గోపిక పూర్ణిమ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 9:
 
== వ్యక్తిగత జీవితం ==
ఆమె [[విజయనగరం]]లో జన్మించింది. [[హైదరాబాదు]]లో పెరిగింది. తండ్రి ఈసీఐఎల్ లో పనిచేసే వాడు. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న [[కుటుంబం]].<ref name=andhrajyothy/> పదో తరగతి చదివేటపుడు [[ఈటీవీ]]లో [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]] మొదటి ఎపిసోడ్ లో పాల్గొనింది. తరువాత [[సంగీతము|సంగీతం]]లో [[శిక్షణ]] కోసం, సినిమాల్లో అవకాశాల కోసం [[చెన్నై]] వెళ్ళింది. పాడుతా తీయగా లో పరిచయమైన మల్లికార్జున్ తరువాత చెన్నైలో తరచు కలుస్తుండటంతో పరిచయం [[ప్రేమ]]గాప్రేమగా మారి కొన్నాళ్ళకు పెళ్ళి చేసుకున్నారు. పాడుతా తీయగా ద్వారా వీరిరువురికీ బాగా పరిచయం, అభిమానం ఉన్న [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]] [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] పర్యటనలో ఉండటం వలన ఈ వివాహానికి హాజరు కాలేకపోయాడు. బాలు సోదరి, గాయని [[ఎస్.పి.శైలజ|ఎస్. పి. శైలజ]], గీత రచయిత [[భువనచంద్ర]], నటుడు [[చంద్రమోహన్]] తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు.<ref name=indiaglitz/> వీరు [[చెన్నై]]లోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ ఉండటం వల్ల వీరికి [[తెలుగు సినిమా|తెలుగు]]లోనే కాక [[తమిళం]], [[కన్నడ]] సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇవే కాకుండా కచేరీలు, ఆధ్యాత్మిక ఆల్బమ్స్ కూడా చేస్తున్నారు.
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/గోపిక_పూర్ణిమ" నుండి వెలికితీశారు