వెల్లెస్లీ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, typos fixed: జూన్ 1815 → 1815 జూన్ (5), లో → లో (3)
పంక్తి 46:
 
==జీవిత ముఖ్యాంశాలు==
వెల్లెస్లీ తండ్రి, గారెట్టు వెల్లెస్లీ (Garret Wesley) మార్నింగటన్ ఎర్ల్ అను [[ఐర్లాండు]] హోదా గల మొదటి ప్రభువు ( 1st Earl of Mornington) అగుటచే మార్నింగటన్ వెల్లస్లీ అని కూడా అంటారు. ఇంటి పేరు మొదట వెస్లీ (WESLEY) అనియుండినది తరువాత వెల్లెస్లీ (WELLESLEY) అని వాడుకలోకి వచ్చింది. వెల్లెస్లీ సోదరుడు,[[ఆర్ధర్ వెల్లెస్లీ]], [[వెల్లింగటన్]] అను చిన్న బ్రిటిష్ వలసరాజ్యమునకు సింహాసనవారసుడైన డ్యూక్ (Duke of Wellington) అనబడు హోదాకలవాడు. అందుచే వెల్లింగటన్ వెల్లెస్లీ (Wellington Wellesley) అని కూడా ప్రసిధ్దిెచెందిన ఆర్ధర్ వెల్లెస్లీ ఫ్రాన్సుదేశ యుధ్దవీరుడైన [[నెపోలియన్]]ను [[బెల్జియమ్]] లోని [[వాటర్లూ]] ( జూన్ 1815 జూన్)లో ఓడించిన ప్రగతి గలవాడు, తరువాత బ్రిటన్ దేశానికి [[ప్రధానమంత్రి|ప్రధాన మంత్రి]]గా నియమింప బడినాడు (జనేవరి 1828). [[గవర్నర్ జనరల్]]గా చేసిన మన రిచార్డు వెల్లెస్లీ 1760 జూన్ 20 తేదీన [[ఐర్లాండు]]లో జన్మించెను. విస్కౌంటు (Viscount) అను రాజవంశ హోదాతో పిలువబడియున్నాడు. విస్కౌంటు అను రాజవంశీయ హోదా బరాన్ (BARON) కన్నా పైన ఎరల్ (EARL) కన్నా తక్కువ హోదా) . [[ఇంగ్లండ్]] (England) లోని ఈటన్ కాలేజీలోను, ఆక్సఫొర్డు లోనూ చదువుకున్న తరువాత 1781 లో తండ్రి మరణానంతరం ఐర్లాండు పార్లంమెంటు (ఐర్లాండు హౌస్ ఆఫ్ లార్డ్సు)లో సభ్యుడైనా తరువాత మార్నింగటన్ అను హోదాకలిగినది. 1784 లో ఇంగ్లీషు పార్లమెంటు (హౌస్ ఆప్ కామన్సు) సభ్యుడైయ్యెను. ఐర్లాండు పార్లమెంటులోనున్నంతకాలం 1797 దాకా మార్నింగటన్ అను హోదాకలిగియున్నాడు. [[విలియం పిట్టు]] [[బ్రిటిష్]] ప్రధానమంత్రిగా యున్న కార్యకాలం (1783-1801)లో ఆర్థిక విభాగమునకు అధిపతిగానైయ్యెను. 1793లో బ్రిటిన్ రాజుయొక్క మంత్రాలోచన సభలో ([[ప్రీవీకౌన్సిల్లో]] (Privy Council) సభ్యుడుగనూ, [[ఇండియా వ్యవహారాల బోర్డు]] (India Board of Control) లో కమీషనర్ గనూ నియమింపబడెను. 1794 లో రోల్లండుతో వివాహం. 1797లో బ్రిటిష్ ఈస్టు డియా కంపెనీకి గవర్నర జనరల్ గా నియమింపబడెను. 1797 లో మార్క్విస్ (MARQUESS) అను హోదా ఇవ్వబడింది. వెల్లెస్లీ గవర్నర్ జనరల్ కార్యకాలంలో కంపెనీ డైరెక్టర్ల కూటమి (కోర్టు ఆఫ్ డైరెక్టర్లు) (Court of Directors) అభిమతాలు అనుసరించక వారితో విభేదములు కలిగి రెండుమూడు సార్లు పదవీ విరమణకు ముందుకువచ్చాడు. అంతేకాక, అప్పటిలో ఫ్రెంచివారితో జరుగుచున్న విభేదముల విషయములో బ్రిటిష ప్రభుత్వమువారిచ్చిన ఉత్తర్వులును కూడా త్రోసిపుచ్చాడు. దాంతో 1805 లో కంపెనీ పైఅధికారులు వెల్లస్లీదొరను వెనక్కి పిలిపించారు. అంతేకాక ఫార్లమెంటులో ఆరోపణాభియోగము (ఇంపీచ్మెంటుImpeachment) ప్రవేశపెట్తారన్న పరిస్థితి కలిగినది. 