లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి మూస తొలగింపు
పంక్తి 1:
{{in use}}
[[File:Loulan beauty closeup.jpg|thumb|లౌలన్ బ్యూటీ క్లోజప్ చిత్రం]]
[[తారిమ్ మమ్మీలు|తారిమ్ మమ్మీల]]లో అత్యంత ప్రసిద్ధమైన వాటిలో లౌలాన్ బ్యూటీ ఒకటి. సుమారు 3800 సంవత్సరాల క్రితం కాంస్య యుగంలో నివసించిన ఒక కాకేసియన్ మహిళ యొక్క మృతదేహం ఇది. దీనిని 1980 లో చైనా లోని [[తక్లమకాన్ ఎడారి]]లో గల లోప్ నర్ ఉప్పు నీటి సరస్సు సమీపంలో కనుగొన్నారు. క్రీ.పూ. 1800 కాలానికి చెందిన ఈ మమ్మీ, తారిం బేసిన్‌లో లభించిన మమ్మీలలో అత్యంత పురాతనమైన వాటిలో ఒకటి మరియు ప్రముఖమైనది కూడా. ఈమె చనిపోయి 3800 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ముఖలక్షణాలు చెక్కు చెదరగుండా బాగా భద్రపరచబడిన స్థితిలో లభించింది. ఆకర్షణీయమైన ముఖ లక్షణాలను బట్టి ఈమెను లౌలాన్ బ్యూటీ (బ్యూటీ అఫ్ లౌలాన్) లేదా క్రోరాన్ బ్యూటీ (బ్యూటీ అఫ్ క్రోరన్) గా వ్యవహరించారు. ఉరుంచి (చైనా)లోని షిన్జాంగ్ ప్రాంతీయ మ్యూజియంలో ఈ మమ్మీ ఉంచబడింది. చైనాలో బయల్పడిన ఈ కాకేసియన్ మమ్మీ ముఖంలో యూరోపియన్ లక్షణాలు స్పష్టంగా ఉండటంతో ఈమె చైనీయురాలు కాదని తేలిపోయింది. దానితో ఈమె జీవిత ప్రస్థానం చైనా భూభాగంలో ఎలా ముగిసింది అన్న విషయం తీవ్ర చర్చలకు దారితీసింది.
Line 12 ⟶ 11:
*ఆర్కియాలజిస్టుల ప్రకారం ఈ లౌలాన్ బ్యూటీ, చైనా-యూరప్‌ కూడలి ప్రాంతాల వద్ద క్రీ.పూ. రెండవ సహస్రాబ్దిలో విలసిల్లిన ఒక ప్రాచీన నాగరికతకు చెందిన మహిళగా భావించబడింది.
*చైనీయుల మంగోలాయిడ్ జాతికి భిన్నంగా వున్న ఈ పురాతన కాకసాయిడ్ జాతి మమ్మీ చైనా భూభాగంలో బయటపడటం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఈమె జాతీయత, చైనా దేశంలో రాజకీయ-సాంస్కృతిక వివాదానికి దారితీసింది. ఉయ్ఘర్ వేర్పాటు జాతీయ ఉద్యమకారులకు సంస్కృతీ పరంగా లౌలాన్ బ్యూటీ ఒక జాతీయ గౌరవ చిహ్నంగా మారింది. ఇది చైనా ప్రభుత్వానికి సాంస్కృతికంగా చిక్కులు తెచ్చిపెట్టింది.
 
==జీవితం మరియు మరణం==
క్రీస్తు పూర్వం 1800 లో చనిపోయేనాటికి, లౌలాన్ బ్యూటీ 45 సంవత్సరాల వయస్సు వరకు జీవించింది. ఈమె యూదు మతానికి చెందిన ప్రవక్త ‘అబ్రహం’ జీవించిన కాలంలో వుండేది. పొడి దుమ్ము, మసి మొదలైనవి ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయి ఆమె మరణించింది.{{sfn|Edward, Wong|2008}} <ref name="Chinese Mummies|Robert Cipriani"/>చలిని తట్టుకోవడానికి ఆమెకు తొడిగిన ఉడుపులు, ఇతరత్రా చేసిన ఏర్పాట్లను బట్టి పరిశీలిస్తే, లౌలాన్ బ్యూటీ శీతాకాలంలో మరణించి ఉండవచ్చని పురావస్తు పరిశోధకురాలు, చరిత్ర పూర్వయుగపు వస్త్ర నిపుణులు అయిన ఎలిజబెత్ వేలాండ్ బార్బర్ పేర్కొన్నారు. ఆమె ధరించిన దుస్తుల ముతక స్వరూపాన్ని బట్టి, ఆమె జుట్టులోని పేలును బట్టి చూస్తే, ఆమె కష్టతరమైన జీవితం గడిపినట్లు తెలుస్తుంది.{{sfn|Edward, Wong|2008}}
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు