బండి గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 28:
1967 ప్రాంతంలో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యాడు. ఈ సమాజం ప్రతి సంవత్సరం కవిపండితుల జయంతులు జరుపుతుంది. ఆవిధంగా ఎందరో ప్రసిద్ధవ్యక్తుల పరిచయం, స్నేహం లభించింది. కావలి కళాశాల అద్యాపకులు కే.వి. ఆర్ స్నేహం తనపయి గొప్ప ప్రభావం కలిగించింది. 1969 మార్చి నెలలో [[గురజాడ అప్పారావు]] గారి మొదటి కన్యాశుల్కం ప్రతి సంపాదించి, దానికి నోట్సు రాసి, ఆరుద్ర ఉపోద్ఘాతంతో ప్రచురించాడు. ఈ పుస్తకం పరిశోధకుడుగా ఆయనకు అజరామరమయిన కీర్తి తెచ్చిపెట్టింది.ఇందులో గురజాడవారి జన్మదినాన్ని నిర్దుష్టంగా నిరూపించాడు.
 
బంగోరె విద్యార్థి దశలోనే [[బుచ్చిబాబు]] గారి [[చివరకు మిగిలేది (నవల)|చివరకు మిగిలేది నవల]] చదివి ఆ ప్రభావంలో బుచ్చిబాబుతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. అంతకుముందు ఆచంట రాజారాం గారి అభిమానిగా ఉన్నాడు. 1967 ప్రాంతాలలో ఖలీల్ జిబ్రాన్ కవిత్వం మీద మిత్రులతో చర్చలు. జరుపుతుండేవాడు.
 
[[ఎన్.ఎస్.కృష్ణమూర్తి|నేలనూతల శ్రీకృష్ణమూర్తి]] 1962-64 కాలంలో విక్రమ సింహపురి మండల సర్వస్వం గ్రంథాన్ని సంపాదకులుగా వెలువరించడానికి కృషిచేస్తున్నాడు. ఇందులో బంగోరె స్థానిక చరిత్ర మీద అనేక వ్యాసాలు రాయడమే కాక, ఈ గ్రంధ సహాయ సంపాదకుడుగా పనిచేసాడు. "Speeches and essays of C.R. Reddy" చిన్న పుస్తకాన్ని తయారుచేసాడు, నెల్లూరు వర్ధమాన సమాజం దీన్నీ ప్రచురించింది.1970)
"https://te.wikipedia.org/wiki/బండి_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు