అంతులేని కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 26:
సరిత (జయప్రద) ఒక మధ్యతరగతి కుటుంబ జీవనానికి ఏకైక ఆర్థిక ఆధారమైన ఉద్యోగస్తురాలు. ఆమె చుట్టూ ఎన్నో సమస్యలు అల్లుకొని ఉంటాయి. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయాడు. తల్లి చాదస్తపు మనిషి. తమ్ముడు గుడ్డివాడు. ఒక చెల్లెలు వితంతువు. మరో చెల్లికి పెళ్ళి కావలసి ఉంది. అన్న ([[రజనీకాంత్]]) త్రాగుబోతు. ఇంకా అన్నకొక భార్య, బిడ్డ ఉన్నారు. వారంతా సరిత సంపాదన మీద ఆధారపడినవారే. అంతే కాకుండా ఆమె నిరంకుశత్వాన్ని (అలా అని వారి భావం) అసహ్యించుకొంటుంటారు.
 
[[సరిత]]ను ప్రేమిస్తున్న తిలక్ (?ప్రసాద్ బాబు) ఆమెను పెళ్ళికి ఒప్పించాలని ప్రయత్నిస్తాడు కానీ కుటుంబ బాధ్యతల కారణంగా సరిత వివాహానికి సిద్ధం కాలేకపోతుంది. అయితే సరిత వితంతు సోదరి (శ్రీప్రియ) తిలక్ పట్ల ఇష్టం పెంచుకొంటుంది. తిలక్ కూడా ఆమెపట్ల ఆకర్షితుడౌతాడు. సరిత వారిద్దరి పెళ్ళీ చేస్తుంది.
 
సరిత ఇంటిపై గదిలో అద్దెకుండే వికటకవి గోపాల్ ([https://en.m.wikipedia.org/wiki/G._V._Narayana_Rao జి. వి. నారాయణరావు]) తన ఆటపాటలతో అందరినీ అలరిస్తుంటాడు. సరిత స్నేహితురాలు చంద్ర ([[ఫటాఫట్ జయలక్ష్మి|"ఫటాఫట్" జయలక్ష్మి]]) జీవితాన్ని తేలికగా తీసుకొనే రకం. సాంఘీకమైన కట్టుబాట్లను లెక్క చేయదు. అయితే ఒక చిక్కు సమస్యలో ఆమె మనసు విరిగిపోయి [[ఆత్మహత్య]]కు తలపడుతుంది. సరిత ఆమెను రక్షించి వికటకవి గోపాల్‌తో పెళ్ళి చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/అంతులేని_కథ" నుండి వెలికితీశారు