వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==ఇతర దేశాలలో కుటుంబ వ్వవస్థ==
<ref>http://www.andhrabhoomi.net/content/ee-vaaram-special-3</ref>ఒక అధ్యయనంలో తేలిన విషయమేమంటే .....అమెరికాసహా చాలా దేశాల్లో 56 శాతం యువత ఇంటిపట్టున, కుటుంబంతో కలసి ఉండాలని కోరుకుంటోందని . చిన్నచిన్న మానసిక సమస్యలకు చిటికెలో కుటుంబ సభ్యుల నుంచి పరిష్కారం లభిస్తుందని వారంటున్నారు. కుటుంబంతో కలసి ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని వారంటున్నారు. ఇక దాదాపు అన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లి ప్రేమాభిమానాల కోసం తపించి పోతారట. దాదాపు 63 శాతం మంది పిల్లలు తల్లితో చనువుగా, మనసు విప్పి మాట్లాడాలని అనుకుంటారట. అలాంటి తల్లి ఉద్యోగ బాధ్యతల్లో మునిగి పోతూంటే వీరంతా విలవిలలాడి పోతున్నారు. ఇక 43 శాతం మంది పిల్లలు తండ్రితో చనువుగా, స్నేహంగా ఉండాలనుకుంటున్నారని తేలింది. మిగతా ప్రపంచానికి భిన్నంగా అమెరికాలో కుటుంబ వ్యవస్థ ఎంతో వేగంగా కుప్పకూలుతోంది.. అక్కడ అలా కుటుంబం నుంచి విడిపోయిన వారి (దంపతులు) సంఖ్య 1.8 మిలియన్లు. అక్కడ 67 శాతం మంది పిల్లలు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తోంది. అదృష్టవశాత్తూ భారతదేశ కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అయితే ఇప్పుడిప్పుడే పాశ్చాత్య పోకడలకు కొందరు ఆకర్షితులవు తూండటంతో ఇక్కడి కుటుంబాల్లోనూ కలకలం మొదలవుతోంది.
 
ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా 1996లో ఎన్నడూ లేనంతగా 87.7 శాతం మహిళలకు ఉద్యోగాలు పెరిగాయి. ఇది ఆర్థిక పరంగా శుభసూచకమే అయినా కుటుంబ వ్యవస్థకు ఇది పెద్ద సవాలు విసిరింది. ఇంటిని, కుటుంబ సభ్యులను దగ్గరుండి చూసుకునే ఇల్లాలు ఉద్యోగానికి వెళ్లడంతో వారంతా ఒంటరితనాన్ని భరించాల్సి వస్తోంది. అమెరికాలో ఇది పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. ప్రపంచంలో మహిళలకు ఉద్యోగాల్లో ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్న దేశాల్లో స్కాండినేవియా మొదటిస్థానంలో ఉండగా కెనడా రెండో స్థానంలో ఉంది. అమెరికా మూడోస్థానంలో ఉంది. ఈ రెండు దేశాల్లోకన్నా అమెరికాను ఈ పరిణామం ఎక్కువ కలవరపరుస్తోంది.