడించారని వాదించవచ్చు. కానీ అందుకు ఎవ్వరూ ఒప్పుకోరు. ఏ సంస్థాగత నియమాలకైనా ఇది విరుద్దం. నాకు మీరు లేదా ఇతర సభ్యులను అగౌరవ పరిచే ఉద్దేశం ఏది లేదు. కాకపోతే మన భారతదేశం లో ఏ మేనేజర్ ఒడిపోడు,దాదాపుగా ఏ ఉద్యోగి మేనేజర్ తప్పు ఉన్నా కూడా గెలువలేడు. ఎందుకంటే ఈ మేనేజర్ కి పై స్థాయి వ్యక్తులతోను, మానవ వనరుల విభాగాలకి చెందిన వ్యక్తులతోనూ మంచి దగ్గరి సంబంధాలు ఉంటాయి. బంధుప్రీతి, సొంత ఆసక్తులే గెలుస్తాయి. పైగా మనదేశంలో చట్టాల ద్వారా ఉద్యోగుల హక్కుల రక్షణ ఏ మాత్రం లేదు. ఇది మీరు నేనేదో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని అన్నట్టు ఊహించుకుంటే ఇక దానికి నేనేమీ చేయగలను. ఒక్క వివరించడం తప్ప. _______[[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 01:46, 24 సెప్టెంబరు 2020 (UTC)
 
:: నేను ఓటింగ్ తిరస్కరించాను, ఆవిడ అంతట ఆవిడ ఓటు వేసింది. నేను ఆవిడకు ఇలా చర్చ జరుగుతోందని కూడా చెప్పలేదు. అర్జునరావు గారు ఎప్పుడో గతంలోనే ఆమె చర్చాపేజీలో (ఓటింగ్ జరుగుతున్నప్పుడు పెట్టలేదు) నోటిఫై చేశారు. నేనింత వరకూ ఆమె ఇదీ అదీ అనలేదు. మిగిలిన సభ్యులు అభినందించారు. ఆమెకేమీ పదవిలేదు పాడు లేదు. ఆమె 200 పైచిలుకు నిలిచిన అనువాదాలు చేసిందని నేను పొగడనక్కరలేదు. అది వాస్తవం. లెక్క చూసుకుని మీరే అందులో అవాస్తవం ఉంటే నాకు చెప్పవచ్చు. పైపెచ్చు ఆ ముక్క ఆవిడతో ఏ పరిచయం లేని చాలామంది వికీపీడియన్లు చెప్తున్నారు. ఆవిడ భవిష్యత్తులో ఏం రాసినా విజ్ఞత పరిగణించబోరనేనా మీరు చెప్పేది? మీరన్న నాలుగు విషయాల్లో ఏవీ ఇక్కడ వర్తించట్లేదు. నేను కానీ, మీనాగాయత్రి కానీ ఇక్కడ వికీపీడియా విధానాలకు అనుగుణంగానే వ్యవహరించాం, నేనెప్పుడూ ఆమెకు ప్రత్యేకించి అవకాశాలు కల్పించలేదు, ఆవిడకేమీ ఇక్కడ లాభదాయకమైన పదవి లేదు, మన వృత్తిలో రహస్యాలు ఉండవు పైపెచ్చు ఈ ఓటింగ్‌కు ఆవిడను నేను పిలవలేదు. ఐనా, మీరు ఆరోపించి పారేస్తారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్‌ ఇంటరెస్ట్ అంటే ఏమిటో ఎవరికీ తెలియదన్నట్టు ఇక్కడ వర్తిస్తోందా లేదా చూడకుండా పాఠం చెప్తారు. ఈ లెక్కన భవిష్యత్తులో ఆవిడ వికీలో ఏ అభిప్రాయం చెప్పినా ఈ ఒక్క కారణంతో మీరు కొట్టివేస్తారు.
