నాట్ గ్రిడ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, వుంది. → ఉంది. (4) using AWB
added relevant citations
పంక్తి 3:
'''నాట్ గ్రిడ్''' (NAT GRID) అనేది భారత ఆర్థిక, రక్షణ, గూడచార తదితర రంగాలకు సంబంధించిన వివిధ కీలక నిఘా సంస్థల మధ్య సమాచారాన్ని మార్పిడి (sharing) చేసే ఒక సమీకృత ఇంటిలిజెన్స్ గ్రిడ్ ప్రాజెక్ట్. దీని ద్వారా ప్రతీ పౌరుడికి సంబంధించి 21 రకాల అంశాలకు చెందిన సమస్త వివరాల డేటా బేస్ సేకరించబడి కీలక ఇంటిలిజెన్స్ సంస్థలకు క్షణాలలో అందచేయబడుతుంది. తద్వారా దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఉగ్రవాద ముప్పు వాటిల్లే ప్రయత్నం జరగక ముందే, పొంచివున్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఎదుర్కొనే విధంగా నాట్ గ్రిడ్ రూపొందించబడింది. ఒక విధంగా కౌంటర్ టెర్రరిజం నిర్వహించడానికి నిఘా సంస్థలకు తోడ్పడే విధంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.
==ఆవశ్యకత==
ప్రపంచ దేశాలలో [[ఇరాక్]], [[ఆఫ్ఘనిస్తాన్]] [[పాకిస్తాన్]], [[నైజీరియా]] [[సిరియా]] దేశాల తరువాత ఉగ్రవాద చర్యల ప్రభావిత దేశాల జాబితాలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. మొత్తం 124 దేశాల జాబితా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో భారత్ కు 6వ స్థానంలో ఉంది. ఒకప్పుడు భారత్ దేశంలో తీవ్రవాద దాడులు పంజాబ్, కాశ్మీర్, అస్సాం వంటి సరిహద్దు రాష్ట్రాల వరకే పరిమితమై వుంటే నేడు ఉగ్రవాదుల దాడులు దేశం నలుమూలలకు, లోతట్టు ప్రాంతాలకు కూడా విస్తరించాయి.<ref name=":0">{{Cite web|url=https://www.visionofhumanity.org/global-terrorism-index-2020-the-ten-countries-most-impacted-by-terrorism/|title=Global Terrorism Index 2020: The ten countries most impacted by terrorism|date=2020-11-27|website=Vision of Humanity|language=en-US|access-date=2020-12-06}}</ref>
 
విచారణతో సంబంధం లేకుండా ముందు జాగ్రత్త చర్యగా అనుమానితులను నిర్భందించే ప్రివెంటివ్ చట్టాలు (నాసా యాక్ట్–1980, టాడా యాక్ట్– (1985-95), పోటా యాక్ట్– (2002-04), కోకా యాక్ట్-1999 వంటి పదునైన చట్టాలు ఎన్నున్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం లోని లోపాలను అదనుగా చేసుకొని విధాన లోపాల వైఫల్యంతో చెలరేగిపోతున్న ఉగ్రవాద కార్యకలాపాలు కట్టడి చేయడానికి దేశంలోని అన్ని కీలక నిఘా వర్గాలు మద్య మరింత సమన్వయం ఏర్పడాల్సినవసరం ఉంది.
 
ఉగ్రవాదుల దాడుల కీలక సమయంలోను, దాడులు జరగకుండానే ప్రమాదాన్ని ముందస్తుగానే పసిగట్టడంలో భారత దేశ నిఘా వ్యవస్థలు ఐ.బి. (ఇంటిలిజెన్స్ బ్యూరో), రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) తరుచుగా వైఫల్యం చెందుతున్నాయి. ముఖ్యంగా 2008 లో ముంబై నగరంపై టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో వివిధ నిఘా వ్యవస్థల మధ్య జరుగుతున్న తీవ్ర సమన్వయలోపాన్ని సరిదిద్దాల్సినవసరం ఏర్పడింది.<ref name=":0" />
==నేపద్యం==
2008 లో 26/11 ముంబై నగరంపై టెర్రరిస్టుల దాడితో మన దేశ నిఘా వ్యవస్థల ఘోర వైఫల్యం బయటకు వెల్లడైంది. ముంబై దాడులకు ముందుగా పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికన్ లష్కర్ తీవ్రవాది డేవిడ్ హాడ్లీ అనేకసార్లు భారతదేశాన్ని సందర్శించాడు, చేయబోయే దాడులకు ముందస్తుగా రెక్కీని కూడా విజయవంతంగా నిర్వహించాడు, భారతదేశం నుండి తరుచుగా పాకిస్తాన్, పశ్చిమాసియా మీదుగా అమెరికాకు తిరుగు ప్రయాణాలు సాగించాడు. అనేకసార్లు ఆతను అసాధారణంగా సందర్శిస్తున్నా, అతని అనుమానాస్పద రాకపోకలను దేశీయ నిఘావర్గాలు ఏ దశలోనూ సందేహించకపోవడం, ఆరా తీయకపోవడం జరిగింది. ఫలితంగా ముంబై నగరంపై టెర్రరిస్టుల దాడితో (26/11) దేశం భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/నాట్_గ్రిడ్" నుండి వెలికితీశారు