మహాకవి డైరీలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పుస్తక మొలక మూస తొలగింపు
పంక్తి 5:
 
== ముందుమాటలో... ==
ఈ పుస్తకం ముందు మాటలో "ముదిగొండ సూర్యారావు" డైరీ విశిష్టతను తెలిపారు. [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]]<nowiki/>లో, [[ముత్యాలసరాలు]] లో ఆణిముత్యాల కథలలో మహాకవి గురజాడతో మనకు ఏర్పడిన ఆత్మ బాంధవ్యమూ, చనువూ, "మహాకవి డైరీలు" చదివిన వెంటనే ఒకింతకు పదింతలవుతాయని రాసాడు. ఈ డైరీలు గురజాడ ఆత్మ ప్రచోదనార్థము, పరిశీలనార్థము రాసుకున్నవి కనుక ఈ సంపుటి మహాకవి జీవితమునకు "రేఖాపటము" వంటిదని తెలియజేసారు.
 
గురజాడ జీవిత రేఖాపటము స్థూలంగా రెండు విభాగములుగా ఉంది. మొదటిది విద్యార్థి దశ అనంతరం 1887 నుండి 1896 జూన్ 5 వరకూ గల తొమ్మిదేళ్ల కాలము ప్రధమ పాదం. తదనంతరం 1915 వరకూ గల కాలం ద్వితీయ పాదం. మహాకవిగా, విమర్శకునిగా, ఆధునిక ఆంధ్ర వాజ్ఞ్మయ యుగ పురుషునిగా, తత్త్వవేత్తగా పరిణతి చెందిన రెండవ దశ మొదటి దశకు నాంది. ఈ ప్రథమ పాదంలో అత్యంత ప్రధానమైనవి 1895వ సంవత్సరం డైరీలు. మహాకవి ఆత్మ తేజస్సు అనేక విషయాలలోనికి ప్రసరించిద్మి. నాటకములు, సభలు, సమావేశాలు, సాహిత్యం, కళలు, తర్క వితర్కములు, ఉపన్యాసములు, సూక్ష్మాతి సూక్ష్మ శీలపరిశీలనలు, విద్యాగోష్టులు, కళాశాలలు, విద్యా విధానము, శాసనములు, చిత్తరువులు, గాన కచేరీలు అన్నింటా అతని దృష్టి మరలినట్లు తెలుస్తుంది. <ref>{{Cite book|url=http://archive.org/details/in.ernet.dli.2015.371320|title=మహాకవి డైరీలు|last=గురజాడ అప్పారావు|date=1954}}</ref>
పంక్తి 17:
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
[[వర్గం:1954 పుస్తకాలు]]
 
{{మొలక-పుస్తకాలు}}
"https://te.wikipedia.org/wiki/మహాకవి_డైరీలు" నుండి వెలికితీశారు