యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు

యుద్ద కాండ సర్గ 16 శ్లోకం 10
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: రాముడురాముడు
పంక్తి 3:
 
[[సుందర కాండ]]లో [[హనుమంతుడు]] [[సీత]] జాడ తెలిసికొని [[రాముడు|రామునికి]] చెప్పిన ఘట్టం తరువాత యుద్ధకాండ మొదలవుతుంది. ఇందులో ప్రధాన ఘట్టాలు - రాముడు హనుమంతుని ఆలింగనము చేసుకొనుట, వానర భల్లూక సేనలతో రామలక్ష్మణులు యుద్ధానికి సన్నద్ధులగుట, సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము.
[[Image:Battle at Lanka, Ramayana, Udaipur, 1649-53.jpg|right|thumb|400px|లంకలో యుద్ధం - 1650 కాలంనాటి చిత్రం - (ఉదయపూర్‌) ]]
==సంక్షిప్త కథ==
[[హనుమంతుడు]] సీతాన్వేషణానంతరం "చూశాను సీతను" అని తన సాగర లంఘనం, లంకా ప్రవేశం, సీతాన్వేషణ, సీతను ఓదార్చుట, రావణునితో సంభాషించుట, లంకను దహనం చేయుట గురించి రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వివరించాడు. ఒక్క నెల లోపు రాముని చూడకున్న తాను బ్రతుకనని సీత చెప్పినదన్నాడు.
పంక్తి 9:
===యుద్ధానికి సిద్ధం===
 
[[హనుమంతుడు]] చేసిన మహోపకారానికి [[రామావతారము|రాముడు]] "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొన్నాడు. విచారిస్తున్న రాముని [[సుగ్రీవుడు]] ధైర్యం చెప్పి ఓదార్చాడు. రాముని జయం తప్పదన్నాడు. హనుమంతుడు లంకా నగరం రక్షణా వ్వవస్థను విశదంగా తెలిపాడు. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు.
 
సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన కోలాహలంగా [[దక్షిణము]]నకు పయనమైంది. రాముని ఆజ్ఞపై ఆ వానర సేన జనావాసాలమీద పడకుండా అడవులు, కొండలు, గుట్టలు, నదులు, సరస్సుల మీదుగా నడచింది. రాముని ఆజ్ఞలో నడచిన ఆ సేనకు నీలుడు సేనా నాయకుడు. సుగ్రీవుడు పాలకుడు. హనుమంతుని భుజాలపైన రాముడు, అంగదుని భుజాలపైన [[లక్ష్మణుడు]] అధిరోహించారు. [[జాంబవంతుడు]], సుషేణుడు, వేగదర్శి, శతబలి, కేసరి, పనసుడు, గజుడు, అర్కుడు, వలీముఖుడు, ప్రజంఘుడు, జంభుడు, రభసుడు వంటి ఎందరో మహా వీరులు ఆ వానర భల్లూక సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. రామకార్యం సాధించడానికి విక్రమోజ్వలులై ఉల్లాసంగా సాగరతీరము చేరుకొన్న ఆ సేన మరొక సాగరంలా ఉంది. వానర వీరులు ఒక చోట, గోలాంగూల వీరులు ఒకచోట, భల్లూకవీరులు మరొక చోట - ఇలా మూడు భాగాలుగా విడిది చేశారు.
పంక్తి 81:
 
