బి.వి.రామానందం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బి.వి.రామానందం (బయ్యపునీడి వెంకట రామానందం) తెలుగు సినిమా దర్శకుడు. ఇతను [[ఎస్.వి. రంగారావు|ఎస్.వి.రంగారావు]]<nowiki/>కు తెలుగు సినిమాకు పరిచయం చేసిన వ్యక్తిగా సుపరిచితుడు. అనేక మంది నటులను సినీ పరిశ్రమకు పరిచియం చేసిన ఇతనిని "ఆంధ్రా శాంతారాం" అని అభివర్ణించేవారు.<ref name=":0">నవ్య వారపత్రిక - జూన్ 4, 2009 - 68, 69 పుటలు : ఆంధ్రా శాంతారాం రామానందం</ref>
 
== జీవిత విశేషాలు ==
బయ్యపునీడి వెంకట రామానందం 1902 జనవరి 2న [[రాజమండ్రి]]<nowiki/>లో జన్మించాడు. చిన్నతనంలో లలిత కళల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఒకపక్క విద్యాభ్యాసం చేస్తుందగానే మరో పక్క నాటకాలలో నటించేవాడు. [[కాశీ|బెనారస్]] లో ఎఫ్.ఏ పరీక్ష ఉత్తీర్ణుడైన తరువాత ఆగస్టు 1922లో వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న సమయంలో మూకీల చిత్ర నిర్మాణం సాగుతుంది. చిన్నతనం నుండి కళా రంగంలో ఆసక్తి ఉండటంతో అతను సినిమా రంగంలోకి ప్రవేశించాడు. మొదట ఫిలిం పంపిణీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. దీని కోసం కలకత్తా వెళ్ళి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి ఫిలిం పంపిణీ వ్యాపారం జరిగే తీరుని పరిశీలించి ఒక అవగాహనకు వచ్చాడు. రాజమండ్రికి వచ్చి "రాధాకృష్ణ ఫిలిం డిస్ట్రిభ్యూషన్" పేరుతో ప్యాపారం ప్రారంభించాడు. అదే సమయంలో కలకత్తా నుండి వచ్చిన [[సి. పుల్లయ్య]] రాజమండ్రిలో ఆంధ్రా సినీటోన్ స్టుడియోను స్వాధీనం చేసుకొని ఆంధ్రా టాకీస్ పతాకంపై [[శ్రీ సత్యనారాయణ]] చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. వాడుక భాషలో రూపుదిద్దుకున్న తొలి చిత్రం ఇది. రామానందం పుల్లయ్య వద్ద సహాయకునిగా చేరాడు. ఆ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేసి అనుభవం సంపాదించుకున్నాడు.<ref name=":0" />
 
== నిర్మాతగా ==
పంక్తి 9:
1938లో [[రవీంద్రనాధ టాగూరు|రవీంద్రనాథ్ ఠాగూర్]] రాసిన నాటక ఆధారంగా [[కచ దేవయాని]] చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు కూడా నిర్వర్తించాడు. ఈ సినిమాకు సంజివని అనే పేరు కూడా ఉంది. కచదేవయాని ఇతివృత్తాన్ని ఆసక్తి కరంగా తెరపై మలచి దర్శకునిగా గుర్తింపు పొందాడు. 1939లో [[పాండురంగ విఠల్|పాడురంగ విఠల]] సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం కూడా విజయవంతమైంది.
 
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ సమయంలో అతను చిత్ర నిర్మాణాన్ని తాత్కాలికంగా ఆపుచేసి రాజామండ్రి చేరుకున్నాడు. ఆరేళ్ళ పాటు నిర్మాణం జోలికి పోలేదు. తరువాత మరల [[వరూధిని (సినిమా)|వరూధిని]] సినిమా నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. అతను సేలంలో ఉన్న మోడరన్ థియేటర్స్ స్టుడియోలో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. ఈ సినిమాలో కథానాయకుని పాత్రకోసం తన మేనల్లుడైన [[ఎస్.వి. రంగారావు|ఎస్.వి.రంగారావు]]<nowiki/>ను ఎంపిక చేసాడు. ఆ చిత్రంలో కృష్ణదేవరాయలు, ప్రవరాఖ్యుడు పాత్రలను ఎస్.వి.రంగారావు పోషించాడు. ఈ సినిమా 1947 జనవరి 11న విడుదలైంది. కానీ విజయవంతం కాలేదు. అతనికి ఆర్థికంగా నష్టం కలిగించింది. దీనితో సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు.<ref>{{Cite web|url=http://telugucinemacharitra.com/%e0%b0%86%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be-%e0%b0%b6%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%82-%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6/|title=ఆంధ్రా శాంతారాం ‘రామానందం’|website=TELUGUCINEMA CHARITRA|language=en-US|access-date=2021-05-22}}</ref>
 
== నటునిగా ==
"https://te.wikipedia.org/wiki/బి.వి.రామానందం" నుండి వెలికితీశారు