వల్లూరి బాలకృష్ణ
వల్లూరి బాలకృష్ణ తెలుగు సినీ హాస్యనటుడు. తెలుగు సినీ ప్రేక్షకులకు అంజిగాడుగా సుపరిచితుడు.[1]పాతాళభైరవి సినిమాలో ఆయన పోషించిన అంజిగాడు పాత్ర మంచి పేరు తెచ్చింది. ఈయన జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించారు.
వల్లూరి బాలకృష్ణ | |
---|---|
జననం | 1925 |
ఇతర పేర్లు | అంజిగాడు |
వృత్తి | నటుడు |
వ్యక్తిగత జీవితంసవరించు
బాలకృష్ణ 1925లో జన్మించాడు.[2] నాటకాలలో నటించేందుకు గాను బాలకృష్ణ చదువుసంధ్యలకి మధ్యలో మానేశాడు. సూరిబాబుగారి తారాశశాంకం నాటకంలో హాస్యపాత్లోర నటించాడు. సన్నగా రివటలా ఉండటం మూలాన శరీరాన్ని అష్టవంకర్లతో ఎలా కావాలంటే అలా తిప్పుతూండే వాడు రంగస్థలం మీద. నాటకాల పిచ్చి సినిమాల పిచ్చిగా మారింది. కలకత్తా పారిపోయి చిన్నాచితకా వేషాలు వేస్తూ కాలం గడిపాడు. తారాశశాంకం నాటకం కె.వి.రెడ్డి చూశాడు. బాలకృష్ణ, అతని వెర్రి వికారపు నవ్వు ఆయన్ని ఆకర్షించాయి. ఆ సినిమాలో ఇద్దరూ శత్రువులు అయినను పద్మనాభం, అతనూ గాఢ మిత్రులు. బాలకృష్ణ అన్ని జిల్లాల భాషలూ, మాండలిక పదాలతో సహా మాట్లాగలడు.[ఆధారం చూపాలి]
సినీరంగ ప్రస్థానంసవరించు
విజయదశమి (1937) తో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది . ఈ సినిమాకే కీచకవధ అని ఇంకో పేరుండేది. ఈ సినిమాను కలకత్తాలో తీశారు. మాధవపెద్ది వెంకట్రామయ్య, స్థానం నరసింహారావు వంటి రంగస్థల నటులు నటించారు. సురభి కమలాబాయి ద్రౌపదిగా నటించింది. పాతాళభైరవి (1951) లోని అంజిగాడు పాత్ర మాత్రం పెద్ద పేరు తెచ్చింది. నవగ్రహ పూజామహిమ లో అవకాశవాది అయిన యజమానిని ముప్పుతిప్పలు పెట్టించే పాత్ర కూడా పేరు తెచ్చింది. షావుకారు (1950)లో కూడా బాలకృష్ణ ఒకటి రెండుచోట్ల కనిపిస్తాడు. మిస్సమ్మ (1955)లో నోరు విప్పకుండా నవ్వించిన వేషం అతనిది. విఠలాచార్య సినిమాలో చాలా వాటిలో తప్పనిసరి.
పాతాళభైరవి చిత్రంలో బాలకృష్ణ (అంజిగాడు) నటన రాజబాబుని ఎంతో ప్రభావితం చేసింది. ఆ సినిమాని రాజబాబు ఓ తొంభై సార్లు చూశాడు. చూసిన ప్రతిసారీ హాస్యనటుడు కావాలనే కోరిక బలపడేది. అందుకే తను హాస్యనటుడిగా స్థిరపడిన తరువాత ఓ పుట్టిన రోజున బాలకృష్ణను సన్మానించి తన కృతజ్ఙతలు వెల్లడించాడు రాజబాబు.[3]
కుటుంబంసవరించు
అతనికి ఏడుగురు ఆడపిల్లలు. ఓ చిన్న ఇల్లూ, ఓ చిన్నకారూ వుండేవి.[ఆధారం చూపాలి]
చిత్ర సమాహారంసవరించు
బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలు మరియు పాత్రలు.
- విజయదశమి (1937 సినిమా) (1937) :
- పాతాళ భైరవి (1951) : అంజి
- మాయాబజార్
- ప్రతిజ్ఞాపాలన
- అగ్గిబరాటా
- లక్ష్మీకటాక్షం
- గురువుని మించిన శిష్యుడు
- అగ్గి వీరుడు
- పిడుగు రాముడు
- జ్వాలాద్వీప రహస్యం
- సువర్ణ సుందరి
- గులేబకావళి కథ
- కనకదుర్గ పూజా మహిమ
- నవగ్రహ పూజా మహిమ
- కలిసి ఉంటే కలదు సుఖం
- మదనకామరాజు కథ
- బొబ్బిలి యుద్ధం
- మర్మయోగి
- పరమానంద శిష్యుల కథ
- మిస్సమ్మ (1955) : డిటెక్టివ్ నాగేశ్వరరావు వద్ద అసిస్టెంట్
- గుండమ్మ కథ
- శ్రీ గౌరీ మహత్యం (1956)
- భలే అమ్మాయిలు (1957)
- ముందడుగు (1958)
- అప్పుచేసి పప్పుకూడు (1959) : అవతారం
- భట్టి విక్రమార్క (1960) : మాంత్రికుని శిష్యుడు
- శ్రీకృష్ణ తులాభారం
- శ్రీకృష్ణ సత్య
- శ్రీకృష్ణ విజయం
- దేవత
- జరిగిన కథ (1969)
- దత్తపుత్రుడు (1972)
- చిట్టి చెల్లెలు
- మదన మంజరి (1980)
వనరులుసవరించు
- ↑ వైట్ల, కిషోర్ కుమార్. అభినందన మందారమాల స్వర్ణయుగంలో నటరత్నాలు. హైదరాబాదు: నవోదయ. p. 138. Retrieved 26 February 2019.
- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ సంపాదకులు.). గోటేటి బుక్స్. p. 86.
- ↑ Yagnamurthy. "ప్రత్యేక వ్యాసం: హాస్యానికి 'రాజ'బాబు". yagnamurthy.blogspot.in. Yagnamurthy. Retrieved 20 July 2016.