బి.వి.రామానందం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== నిర్మాతగా ==
అతను చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించాలనుకున్నాడు. అతను భారత లక్ష్మీ ఫిలిమ్స్ వారితో కలసి సక్కుబాయి సినిమాను నిర్మించాడు. అది 1935 మే 21న విడుదలైంది. ఈ చిత్రంలో 50 పాటలున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తానే రాధా ఫిలిం కంపెనీ చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పి 1935లో భక్త కుచేల సినిమాను నిర్మించాడు. బళ్లారి పండిక్తులు సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన నాటకం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో భారీ సెట్స్ వేసి చిత్రీకరించాడు. ఈ సినిమా విజయవంతమైంది.
 
1938లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నాటక ఆధారంగా కచ దేవయాని చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు కూడా నిర్వర్తించాడు. ఈ సినిమాకు సంజివని అనే పేరు కూడా ఉంది. కచదేవయాని ఇతివృత్తాన్ని ఆసక్తి కరంగా తెరపై మలచి దర్శకునిగా గుర్తింపు పొందాడు. 1939లో పాడురంగ విఠల్ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం కూడా విజయవంతమైంది.
 
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ సమయంలో అతను చిత్ర నిర్మాణాన్ని తాత్కాలికంగా ఆపుచేసి రాజామండ్రి చేరుకున్నాడు. ఆరేళ్ళ పాటు నిర్మాణం జోలికి పోలేదు. తరువాత మరల వరూధిని సినిమా నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. అతను సేలంలో ఉన్న మోడరన్ థియేటర్స్ స్టుడియోలో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. ఈ సినిమాలో కథానాయకుని పాత్రకోసం తన మేనల్లుడైన ఎస్.వి.రంగారావును ఎంపిక చేసాడు. ఆ చిత్రంలో కృష్ణదేవరాయలు, ప్రవరాఖ్యుడు పాత్రలను ఎస్.వి.రంగారావు పోషించాడు. ఈ సినిమా 1947 జనవరి 11న విడుదలైంది. కానీ విజయవంతం కాలేదు. అతనికి ఆర్థికంగా నష్టం కలిగించింది. దీనితో సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు.
 
== నటునిగా ==
అంతవరకు పౌరాణిక సినిమాలను తీసిన అతను తన పంథాను మార్చుకుని సాంఘిక సినిమాల నిర్మాణంపై దృష్టి సారించాడు. అలా గొల్లపిల్ల సినిమాను తీసాడు. యాదవ కులస్థులు అభ్యంతరం వల్ల ఆ చిత్రానికి పెంకి పిల్ల గా శీర్షికను మార్చారు. ఆ సినిమాకు దర్శకునిగానే కాక అందులో న్యాయమూర్తి పాత్రను పోషించాడు. ఆ సినిమా విజయవంతం కాలేదు.
 
== అస్తమయం ==
అతను 1955లో జై వీర భేతాళ చిత్రాన్ని ప్రారంభించాడు. కానీ ఆ సినిమా పూర్తి కాకుండానే అతని ఆరోగ్యం దెబ్బతినడం మూలంగా 1955 అక్టోబరు 27న మరణించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బి.వి.రామానందం" నుండి వెలికితీశారు