ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు

→‎ఆంధ్రుల్లో అనైక్యత: ఆంధ్రుల్లో అనైక్యత విషయమై మరికొంత పాఠ్యం చేర్పు, + మూలం
→‎నేపథ్యం: విశాలాంధ్ర భావన అప్పటిది కాదు, ఆంధ్రప్రదేశ్ కాలం నాటిది.
పంక్తి 2:
==నేపథ్యం==
 
మద్రాసు ప్రెసిడెన్సీలో [[శ్రీకాకుళం]], [[విశాఖపట్నం]], [[తూర్పు గోదావరి]], [[పశ్చిమ గోదావరి]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[అనంతపురం]], [[కడప]], [[కర్నూలు]] జిల్లాలుండేవి (విజయనగరం, ప్రకాశం జిల్లాలు ఆ తరువాత ఏర్పడ్డాయి). ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్పటికీ, పరిపాలనలోను, ఆర్థిక వ్యవస్థలోనూ తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్థికంగానూ గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం – '''విశాలాంధ్ర''' - కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది.
 
==అంకురార్పణ==
 
మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా [[1912]] మేలో [[నిడదవోలు]]లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులోస,దస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిదా వేసారు.
 
నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం [[1913]] [[మే 20]]న గుంటూరు జిల్లా [[బాపట్ల]]లో సమగ్ర '''ఆంధ్ర మహాసభ'''ను నిర్వహించారు. 800 మంది డెలిగేట్లు, 2000 మంది సందర్శకులూ ఈ సమావేశానికి హాజరయ్యారు. [[బయ్యా నరసింహేశ్వరశర్మ|బయ్యా నరసింహేశ్వర శర్మ]] అధ్యక్షత వహించాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/Andhra-Mahasabhalu-on-May-26/articleshow/19761956.cms|title=Andhra Mahasabhalu on May 26 {{!}} Hyderabad News - Times of India|last=Apr 28|first=TNN /|last2=2013|date=|website=The Times of India|language=en|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105034632/https://timesofindia.indiatimes.com/city/hyderabad/Andhra-Mahasabhalu-on-May-26/articleshow/19761956.cms|archive-date=2021-01-05|access-date=2021-01-05|last3=Ist|first3=04:20}}</ref> ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/cities/Vijayawada/bapatla-hosted-first-andhra-conference-in-1913/article29858594.ece|title=Bapatla hosted first Andhra Conference in 1913|last=Reporter|first=Staff|date=2019-11-02|work=The Hindu|access-date=2021-01-05|archive-url=https://web.archive.org/web/20210105033707/https://www.thehindu.com/news/cities/Vijayawada/bapatla-hosted-first-andhra-conference-in-1913/article29858594.ece|archive-date=2021-01-05|language=en-IN|issn=0971-751X}}</ref> ప్రత్యేకాంధ్ర గురించి ప్రజల్లో అవగాహన కలిగించే ప్రచారం చేపట్టాలని ప్రతిపాదన రాగా, రాయలసీమ, గంజాము, విశాఖపట్నం లకు చెందిన ప్రతినిధులు దాని పట్ల అంత సుముఖత చూపలేదు. గంటి వెంకటరామయ్య, [[న్యాపతి సుబ్బారావు పంతులు]], [[మోచర్ల రామచంద్రరావు]], [[గుత్తి కేశవపిళ్లె|గుత్తి కేశవ పిళ్ళె]]<nowiki/>లు ప్రతిపాదనను వ్యతిరేకించిన వారిలో ప్రముఖులు. ఈ ప్రచార అంశాన్ని ఒక స్థాయీ సంఘానికి అప్పగించాలని [[కొండా వెంకటప్పయ్య]] చేసిన సవరణతో అది ఆమోదం పొందింది.<ref name=":0">{{Cite web|url=https://www.scribd.com/document/450625337/andhra-movement-pdf|title=andhra movement.pdf|website=Scribd|language=en|access-date=2021-01-05}}</ref> తరువాతి రోజుల్లో పట్టాభి సీతారామయ్య ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాడు. ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు.