వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
జీవిత లో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం. పుట్టి, పెరిగి, బాధ్యతలు మోస్తూ చివరి దశకు చేరుకుంటారు. కుమారులు, కూతుళ్లను పెంచి పోషించి, విద్యా బుద్దులు చెప్పించి ప్రయోజకులను చేసి, ఆస్తి పాస్తులను సమకూర్చి, పెళ్లిల్లు చేసి ఓ బాట చూపించి.చివరి దశలో మనవళ్లు, మనవరాళ్లతో కబుర్లు చెబుతూ ఆడుతూ పాడుతూ గడిపే సమయం ఇది. ఆ వయసులోనూ వారి ఆలోచనలు వారసుల గురించే. వారికి ఏ కష్టం రాకూడదని, జీవితాంతం హాయిగా ఉండాలని పరితపిస్తుంటారు. ఆ దశలో తమె కొడుకులు ఏదేని వక్ర మార్గం అనుసరిస్తుంటే వారిని మంచి దారిలో పెట్టే ప్రయత్నంలో కొన్ని సలహాలు, సూచనలు చేస్తుంటారు. చాలా మందికి వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రుల సలహాలు నచ్చవు. వారిని ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఒక వస్తువులా భావిస్తుంటారు. ఇది వృద్ధులకు శాపం లాంటిది. పిల్లలు తమను పలకరించాలని, తమతో కొంత సమయం గడపాలని వృద్ధులు కోరుకుంటారు. కానీ మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం వారిని తెరచాటుకు నెట్టేస్తున్నాయి. వారి త్యాగాలపై నిర్మించుకున్న జీవితాల్లో వారికే చోటు దొరకడం లేదు. ఒక్కపూట అన్నం పెట్టలేక, ఆలనా పాలన చూడలేక కొందరిని రోడ్డు మీద వదిలేస్తుంటే, మరి కొందరు వృద్దాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 21ని ‘జాతీయ వృద్ధుల దినోత్సవం’గా ప్రకటించింది. 2007లో తల్లిదండ్రులు, పెద్దల పోషణకు సంక్షేమ చట్టం కూడ చేసింది.
 
==వృద్ధుల కోసం చట్టాలు/ సంక్షేమ పథకాలు / చట్టాలు ==.
 
==ప్రభుత్వ సంక్షేమ పథకాలు==..:
 
1. వృద్ధాప్య పింఛను పథకం: 60 ఏళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ.2,250 పింఛన్‌ లభిస్తుంది.
2. ఆర్టీసీ బస్సు: బస్సుల్లో రెండు సీట్లు వృద్ధులకు కేటాయిస్తున్నారు. ఆధార్‌ కార్డు చూపితే చార్జీలో కొంత రాయితీ ఇస్తారు.
Line 14 ⟶ 15:
4. ఆసరా: 60 ఏళ్లు దాటిన వారికి కార్పొరేట్‌, ప్రైవేటు వైద్యశాలల్లో 50 శాతం రాయితీతో వైద్య సేవలు పొందే అవకాశం ఉంది.
5. ఆదాయపు పన్ను రాయితీ: ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 80 సి ప్రకారం రూ.3 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను రాయితీ ఉంటుంది.
 
==చట్టాలు==
వృద్ధుల సంరక్షణకు 2007లో ప్రభుత్వం తల్లిదండ్రుల సంక్షేమం, సంరక్షణ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం వృద్ధుల సంరక్షణను పిల్లలు విస్మరిస్తే వారి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. నిరాదరణకు గురైన వయో వృద్దుల గురించి ఎవరైనా పిర్యాదులు చేయ వచ్చు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి. వయో వృద్దులను వారి పిల్లలు నిర్లక్ష్యం చేసినట్లు రుజువైతే తల్లిదండ్రులకు నెల నెలా భత్యం అందించే ఏర్పాట్లు చేయాలి. కుటుంబ ఆదాయం, సభ్యుల సంఖ్యను బట్టి అత్యధికంగా రూ.10 వేల వరకు భత్యం నిర్ణయించే అధికారం ట్రిబ్యునల్‌కు ఉంది.
 
==భారత దేశంలో కుటుంబ వ్వవస్త==