బి. పద్మనాభం: కూర్పుల మధ్య తేడాలు

చి 27.6.82.120 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3054827 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
అప్పుడే తేలు కాటుతో తమ్ముడు ప్రభాకరం, జబ్బుచేసి చెల్లెలు రాజేశ్వరి మరణించడంతో విరక్తి కలిగి సినిమాలకు దూరంగా ఉన్నాడు. [[గుంతకల్]] దగ్గరున్న [[కొనకొండ్ల]]లో చిన్నాన్న శ్రీనివాసరావు దగ్గర కరణీకం నేర్చుకుంటూ ఉండగా వీరకుమార్ షూటింగుకు రమ్మని కబురు వచ్చింది. ఆ షూటింగు జరుగుతున్నరోజుల్లో [[విజయా పిక్చర్స్|విజయాసంస్థ]]తో ఏర్పడిన పరిచయం ఆయన కెరీర్ ను మలుపుతిప్పింది.
 
[[షావుకారు]]లో నౌకరు పోలయ్య వేషానికి ముందు [[వల్లూరి బాలకృష్ణ|బాలకృష్ణ]]ను అనుకున్నారు. ఐతే చక్రపాణి "వీడు ముదురుగా ఉన్నాడు. ఇంకెవరూ లేరా?" అని అడగడంతో దర్శకుడు [[ఎల్.వి.ప్రసాద్]] వెంటనే "రాధికలో కృష్ణుడిగా వేసిన పద్మనాభం ఉన్నాడు." అని పిలిపించి వేషం ఇప్పించారు. [[పాతాళభైరవి]] స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కె.వి.రెడ్డి తోటరాముడిగా [[రాజారెడ్డి]], మాంత్రికుడిగా [[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]] అనుకున్నాడు. షావుకారు రషెస్ చూసిన వెంటనే మనసు మార్చుకుని హీరోగా [[ఎన్.టి.ఆర్.]], మాంత్రికుడిగా [[ఎస్.వి. రంగారావు|ఎస్.వి.ఆర్.]], అంజిగా బాలకృష్ణ (పాతాళభైరవితో ఇతడి అసలు పేరు మరుగునపడిపోయి అంజి(గాడు)గానే ప్రసిద్ధి పొందాడు), సదాజపుడిగా పద్మనాభం లను ఖరారు చేసుకుని విజయావారి పర్మనెంటు ఆర్టిస్టులుగా మూడేళ్ళ అగ్రిమెంటు తీసుకున్నారు. [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] భాషల్లో [[పాతాళ భైరవి|పాతాళభైరవి]]తో బాటు విజయావారి తర్వాతి చిత్రాలైన పెళ్లిచేసిచూడు, [[చంద్రహారం]] లలో నటించాడు. అదే సమయంలో గుబ్బి ప్రొడక్షన్స్ శ్రీకాళహస్తి మహాత్మ్యం లో కాశి వేషం వేశాడు. 1954లో వచ్చిన సతి అనసూయతో మొదలుపెట్టి [[కృష్ణప్రేమ]],[[సతీ సుకన్య]], [[కృష్ణలీలలు (1959)|కృష్ణలీలలు]], [[శ్రీరామకథ]], [[సతీ తులసి (1959 సినిమా)|సతీ తులసి]], [[ప్రమీలార్జునీయం]] లలో నారదుడిగా వేశాడు.
 
===నిర్మాతగా===
"https://te.wikipedia.org/wiki/బి._పద్మనాభం" నుండి వెలికితీశారు