1809 లో [[స్పైన్]] దేశానికి బ్రిటిష్ రాజదూత (Ambassador)గా నియమింపబడినాడు. 1809 లో బ్రిటిష్ ప్రధానమంత్రి గానున్న స్పెంసర్ పెర్సెవల్ (SPENCER PERCEVAL) మంత్రిపరిషత్తులో విధేశ వ్యవహారాల మంత్రిగానియమింపబడెను. కానీ ఆ పదవీ బాధ్యతలు నడుపుచున్న కాలమందు కూడా చాలా విభేదములకు గురై 1812 లో విరమణ చేశాడు. ఐర్లాండులోని [[రోమన్ కాతలిక్]] (Roman Catholic) [[క్రైస్తవ మతస్తుల]]కు రాజకీయ హక్కులు కల్పించాలని సంకల్పముకలవాడగుటచే అక్కడి రాజకీయనాయకులతో విభేదముకలిగినది. 1812 మేనెలలో ప్రధానమంత్రి పెరసెవల్ హత్యచేయబడిన తరువాత అప్పటిలో [[బ్రిటిష్ యువరాజు]] (Prince Regent)గానున్న జార్జి ప్రేరణపై వెల్లెస్లీ దొర ప్రధానమంత్రి పదవికిపోటీచేశాడు గానీ గెలుపొందలేదు. తరువాత 1821 లో ఐర్లాండుకు వైసరాయిగా నియమింపడ్డాడు. ఆ కార్యకాలంలో ఐర్లండులోని రోమన్ కాతలిక్ క్రైస్తవ మతస్తుల పక్షంనిలచి వారికి రాజకీయంగాహక్కులకోసం ప్రయత్నించుటవలన అప్పటికి రాజుగా నున్న [[నాలుగవ జార్జి]] (King George IV) అప్రసన్నుడైనందున పదవినుండి తొలగింపబడే పరిస్థితిలో వెల్లెస్లీ సోదరుడైన [[ఆర్ధర్ వెల్లెస్లీ]] ( వెల్లింగటన్ డ్యూక్) బ్రిటిష్ ప్రధానమంత్రిగా నియమింపబడినాడు. వెల్లింగటన్ వెల్లెస్లీ కూడా ఆ విషయములో భిన్నాభిప్రాయుడైనందున మన రిచార్డు వెల్లెస్లీ దొర [[ఐర్లాండు]] వైసరాయిగా పదవీ విరమణచేశాడు. తరువాత భ్రిటన్ దేశములో విఘ్ ( Whig) రాజకీయ పార్టీవారు 1835 లో అధికారములోకి వచ్చిన పిదప వెల్లెస్లీని మరి ఐర్లాండుకు పంపుటకు నిరాకరించబడినందున వెల్లెస్లీ తీవ్ర వైషమ్యుతో ఆశాభంగము వెలిబుచ్చి చివరకు 1842 సెప్టెంబరు 26తేదీన మరణించెను.<ref name=" Emcyclopedia (1929)">Ecyclopaedia Britannica 14th Edition (1929)Volume 23, pp497-498</ref>,<ref name= "Micropedia (1984)">Ecyclopaedia Britannica Micropedia 15th Edition (1984)Volume III, pp 608-609</ref>
 
==వెల్లెస్లీ అభిమతాలు రాజ్యతంత్రముల సమీక్ష==
పంక్తి 64:
 
====మహారాష్ట్రరాజ్య కూటమి విచ్చినం, యుద్దములు ====
