లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు
చి మూలాలు
పంక్తి 33:
 
==జాతి మూలాలు==
లౌలాన్ బ్యూటీ యూరోపియన్ ముఖలక్షణాలను కలిగివుంది. కాకసాయిడ్ జాతికి చెందింది. లౌలాన్ బ్యూటీ మమ్మీ ప్రాచీనతకన్నా విస్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించే ఆమె యూరోపియన్ ముఖకవళికలు, లక్షణాలుతో కూడిన భౌతిక రూపం, పాశ్చాత్య వస్తు సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా పురావస్తు శాస్త్రవేత్తల, పురా మానవ శాస్రవేత్తల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. దీనికి ప్రధాన కారణాలు 1. చైనీయులు మంగోలాయిడ్ జాతికి చెందిన ప్రజలు కాగా చైనా దేశంలో లభ్యమైన ఈ మమ్మీ మాత్రం కాకసాయిడ్ జాతికి చెందిన స్త్రీది కావడం. 2. ఈ మమ్మీతో పాటు ఇదే ప్రాంతంలోని బయల్పడిన ఇతర మమ్మీ సమాధులలో లభ్యం అయిన వస్తు సంస్కృతి, పశ్చిమ యురేషియా ప్రాంతానికి చెందిన వస్తు సంస్కృతికి చెందినది కావడం. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ విక్టర్ మెయిర్ మరియు జన్యు శాస్త్రవేత్త పాలో ఫ్రాంకాలాచి 1993 లో బ్యూటీ ఆఫ్ లౌలాన్ యొక్క జన్యు నమూనాలను సంపాదించి ప్రాధమికంగా ఆమె యూరోపియన్ అని తెలియచేసారు.<ref name="Chinese Mummies|Robert Cipriani"/> అయితే ఆధునిక డిఎన్ఏ పరిశోధనలను బట్టి లౌలాన్ బ్యూటీ యొక్క జాతి వారసత్వ మూలాలను పరిశిలిస్తే, ఆమె తండ్రి వైపు పూర్వీకులు యూరోపియన్ మూలానికి చెందినవారని, <ref name="lives">{{cite web|url=https://www.washingtonpost.com/wp-dyn/content/article/2010/11/19/AR2010111907467.html|title= A beauty that was government's beast|publisher=The Washington Post|author=Barbara Demick|date=November 21, 2010|accessdate=}}</ref> తల్లి వైపు పూర్వికులు మాత్రం మిశ్రమ-ఆసియా వారసత్వం కనీసంగా కలిగి ఉన్నట్లు తెలుస్తున్నది.<ref>her's a few maternal line was Eastern Asian mixed-blood.</ref> ఈ పరిశోధనలు ఆమె పూర్వికులు, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ఉప మిశ్రమ జాతికి చెందినవారిగా నిర్ధారించాయి. ఈమె బహుశా తొకేరియన్ల పూర్వీకురాలు కావచ్చు. ఈమెను ఖననం చేసిన పద్దతి కూడా పురాతన ఇండో-యూరోపియన్లకు (అఫానస్యేవ్ సంస్కృతి లేదా తొకేరియన్) చెందింది.
 
==ప్రాచీన నాగరికతా మూలాలు ==
చారిత్రిక పూర్వయుగంలో అంటే సుమారు 4000 సంవత్సరాల క్రితం ఇండో-యూరోపియన్ తెగలలో కొన్ని సమూహాలు, పశ్చిమ యురేషియా మూల ప్రాంతాలనుంచి లేదా పశ్చిమ మధ్య ఆసియా స్టెప్పీ ప్రాంతాలనుండి బయలు దేరి చైనాలోని తారిమ్ బేసిన్ ప్రాంతానికి వలస వెళ్ళారు. అయితే వీరు తారిమ్ బేసిన్ ప్రాంతంలో సంచార జీవితాన్ని వదిలిపెట్టి స్థిరజీవనాధారం కొనసాగించారని తెలుస్తుంది. ఒయాసిస్‌లను ఆధారం చేసుకొని వీరు ఒకవైపు బార్లి, జొన్నలు, గోధుమలు సాగు చేస్తూ మరోవైపు గొర్రెల పెంపకం, మేకల పెంపకం చేపట్టారు. కాలక్రమంలో తారిమ్ బేసిన్‌లో విస్మృతికి లోనైన ఒక ప్రాచీన నాగరికత (క్రీ.పూ. 2000 - క్రీ.పూ. 1000) కు వీరు కారణమయ్యారు. నిజానికి లౌలాన్ బ్యూటీ, ఆ విధంగా వేలాది సంవత్సరాల క్రితమే పశ్చిమ యురేసియా ప్రాంతం నుంచి చైనాకు వలస వెళ్ళిన తెగ ప్రజలకు చెందిన ఒకానొక స్త్రీ. అయితే విశేషమేమిటంటే ఆదినుంచి చారిత్రక స్పృహ కలిగివున్న ప్రాచీన చైనా చరిత్రకారులుకు సైతం, తమ దేశంలోనే వేలాది సంవత్సరాల క్రితం జీవించిన వీరి ఉనికిని గురించి లేశమాత్రంగా తెలియదు. నేటి పురావస్తు శాస్రవేత్తల ప్రకారం ఈ లౌలాన్ బ్యూటీ, చైనా-యూరప్‌ల కూడలి ప్రాంతాల వద్ద క్రీ.పూ. 2000 - క్రీ.పూ. 1000 ల మధ్య కాలంలో విలసిల్లిన ఒక ప్రాచీన నాగరికతకు చెందిన మహిళదిగా భావించబడింది.
 
లౌలాన్ బ్యూటీ మమ్మీ యొక్క ఆవిష్కరణ, పురాతన చైనాపై ఆధునిక ప్రపంచ దృక్పథాన్ని రూపుదిద్దింది. చారిత్రిక పూర్వయుగంలో చైనాలో కాకేసియన్లు కూడా వర్ధిల్లారని తెలియవస్తుంది. మధ్య ఆసియాలో ముఖ్యంగా తారిం బేసిన్ ప్రాంతంలో విస్మృతికి లోనైన ఒకానొక ప్రాచీన ఎడారి నాగరికతకు చెందిన సంస్కృతి విశేషాలను వెలికితీసే ప్రయత్నానికి ఈ మమ్మీ అధ్యయనం ప్రధాన ఆధారంగా నిలుస్తుంది.
==సాంస్కృతిక వివాదం==
 
==ఇవి కూడా చూడండి==
[[తారిమ్ మమ్మీలు]]
పంక్తి 53:
==రిఫరెన్సులు==
{{cite news |last1=Edward |first1=Wong |title=The Dead Tell a Tale China Doesn't Care to Listen To |url=https://www.nytimes.com/2008/11/19/world/asia/19mummy.html |accessdate=17 October 2020 |publisher=The New York Times |date=November 18, 2008|ref=Edward Wong|2008}}}}
ఆమె ఆవిష్కరణ పురాతన చైనాపై ఆధునిక ప్రపంచ దృక్పథాన్ని రూపొందించింది.
 
==బయటి లింకులు==
 
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు