వికీపీడియా చర్చ:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
:[[వాడుకరి:Vmakumar|కుమార్ గారు,]] నమస్తే ఈమధ్య అన్ని చర్చల్లో పాల్గొన్నారు, మీకు అభినందనలు ఇది ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాను. తెవీకిలో సభ్యుల సంఖ్య చాలానే ఉన్నా చర్చలలో పాల్గొనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది మీరు గమనించే ఉంటారు అయితే ఒక అంశం మీద ఆసక్తి ఉన్నవారు కూడా సమయాభావం వల్ల మరి ఇతర కారణాల వల్ల కావచ్చు ఈ చర్చలో పాల్గొనడం లేదు. అయితే పైన తగిన కోరం లేనప్పుడు చర్చల ద్వారా నిర్వహించే పద్ధతి దుర్వినియోగం కావడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. చర్చలో పాల్గొనండి. అని ఎంత విజ్ఞప్తి చేసింది. స్పందించేవారు లేనప్పుడు ఎవ్వరు ఏం చేస్తారు. చుట్టూ సముద్రం ఉన్న అందులో ప్రయాణించాలి అంటే మన ఇంటి నుండి తాగే నీరు తీసుకుని పోయినట్లే ఉంది మన కథ. ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది సభ్యులు పాల్గొంటారన్న ఈ విషయంలో ఏమిటి మీ నమ్మకం. అయితే మీరు అనేది చర్చ మళ్లీ జరగాలని కోరుకుంటున్నావా, అర్థం కాలేదు వివరించండి. --[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|'''<font color="#FF4500">ప్రభాకర్ గౌడ్ </font><font color="#008000">నోముల</font>''']][[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="#1C39BB">(చర్చ)</font>]]• 19:10, 2 అక్టోబరు 2020 (UTC)
::: [[వాడుకరి:Vmakumar|Vmakumar]]గారూ, సరైన సమయంలో సరైన విధంగా చాలా మంచి చర్చ లేనవెత్తారు. ప్రారంభంలోనే మీరన్నట్టు ఈ చర్చలో అధికమంది పాల్గోలేరు (ఉండాలా లేదా అనే దానికి మాత్రమే 12 సభ్యులు పాల్గొన్నారు) కాని నియమం అమలులోకి వచ్చింది. ఇలా కొద్దిసంఖ్యలో మాత్రమే సభ్యులు పాల్గొన్న చర్చలలో మంచి నిర్ణయం వెలువడదనే అభిప్రాయానికి నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మరి నేనెందుకు పాల్గొనలేకపోయాననేది ముందుగా వివరిస్తాను. ఇటీవలి చర్చల ధోరణి మీకు పూర్తిగా తెలుసు. తెవికీ దృష్ట్యా ఏది చెప్పిననూ వ్యతిరేక ధోరణి ప్రదర్శించడమే ఇక్కడ కొందరికి అలవాటుగా మారింది. హుందాతనం పూర్తిగా లోపించింది. ఒప్పయినా తప్పయినా తమ వాదనే సరైనదనే ధోరణి ప్రబలంగా ఉంది. తమకు వ్యతిరేకంగా (తెవికీకి వ్యతిరేకం కాదు) ఉన్నవారిని ఇంటికి సాగనంపుట కూడా సాధారణమైపోయింది. తెవికీ అంటే ఏ కొందరి సొత్తు కాదు అందరిదీ అనే భావన కొందరిలో లేకపోవడం శోచనీయమైన విషయంగా చెప్పాల్సివస్తుంది. ఏ పాలసీ అయిన పలురకాలుగా ఆలోచించి సభ్యులు చెప్పిన అభిప్రాయాలకు విలువిస్తేనే వ్యవస్థ మనుగడ సాఫీగా సాగుతుంది, సమూహం కూడా తమ అభిప్రాయాలకు విలువిచ్చారనే ఉత్సుకతతో మరింత ఉత్సాహంతో కృషిచేసే అవకాశం ఉంటుంది. ఇదివరకు తెవికీలో