వలస రాజ్య విస్తరణకు, బ్రిటిష్ వారి ఏకఛత్రాధిపత్యమునకు వెల్లెస్లీ గవర్నర్ జనరల్ గా చేసిన కుతంత్రములు పీష్వా పరిపాలించు మహారాష్ట్ర రాజ్యము అంతరించుటకు అంకురార్పణముచేయటమేకాక స్వతంత్రరాజులు పరిపాలించు మహారాష్ట్రరాజ్యముల మధ్య విభేదముల కలిపించి సమ్మిళితమహారాష్ట్ర రాజ్య కూటమిని (confederation) విచ్చినముచేసినవి . బ్రిటిష్ వారు చేసిన ఏడెండ్ల మొదటి మహారాష్ట్రయుద్దము (1775 1782) ఫలితముగా బ్రిటిష్ కంపెనీ వారికి మహారాష్ట్రరాజ్యము పూర్తిగా వశము కాలేదు. మొదటి మహారాష్ట్రయుద్దము 1782 లో [[సల్బై సంధి]]తో ముగిసినది. అటుతరువాత, 8 ఏండ్ల బాలుడైన సవాయి మాధవరావు (మాధవరావుII) పీష్వాగా నియమించబడి నానాఫడ్నవీసు (నానా ఫడ్నీసు) అను మంత్రి పరిపాలన చేయసాగెను. ఆ సల్బై సంధి ప్రకారము మహారాష్ట్ర రాజ్యములో బ్రిటిష ఈస్టు ఇండియా కంపెనీ వారికి కేవలమూ [[సలసెట్టీ]] ద్వీపం (island) మాత్రం మిగిలినది. మొదటినుండి కూడా దేశములోనున్న నాలుగు మహారాష్టరాజ్యముల మధ్య విభేదములువచ్చినప్పటికీ బయటవారితో యుద్దము తటస్థించినచో మహారాష్ట్రు లందరూ ఏకమై కూటమిగా పోరాడుచుండిరి. 1782 సల్బై సంధి తరువాత నుండి 1802 దాకా జరిగిన ఘటనలు (1) మహారాష్ట్రకూటమిలో మహాయోధుడుగా పేరుపోందిన [[మాహదజీ సిందియా]] మొగల్ రాజధాని ఢిల్లీని రక్షిణ చేయు మొగల్ సైనికాధికారి మీర్జా నజఫ్ ఖాన్ ఏప్రిల్1782 1782లోఏప్రిల్లో మరణించటంతో సిందియాను [[వకీల్ ఉల్ ముతలాగ్]] అను హోదాలో ఢిల్లీ పరగణాలను రక్షించుటకు ఢిల్లీ చక్రవర్తి కొలువులో నియమించబడ్డాడు. రాజపుత్రయోధులతో తలపడి యుధ్ధములుచేసి వారి రాజ్యములైన [[జోధ్ పూర్]], [[జయపూర్]], [[అజ్మీర్]]ను ముట్టడించి ఆక్రమించాడు (పటాన్, మెడ్తియా యుద్దములలో), కానీ 1787 లో [[రాజస్తాన్]] లోని [[దౌసా జిల్లా]]లో [[లాల్సట్]] (Lalsot) యుద్దములో రాజపుత్రుల చేతులలో ఓటమికి పాల్పడినా మొత్తానికి ఢిల్లీలో మహారాష్ట్రుల ఆదిపత్యము స్థాపించాడు. (2)1795 లో ఖర్దా యుద్దములో హైదరాబాదునిజాముతో యుద్దము చేసి మహారాష్ట్ర రాజ్యాదిపత్యమును దక్కన్ పీఠభూములలో చాటించాడు. ఫిబ్రవరి 1794 లోఫిబ్రవరిలో మహాదజీ సింధియా మరణం, (3) పీష్వా సవాయి మాధవరావు (మాధవరావుII) 1795 లో ఆత్మహత్యచేసుకుని మరణించటం (4) బాజీరావుII (రఘునాదరావు కుమారుడు) 1795 లో పీష్వాగా నియమించబడటం (5) మంత్రి నానాపడ్నవీసు 1800 మార్చిలో మరణం (6) బాజీరావు II పరిపాలన అభిమతములకు వ్యతిరేకించి మహారాష్ట్రరాజ్య కూటమిలోని ఇందౌరు రాజు యశ్వంతరావు హోల్కరు పూనాపై యుద్దము ప్రకటించాడు. పీష్వాబాజీరావు పక్షమున దౌలతరావు సిందియా చేరి హోల్కరులతో చేసిన యుద్దము పూనా యుద్దము మే 1802 లోమేలో జరిగింది (7) పూనా యుద్దములో ఓడిపోయిన పీష్వా బాజీరావు II పారిపోవటంతో పూనాలో ఆనందరావును హోల్కర్ పీష్వాగా నియమించాడు. (8) పూనా యుద్దములో ఓడిపోయిన పీష్వా బాజీరావు II అక్టోబరు 1802 లోఅక్టోబరులో బస్సీనుకు చేరుకుని బ్రిటిష్ కంపెనీవారితో రాయబారంచేసి శరణు కోరటం జరిగింది.
