మొదటి ముఆవియా: కూర్పుల మధ్య తేడాలు

"Muawiyah I" పేజీని అనువదించి సృష్టించారు
"Muawiyah I" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 8:
'''మొదటి ముఆవియా''' (క్రీ.శ. 597 లేదా 603 లేదా 605{{sfn|Hinds|1993|p=264}} - 680 ఏప్రిల్; పూర్తిపేరు: ''ముఆవియా ఇబ్న్ అబీ సుఫ్యాన్'') [[ఉమ్మయ్యద్ ఖలీఫత్]] వ్యవస్థాపకుడు, తొలి ఉమ్మయ్యద్ ఖలీఫా. 661 నుంచి 680లో అతను మరణించేవరకూ ఖలీఫాగా కొనసాగాడు. ఇతను ఇస్లామిక్ ప్రవక్త [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మద్]] మరణం తరువాత 30 ఏళ్ళు గడవకుండానే నలుగురు "సరైన మార్గనిర్దేశం గల" (''రషీదున్'') ఖలీఫాల పాలన తదుపరి ఖలీఫా అయ్యాడు. రషీదున్ ఖలీఫాలకున్న న్యాయం, ధార్మిక ప్రవర్తనలతో సరితూగడని భావించినప్పటికీ ముఆవియా తన పేరు నవీనమైన ఇస్లామిక్ సామ్రాజ్యపు నాణేలు, శాసనాలు, పత్రాల్లో కనిపించిన మొదటి ఖలీఫాగా గుర్తింపు పొందాడు.<ref name="RGHIGP2015:98">[[Muawiyah I#RGHIGP2015|Hoyland, ''In God's Path'', 2015]]: p.98</ref>
 
ముఆవియా అతని, తండ్రి అబూ సుఫ్యాన్ తమ ఖురేషీ తెగచెందినవాడూ, దూరపు బంధువు{{sfn|Hawting|2000|pp=21–22}}{{sfn|Hawting|2000|pp=21–22}} అయిన [[ముహమ్మద్]]‌ను 630లో అతను మక్కాను జయించేవరకు వ్యతిరేకించారు.{{sfn|Hinds|1993|p=264}} ఆ తరువాత మువావియా ముహమ్మద్ లేఖకులలో ఒకడు అయ్యాడు.{{sfn|Hinds|1993|p=264}} ముహమ్మద్ మరణానంతరం [[అబూబక్ర్|అబూ బక్ర్]] (పరిపానా కాలం 632-634) ఖలీఫా అయ్యాకా ముఆవియా అన్న యాజిద్ ఇబ్న్ అబి సూఫ్యాన్‌ని సిరియా ఆక్రమణకు సైన్య నాయకుల్లో ఒకడిగా పంపాడు. యాజిద్ సైన్యంలో ముందుండే దళానికి నాయకునిగా ముఆవియాను అబూ బక్ర్ నియమించాడు.{{sfn|Hinds|1993|p=264}} ఇతను సిరియా ఆక్రమణ తర్వాత పరిపాలనలో పదవి తర్వాత పెద్ద పదవి సంపాదిస్తూ క్రమేపీ ఖలీఫా [[ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్|ఉస్మాన్]] పరిపాలనా కాలం (పరిపాలన. 644-656)లో సిరియా ప్రావిన్స్ పరిపాలకుడు (గవర్నర్) అయ్యాడు.{{sfn|Hinds|1993|p=264}} ప్రావిన్సులోని శక్తివంతమైన బాను కల్బ్ తెగతో రాజకీయంగా మిత్రత్వం సంపాదించి,{{sfn|Dixon|1978|p=493}} తీరప్రాంత నగరాలకు రక్షణ వ్యవస్థ అభివృద్ధి చేసి,{{sfn|Jandora|1986|p=111}} [[బైజాంటైన్ సామ్రాజ్యం|బైజాంటైన్ సామ్రాజ్యంపై]] యుద్ధ ప్రయత్నాలు సాగించాడు.{{sfn|Hinds|1993|p=264}} ఈ దాడులు ముస్లిం సామ్రాజ్యపు మొట్టమొదటి నౌకా యుద్ధాలుగా పేరుపడ్డాయి.{{sfn|Lynch|2016|p=539}} 656లో ఉస్మాన్ హత్య తర్వాత, ముఆవియా ఖలీఫా మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు, అతని తర్వాత ఖలీఫా అయిన [[అలీ]]<nowiki/>ని వ్యతిరేకించాడు. [[మొదటి ముస్లిం అంతర్యుద్ధం]]<nowiki/>లో అలీ, ముఆవియాల సైన్యాలు తలపడినా [[సిఫిన్ యుద్ధం]]<nowiki/>లో విజయం ఎవరికీ దక్కక ప్రతిష్టంభన ఏర్పడింది. తర్వాత ఈ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి పలు మధ్యవర్తిత్వాలు, చర్చలు జరిగినా అన్నీ నిష్ఫలమయ్యాయి. ముఆవియా సిరియన్ మద్దతుదారుల్లోనూ, అతని మద్దతుతో అలీ నియమించిన ఈజిప్ట్ గవర్నర్‌ని జయించి ఈజిప్ట్ కైవసం చేసుకున్న ముఆవియా మిత్రుడు అమర్ ఇబ్న్ అల్-అస్ వంటి వారిలో ఖలీఫాగా గుర్తింపు పొందాడు. 661లో అలీ హత్య తరువాత, అలీ కుమారుడు, వారసుడు అయిన [[హసన్ ఇబ్న్ అలీ|హసన్‌ను]] ఖలీఫా పోటీ నుంచి విరమించుకొమ్మని కుఫా నగరంలో ముఆవియా లేఖల ద్వారానూ, తర్వాత సైనికాధిక్యత ద్వారానూ బలవంతపెట్టి ఆ ప్రయత్నంలో విజయం సాధించి శాంతి ఒప్పందాన్ని పొందాడు. ఆపైన ముఆవియా ఆధిక్యత ఖలీఫత్ అంతటా అంగీకారం పొందింది.
 
అంతర్గత వ్యవహారాల్లో, ముఆవియా నమ్మకస్తులైన సిరియన్ తెగలపైన, సిరియన్ క్రిస్టియన్లు అధికంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగంపైన ఆధారపడ్డాడు. పరిపాలన రంగంలో తపాలా మార్గానికి, ఉత్తరప్రత్యుత్తరాలకు, అధికార వ్యవహారాల నిర్వహణకు ప్రభుత్వ విభాగాలు తొలిసారి ఏర్పరిచిన ఘనత ముఆవియాకి దక్కింది. విస్తరణ ప్రయత్నాల్లో చూస్తే, బైజాంటైన్లపై భూమార్గంలోనూ, సముద్రమార్గంలోనూ ప్రతీ సంవత్సరమూ దాడులు క్రమం తప్పకుండా చేయడంలో నిమగ్నమయ్యాడు. వీటిలో 674-678 మధ్య జరిగిన విఫలమైన [[కాన్‌స్టాంటినోపుల్ ముట్టడి (674-678)|కాన్‌స్టాంటినోపుల్ ముట్టడి]] కూడా ఉంది. తన పరిపాలన ఆఖరి దశలో పరిస్థితి తిరగబడి అరబ్బులకే ఎదురుతిరిగి తానే సంధి కోసం అభ్యర్థించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.
"https://te.wikipedia.org/wiki/మొదటి_ముఆవియా" నుండి వెలికితీశారు