::ఇక, మహిళలు పాయింట్ ఆఫ్‌ వ్యూ ఖచ్చితంగా ఉందిక్కడ. నేనిది ఎందుకు తీసుకువస్తున్నానంటే - మీరు మొదటి ఇద్దరు మహిళలకు మాతో బంధుత్వాలు ఉండబట్టి వాదనలోకి తెచ్చారు. మూడో అమ్మాయి పేరు ఎందుకు తీసుకువచ్చారు? మీకు ఆధారమేంటి? ఆమె వాడుకరి పేజీ తయారుచేసుకోలేదనా? ఈ ఓటింగ్‌లో పాల్గొన్న చాలామంది పేజీ తయారుచేసుకోలేదు. మరి వారెవ్వరి విషయంలోనూ రాని ప్రశ్న వీరి విషయంలోనే ఎందుకు వచ్చింది? (చర్చ పేజీలో వీరు ముగ్గురు రాశారనవద్దు, మీరు నమ్మే ఓటింగ్ ప్రక్రియ ప్రకారం ఓటు మాత్రమే పరిగణిస్తారు, చర్చలో ఏం రాశారన్నది లెక్కకు రాదు) అసలు మీ నిబద్ధతకు లిట్మస్ టెస్ట్ చెప్పనా? ఇద్దరు సభ్యులు ఐపీ అడ్రస్‌తో ఓటింగ్‌లో పాల్గొన్నారు, అది ఓటింగ్ మాల్‌ప్రాక్టీస్ అన్న మాటకు మీరింతవరకూ మద్దతునివ్వలేదు. ఎందుకు? ఈ ఒక్కటీ చెప్పండి. (ఇప్పటికే ఇతర సభ్యులు ఎత్తిచూపారు కాబట్టి అక్కరలేదనుకున్నాని అని మాత్రం తోసిపుచ్చవద్దు.) --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 03:00, 24 సెప్టెంబరు 2020 (UTC)
::: మీ వాదన చాలా బలహీనంగా ఉంది. మీరు ఏదో లిట్మస్ టెస్ట్ అని ఏదేదో అన్నారు. ఒకసారి పైన నేను చేసిన చర్చలో నేను ముందుగానే ప్రస్తావించాను. ఇంకోసారి చదవండి. మీరు మహిళల దృక్కోణం అంటే అది అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి మీరు చేస్తున్న ఉద్దేశాల ఆపాదన తప్ప ఇంకేమీ లేదు. నేను చెప్పాల్సింది సవివరముగా పైననే తెలిపాను. మిమ్మల్ని గురించి వాఖ్యనిస్తే అది పురుషుల పాయింట్ ఆఫ్ వ్యూ అంటారా ?. ఆహా! సరే పైన నేను అంత చక్కగా ఉదాహరణాలతో సహా వివరిస్తే ఇంకా అర్థం కాని వారి వలె నేనేదో కించపరిచినట్టు ఇంకా అదే మాట్లాడుతున్నారు. '''మన వృత్తిలో రహస్యాలు ఉండవు పైపెచ్చు ఈ ఓటింగ్‌కు ఆవిడను నేను పిలవలేదు.'''-- మిమ్మల్ని అనుసరించరని చెప్పగలరా, మీ ఉద్దేశాలు వారు ముందుగానే తెవికీ లోనె చదివి మీ బంధుత్వం వల్ల ప్రభావితం కారా ?, మీ చర్చల వలన వారు ప్రభావితం కారని చెప్పగలరా ?, వారికి ఏ వివక్ష లేదని మీరు నిరూపించగలరా ? బయటి వారు మిమ్మల్ని మీ వాదనను అభినందిస్తే నాకే కాదు ఎవరికి అభ్యంతరము లేదు. సరే నేనో నన్ను ఇష్టపడే ఓ మందను ఇక్కడ తయారు చేసుకుని అంతా నాకిష్టమైన వాదనలతో,judgement తో ఆ నా మంద పొగడ్తలతో నింపేస్తే మీకు అది సహేతుకమేనా ? కొంచెం నేను చెప్పింది చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. '''ఆమె 200 పైచిలుకు నిలిచిన అనువాదాలు చేసిందని నేను పొగడనక్కరలేదు. అది వాస్తవం. లెక్క చూసుకుని మీరే అందులో అవాస్తవం ఉంటే నాకు చెప్పవచ్చు.''' --నేను కాదు అని ఎక్కడ అన్నానో మీరే చెప్పాలి!!. నేను చెప్పాల్సింది పైనే వివరించాను. '''ఐనా, మీరు ఆరోపించి పారేస్తారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్‌ ఇంటరెస్ట్ అంటే ఏమిటో ఎవరికీ తెలియదన్నట్టు ఇక్కడ వర్తిస్తోందా లేదా చూడకుండా పాఠం చెప్తారు. ఈ లెక్కన భవిష్యత్తులో ఆవిడ వికీలో ఏ అభిప్రాయం చెప్పినా ఈ ఒక్క కారణంతో మీరు కొట్టివేస్తారు.'''