అటువంటి అవకాశములే బ్రిటిష్ వారికి వరప్రసాదములైనందువలన గవర్నర్ జనరల్ వెల్లెస్లీ మామూలు సంధి వప్పందము కాక తన అభిమతానుసారము, బ్రిటిష్ కంపెనీవారి వలసరాజ్యవిస్తరణ లక్ష్యములను సాధించుటకు తయారుచేయబడిన అనుబంద సమాశ్రయ వప్పందము ( subsidiary alliance)ను బాజీరావు II చేత 1802 డిసెంబరు 31 తేదీన వ్రాయించి పుచ్చుకున్నాడు.అదే [[బెస్సీను సంధి]]. దాంతో మహారాష్ట్ర రాజ్యపతనారంభమని చెప్పవచ్చును. ఆ 1802 బస్సీను సంధి ప్రకారము (1) బ్రిటిష్ వారికి మితులు, శత్రువులైన వారలను బాజీరావు కూడా అలాగే పరిగణించ వలసియుండును (2) బ్రిటిష కంపెనీ వారు బాజీరావు రాజ్యమును తమరాజ్యముగనే రక్షింతురు (3) బ్రిటిష్ సైన్యమును బాజీరావు తన రాజ్యములో శాశ్వతముగా వుంచుకునవలసియుండును. బాజీరావు చేసిన ఆ సంధి మహారాష్టకూటమి వారు అసమ్మతితో ఖండించిరి. కానీ బ్రిటిష్ కంపెనీ గవర్నర్ జనరల్ వెల్లెస్లీ అతనినే తిరిగి పీష్వాగా చేయుటకు సంధి ప్రకారమూ కట్టుబడి యున్నందున్న రాజ్యంతంత్రములే కాక సరాసరి యుద్దము నకు దిగారు. తత్ఫలితముగా మహారాష్ట్రరాజ్యములలో బ్రిటిష్ వారు జరిపిన యుద్దములు, రాజ్య తంత్రములు కేవలం వెల్లెస్లీ దొర రాజ్యకాంక్షనెరవేర్చుటకు జరిపినవే. అనవసరపు ఆధిక్యతానిరూపణకోసము చేసిన కార్యాచరణములు. మహారాష్ట్ర రాజ్యకూటమిలో గ్వాలియర్ రాజు దౌలత్ రావు సింధియా ఎవరైతే అప్పటిదాకా బాజీరావు పక్షముననిలిచి మదత్తునిచ్చెనో ఆ రాజ్యమును ముందుగా కూలద్రోయుటకు ఆ రాజ్యములో నున్న ఫ్రెంచి సైన్యాధికారులకు లంచములిచ్చి సైనిక సహాయముచేయకుండా చేసుకున్నారు. వెల్లేస్లీ తన సైనికాదికారులకు, రెసిడెంట్లకు వ్రాసిన లేఖలు"Dispatches, Minutes, and Correspondence of Marquess Wellesley K.G " అను పత్రాచారముల ద్వారా ఆ కుతంత్రములు చరిత్రలోకి వచ్చినవి.<ref name ="D.V.Siva Rao(1938)"/>
 
"https://te.wikipedia.org/wiki/వెల్లెస్లీ" నుండి వెలికితీశారు