దశావతారం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
ఇక్కడ గోవింద్ అనే బయో సైంటిస్ట్ మానవాళిని చిటికలో అంతం చేసే సింథటిక్ బయో వైరస్ కనిపెడతాడు. అది కాస్తా ఉగ్రవాదుల చేతిలో పడుతోందని తెలుసుకొని, దాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఓ చిన్న బాక్స్ లో పెట్టి ఎఫ్ బీ అయ్ కీ చెప్పే తరుణంలో ఫ్లెచర్ ( కమల హాసన్ 4 ) అనే టెర్రరిస్ట్ దృష్టిలో పడతాడు. తన స్నేహితుడింట్లో తలదాచు కుందామనుకునే సరికి ఫ్లెచర్ గోవింద్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ అతని స్నేహితుడూ, స్నేహితుడి జపనీస్ భార్యా ఫ్లెచర్ చేతిలో మరణిస్తారు. ఎలాగో అక్కడనుండి తప్పించుకొని బయట పడినా ఓ నాటకీయ పరిణామంలో ఆ బయో వైరస్ బాక్స్ కాస్తా ఇండియాలో చిదంబరం అనే ఊరికి పార్సిల్ అయ్యిందని తెలుసుకొని అందరికళ్ళూ కప్పి, విమానం కార్గోలో దూరి, ఇండియా వెళిపోతాడు. గోవిందు వివరాలు తెలుసుకొన్న ఫ్లెచర్ కూడా తన స్నేహితురాలి ( మల్లికా షరావత్ ) సహాయంతో ఇండియా బయల్దేరుతాడు. తన స్నేహితుడి జపనీస్ భార్య మరణం తెలుసుకొన్న అతని అన్న ( కరాటే ఫైటర్ - కమల హాసన్ 5 ) గోవిందుని హత మార్చాలని ఇండియాకి ప్రయాణం కడతాడు. బయో వైరస్ వెపన్ కోసం గోవిందూ, ఆ రెండింటి కోసం ఫ్లెచరూ, అతని ప్రేయసీ, అతన్ని చంపాలని జపనీస్ ఫైటరూ ఒకరి నొకరు చేజ్ చేసుకోవడంతో కథ పాకన పడుతుంది.
 
ఈ లోగా బలరాం నాడార్ ( కమల హాసన్ 6 ) అనే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో చిక్కి, టెర్రరిస్ట్ గా అనుమానింప బడతాడు. అందరి కళ్ళూ కప్పి తప్పించుకుంటాడు గోవింద్. బయో వైరస్ బాక్స్ కోసం సరాసరి చిదంబరంలో ఉన్న ఓ వైష్ణవ కుటుంబాన్ని కలవడానికి వెళతాడు. అక్కడే లక్ష్మీ ( ఆసిన్ ) అనే అమ్మాయి పరిచయ మవుతుంది. ఈ లోగా బయో వైరస్ బాక్స్ పార్సిల్ లక్ష్మి బామ్మ ( కమల హాసన్ - 7 ) కామాక్షి చేతిలో పడుతుంది. అదికాస్తా ఊరేగింపులో గోవిందరాజు విగ్రహం లో జార విడుస్తుంది కామాక్షి. అనుకోని హఠాత్పరిణామ క్రమంలో ఆ విగ్రహామూ , లక్ష్మితో కలసి పారిపోతాడు గోవింద్. అతన్ని ఫ్లెచర్, బలరాం నాడార్ ఇద్దరూ వెంబడిస్తూనే ఉంటారు. బయో వైరస్ టెంపరేచర్ పెరగ కుండా చూడాలని గోవింద రాజు విగ్రహాన్ని ఓ ఊరి చివర స్మశానం దగ్గర గోతిలో కప్పెడతాడు. అక్కడే ఇసుక స్మగ్లర్స్ తో గొడవపడతాడు గోవింద్. ఈలోగా ఇసుక స్మగ్లర్ బండారాన్ని బయట పెట్టే నిమిత్తమై పుణ్యకోటి ( కమల హాసన్ – 8 ) అనే అతను వస్తాడు. వాళ్ళని తప్పించుకొని వెళుతూ ఓ వాన్ యాక్సిడెంట్ లో పొడుగాటి కరీముల్లా ( కమల్ హాసన్ - 9 ) అనే ముస్లిం కుటుంబాన్ని కలుస్తాడు. గాయ పడ్డ కరీముల్లా తల్లిని ఆసుపత్రిలో చేర్చే సమయంలో కేన్సర్ వ్యాధితో ఉన్న అవతార్ సింగ్ ( కమల్ హాసన్ – 10 ) అతని భార్య ( జయప్రద ) నీ కలుస్తాడు. ఇలా అనేక పాత్రలన్నీ ఒక దాని వెంబడి ఒకటి వస్తాయి. గోవింద్ బయో వైరస్ ని ఎలా రక్షించాడు? ఫ్లెచర్ నుండి ఎలా తప్పించుకున్నాడు ? జపనీస్ ఫైటర్ పగ తీరిందా? బలరాం నాడార్ గోవిందుని టెర్రరిస్ట్ గా పట్టుకున్నాడా? పుణ్యకోటీ, ఇసుక స్మగ్లర్ల గొడవ తీరిందా? కేన్సర్ వ్యాధి గురైన అవతార్ సింగ్ కీ ఈ కథకీ సంబంధం ఏమిటి? ఏభై ఏళ్ళ క్రితం చనిపోయిన బామ్మ కొడుకు పోయిన సంగతి తెలుసుకుందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జవాబు వెండితెర మీద వెతుక్కోవాల్సిందే!<ref name=navatarangam>నవతరంగం వెబ్సైట్ నుండి... [http://navatarangam.com/?p=497 దశావతారం సినిమా గురించి]పై వ్యాసం. [[జూన్ 16]], [[2008]]న సేకరించబడినది. </ref>
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/దశావతారం_(2008_సినిమా)" నుండి వెలికితీశారు