---మీకు ఇది చక్కగా పైనే వివరించాను. అందులోనే సమాధానం ఉంటుంది చూడండి. నేను చెప్పాల్సింది వివరించాను. నేను ఈ విషయంలో నాకు 100% క్లారిటీ ఉంది అని చెప్పగలను. మీ అభిప్రాయం మీఋ చెప్పారు. అది మీ ఇష్టం. నా అభిప్రాయం లోకూడా ఏ మార్పు లేదు అని మరలా తెలియచేస్తున్నాను._____ [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 04:07, 24 సెప్టెంబరు 2020 (UTC)
:::: ఒక పక్కన ఓటింగ్‌లో కొంతమందికే నేను మెయిళ్ళు పంపానని ఆయన ఒప్పుకున్నారు. ఇద్దరు సభ్యులు ఐపీ అడ్రస్‌తో ఓటేశారు అందతా వదిలేసి నా స్టాండ్‌కి ఏ సంబంధం లేని స్టాండ్ (నేను ఇప్పటిదాకా కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు) తీసుకున్న మీనాగాయత్రి ఇక ఏ అభిప్రాయం వెలువరించినా నా ప్రభావమే అయివుంటుందని ఊహించేసుకుని తిరస్కరించడాన్ని ఏమనాలి? రెండు వందల అనువాదాలు చేసిన మనిషికి తనకంటూ ఒక అభిప్రాయం ఉండకపోవచ్చనీ, ఉన్నా దాన్ని మరొక కుటుంబ సభ్యుడు ప్రభావితం చేసేస్తాడనీ చేసే మీ అరోపణ చాలా దారుణం. బహుశా ఎంతటి ఆరోపణ చేసినా ఏమీ నిరూపించుకోకపోయినా నా అభిప్రాయం నాది అని తప్పుకోవచ్చన్న ధైర్యం కావచ్చు. అసలు ఇదంతా వదలెయ్యండి. '''ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి - ఏ ఆధారంతో మేకల హారిక గారి విజ్ఞత గురించి మాట్లాడారు మీరు? ఈ ఒక్క ప్రశ్నకు మాత్రమే కింద సమాధానం రాయండి.''' అది వదిలి దేనికీ రాసి తప్పించుకో చూడవద్దు. -[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:36, 24 సెప్టెంబరు 2020 (UTC)
:చాలా దురదృష్టకరమైన సంగతి ఇక్కడ చూస్తున్నాను. 270 పైచిలుకు వ్యాసాలను పరికరం ద్వారా అనువదించి తెవికీలో నంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తి విజ్ఞతను పరిగణించకూడదన్నారు. ఆమె బంధుత్వాన్ని అడ్డంపెట్టి ఆమె అభిప్రాయాలను సందేహించారు. పవన్ సంతోష్ గారికి, నాకు, విజ్ఞత లేదని ఆరోపించే మహా విజ్ఞులకూ, ప్రాజ్ఞులకూ, పుంభావ సరస్వతులకూ అనువాద పరికరం గురించి పాఠాలు నేర్పగల స్థాయిలో మీనాగాయత్రి గారు ఉన్నారు. అలాగే నాగరాణి గారి విజ్ఞతనూ పరిగణించరాదని అన్నారు. మేకల హారిక గారు ఎవరికి బంధువో తెలియక పోయినా "ఊహించుకుని" మరీ ఆమె విజ్ఞతను కాలదన్నారు. వీరి పట్ల జరుగుతున్న ఈ వ్యకిత్వ హననాన్ని నేను ఖండిస్తున్నాను. వారి విజ్ఞతను గౌరవించి, వారిని అభినందించి కొందరి అసూయకు కారణమయ్యాన్నేను. చివరికి ఈ నిందలకూ పరోక్షంగా కారణమయ్యాను. అందుచేత నేను ఆ ముగ్గురికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. దీన్ని ఇక ఆపమని [[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారిని కోరుతున్నాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:07, 24 సెప్టెంబరు 2020 (UTC)
 
===బాగా జరగవలసినవి===
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".