ఉన్న ప్రజాస్వామ్య పద్దతులు ఒక్కొక్కటిగా మాయమౌతూపోవడం విచారించదగ్గ విషయం. ఒకానొకప్పుడు తెవికీ స్వర్ణయుగంలో ఉన్నప్పటి దశకూ ఇప్పటి దశకూ తేడా ప్రస్పుటంగా కనిపిస్తోంది. సుమారు 20 నెలల క్రితం కూడా [[వికీపీడియా చర్చ:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ]]పాలసీపై వ్యతిరేకత చూపాను. అది అవసరం లేదన్నాను. కారణం చూపాను, నా అభిప్రాయాలు వివరించాను. ఆ పాలసీ చేయడం బదులు నా నిర్వాహకహోదా తొలగించమన్నాను. కాని చివరికేమైంది? అభిప్రాయాలన్నీ చెత్తబుట్టలోకి వెళ్ళి పాలసీ అమలులోకి వచ్చిననూ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఉపయోగించలేకపోయారు (మాట ప్రకారం నా నిర్వాహకహోదా మాత్రం త్యజించాను). పాలసీలు ఉపయోగించనప్పుడు సభ్యుల విలువైన కాలాన్ని హరించివేసి పాలసీలు చేయడమెందుకు? మరి అందరూ ఆ పాలసీకి అనుగుణంగా చేస్తున్నారంటే అస్సలు కాదు. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. గత కొంతకాలంగా తెవికీ మూల నియమాలకు విరుద్ధమైన పాలసీలు కూడా రూపుదిద్దాయి. ఎలాగంటే ఇప్పుడు ఈ పాలసీ అయినట్లే. తెవికీ దృష్ట్యా ఎవరైనా ఏదైనా చెబితే "మాటలు రావమ్మా తిట్ల పురాణమే" తరువాయి. ఇదీ ప్రస్తుత తెవికీలో కొనసాగుతున్న ధోరణి. ఇప్పటి ధోరణికి విసిగిపోయి నాయకత్వం చేతులు మారాలని కూడా నేను స్పష్టంగానే చెప్పాను. తెవికీలో హుందాతనం కల్గి బాధ్యతతో అందరినీ కలుపుకుంటూ వెళ్ళే సభ్యులు కూడా ఉన్నారు, వారెవరో కూడా సూచించాను. రోజురోజుకు తెవికీ ఊబిలోకి దిగజారడమే కాని ఒడ్డుకు వచ్చే/తెచ్చే పరిస్థితి లేనేలేదు. నాణ్యత పూర్తిగా దిగజారుతోంది కాని ఇటీవలి ఒక [[వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2|చర్చ]]లో నాణ్యతపైనే ఎదురుదాడి జరిగింది. నాకు సమయం లేనందున ఆ చర్చలో ఎక్కువగా పాల్గొననలేకపోయాను కాని అక్కడా మీరు, [[వాడుకరి:Arjunaraoc|అర్జున]]గారు, [[వాడుకరి:దేవుడు|దేవుడు]]గారు చెప్పిన అభిప్రాయాలలో చాలా విలువైన సమాచారం ఉంది. ఆ చర్చ కారణంగా అనవసరంగా ఎలాంటి పొరపాటు లేనిదే ఒక చురుకైన సభ్యుడిని కోల్పోవడం తెవికీకి నష్టదాయకంగా చెప్పవచ్చు. ఇటీవలి తెవికీ లోపాల గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే వ్రాయవచ్చు. ఇక ఈ పాలసీ గురించి చెప్పాలంటే పూర్తిగా తప్పులతడకగా ఉంది. తప్పులేమిటనేవి చెప్పడం కూడా వృధా ప్రయత్నమే కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఏమీ చెప్పదల్చుకోలేను. సరైన ప్రణాళికతో చేయని ఆ పాలసీ అమలు సమయంలో వివాదాలు రావడం సమంజసమే కాబట్టి అప్పుడు లోపాలు లేవనెత్తవచ్చు. మరిన్ని విషయాలు తదుపరి చర్చలలో వివరించగలను. ధన్యవాదములతో ... [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:24, 2 అక్టోబరు 2020 (UTC)
Return to the project page "ఏకాభిప్రాయం".