పైలెట్ రోహిత్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
==విద్యాభాస్యం==
రోహిత్‌రెడ్డి హైదరాబాద్ లోని సెయింట్ పాల్స్ హై స్కూల్లో 2001లో పదవ తరగతి పూర్తి చేశాడు. నారాయణగూడ లోని టెట్రాహెడ్రోన్ జూనియర్ కాలేజీ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. స్వీడన్‌లోని బీటీహెచ్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ ఇన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. స్వీడన్‌కు ఇతర దేశాల నుంచి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు ఆయన కొన్నాళ్ళు కోఆర్డినేటర్‌గా పని చేశాడు. పైలెట్‌ కావాలన్నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక మేరకు రోహిత్ రెడ్డి అమెరికాలోని కాలిఫోర్నియాలో పైలెట్‌ కోర్సులో చేరాడు. ఆయన అక్కడ ఏడు నెలల పాటు పైలెట్‌ శిక్షణ పొందాడు. శిక్షణ పూర్తికాగానే ఆరు నెలల పాటు అక్కడే పైలెట్‌గా పనిచేశాడు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చాడు.<ref name="అప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక..">{{cite news |last1=Sakshi |first1=హోం » పాలిటిక్స్ |title=అప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక.. |url=https://www.sakshi.com/news/politics/pilot-rohit-reddy-life-exclusive-interview-1188708 |accessdate=15 April 2021 |date=12 May 2019 |archiveurl=http://web.archive.org/web/20190512120642/https://www.sakshi.com/news/politics/pilot-rohit-reddy-life-exclusive-interview-1188708 |archivedate=15 April 2021 |language=te}}</ref>
 
==రాజకీయ జీవితం==
పంజుగుల రోహిత్‌రెడ్డి 2009లో ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలోకి అడుగు పెట్టాడు. ఆయనను ప్రజా రాజ్యం పార్టీ తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ​ఇంచార్జ్ గా నియమించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు. 2013లో పీఆర్పీ కి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.
 
==మూలాలు==