;ప్రహస్తుడు
[[Image:Nila-Ramayana(Bali-1880).jpg|ఎడమ|thumb|150px|వానర సేనాధిపతి నీలుడు ("బాలి" ద్వీపంలో చిత్రం) ]]
ఇప్పుడేమి చేయాలని రావణుడు ప్రహస్తుని అడిగాడు. ప్రహస్తుడు రావణుని సేనానాయకుడు. శస్త్రాస్త్రవేది. మహావీరుడు. అంతకుముందు మంత్రాంగ సమయంలో సీతను ఇచ్చివేయడమే క్షేమమని హితవు చెప్పినవాడు. రావణుని ఆదరానికి బదులు తీర్చుకోవడమే తన బ్రతుకుకు లక్ష్యమని చెప్పి, ప్రహస్తుడు హోమాదికాలు పూర్తి చేసుకొని, సర్ప ధ్వజంతో కూడిన గొప్ప రథం పూన్చి, శత్రుభీకరమైన మహోన్నత సేనను సమకూర్చుకొని తూర్పు ద్వారంవైపు యుద్ధానికి బయలుదేరాడు. అతనివెంట నరాంతకుడు, కుంభహనువు, మహానాధుడు, సమున్నతుడు అనే సమర్ధులైన అనుచరులున్నారు. రాక్షస వానర వీరులు జబ్బలు చరిచి యుద్ధానికి తలపడ్డారు. ఇరుపక్షాల సింహనాదాలు, రోదనలతో నింగీ నేలా దద్దరిల్లాయి.
 
పంక్తి 101:
రావణుడు కుంభకర్ణుడికి జరిగిన విషయం వివరించాడు. అనాలోచితంగా రావణుడు చేసిన చెడ్డపనులను సోదర ప్రేమతో నిందించాడు కుంభకర్ణుడు. కపటంతో సీతను మోసపుచ్చాలన్న మహోదరుని సూచన కూడా కుంభకర్ణునికి రుచించలేదు. తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, అగ్నిలా వెలిగిపోతూ, కాలపాశ సదృశమైన పరిఘను పట్టుకొని, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు. ఆరు వందల ధనువుల యెత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. ధైర్యం చెప్పి వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.
 
[[బొమ్మ:Kumbhakarna in war.jpg|thumb|రామాయణ యుద్ధములో కుంభకర్ణునిపై బాణాలు ఎక్కుపెట్టిన రామలక్ష్మణులు (బాలాసాహెబ్ పండిత్ పంత్ ప్రతినిధి చిత్రం, 1916) ]]
కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. అంగదుడు, ఋషభుడు, శరభుడు, మైందుడు, నీలుడు వంటివారు విసిరిన కొండలు కుంభకర్ణుని వంటికి తగిలి పొడి అయిపోయాయి. వందలాది వానరులను వాడు కరకర నమిలి మ్రింగ సాగాడు. హనుమంతుని దెబ్బకు కుంభకర్ణుడు రక్తం కక్కాడు. కుంభకర్ణుడి శూలం పోటుకు హనుమంతుడు రక్తం కక్కాడు. ఆ రాక్షసునికి ఎదురు పడిన అంగదాది వీరులు వాడి విదిలింపులకే సృహ తప్పి పడిపోయారు. సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని తన మోకాటికి అడ్డంగా పెట్టుకొని విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు విసిరిన పర్వత శిఖరం తగిలి సుగ్రీవుడు తెలివి తప్పాడు. మూర్ఛపోయిన సుగ్రీవుడిని పట్టుకొని లంకవైపు వెళ్ళాడు కుంభకర్ణుడు. తెలివి తెచ్చుకొన్న సుగ్రీవుడు ఒక్కసారి విదిలించుకొని, రాక్షసుని ముక్కు, చెవులు కొరికివేసి ఒక్కగెంతులో వానర సైన్యం మధ్యకు వచ్చిపడ్డాడు.
 
పంక్తి 258:
* సుందర కాడంము, పారాయణ గ్రంథం - రచన: శ్రీమాన్ ఎస్.టి.పి.వి.కోనప్పాచార్యులు - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2002)
* ఉషశ్రీ రామాయణం – రచన: [[ఉషశ్రీ]] - ప్రచురణ: శ్రీ మహాలక్ష్మీ బుక్ కార్పొరేషన్, విజయవాడ (2005)
* శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము (శ్లోకములు, తాత్పర్యములు) - అనువాదకులు: డాక్టర్ ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వేంకటరామయ్య - ప్రచురణ: గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ (2003)
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/యుద్ధకాండ" నుండి వెలికితీశారు