వికీపీడియా:విషయ ప్రాముఖ్యత: కూర్పుల మధ్య తేడాలు

పునరుక్తి తొలగింపు
ట్యాగు: 2017 source edit
→‎సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు: +వ్యాసాల్లోని కంటెంటుకు విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వర్తించవు విభాగం
ట్యాగు: 2017 source edit
పంక్తి 21:
 
ఏదైనా విషయం ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేనప్పటికీ, కొన్ని ధృవీకరించదగిన వాస్తవాలను కలిగి ఉంటే, దాని గురించి మరొక వ్యాసంలో రాసే అవకాశం ఉండవచ్చు.
== వ్యాసాల్లోని కంటెంటుకు విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వర్తించవు ==
వ్యాసాన్ని సృష్టించవచ్చా లేదా అనేదానికి వర్తించే ప్రమాణాలు, ఆ వ్యాసం లోని కంటెంటుకు వర్తించే ప్రమాణాలూ ఒకటి కాదు. విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వ్యాసం లోని కంటెంటుకు వర్తించవు (జాబితాల్లో విషయ ప్రమౌఖ్యత ఉన్న అంశాలను చేర్చడాన్ని నిరొధించే మార్గదర్శకాలను మినహాయించి). వ్యాసాల్లో చేర్చే కంటెంటు, కంటెంటు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది.
== విషయ ప్రాముఖ్యత కోసం నిర్ధారించుకోదగ్గ మూలాలు ఆవశ్యకం ==
విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలలో, దండలో దారం లాంటి సాధారణ సూత్రం ఏమిటంటే, వ్యాస విషయానికి స్వతంత్ర వనరులలో గణనీయమైన కవరేజీ వచ్చిందని ధృవీకరించుకోదగిన, వస్తుగతమైన ఆధారాలు ఉండాలి.
 
ఓ విషయం ఉనికిలో ఉన్నంత మాత్రాన, ఆటోమాటిగ్గా దానికి ప్రాముఖ్యత చేకూరినట్లు కాదు: ఆ విషయానికి స్వతంత్ర వనరుల్లో గణనీయమైన కవరేజి లేదా గుర్తింపు లభించిందని చూపించగలగాలి. ఇది ఏదో తాత్కాలిక గుర్తింపు కాకూడదు. ప్రాపగాండా కార్యకలాపాల్లో భాగంగా ఉండకూడదు. విచక్షణారహిత ప్రచారం కాకూడదు. వేరే ఏ ఇతర కారణాల వల్లనైనా అనుచితమైన విషయంగా పరిగణింపబడకూడదు. సాక్ష్యం యొక్క మూలాల్లో గుర్తించబడిన సాటివారి-సమీక్ష జరిగిన గుర్తింపు పొందిన ప్రచురణలు, విశ్వసనీయమైన, సాధికారిత కలిగిన పుస్తకాలు, ప్రశస్తి కలిగిన మీడియా వనరులు తదితర విశ్వసనీయ వనరులు ఆధారాలుగా పనికివస్తాయి.
 
ఏదైనా వ్యాసంలో ఉన్న కంటెంటుకు మూలాలను చూపించనంత మాత్రాన (మూలాలు అసలు ఉనికి లోనే లేకపోవడం కాదు) ఆ వ్యాస విషయానికి ప్రాముఖ్యత లేనట్లు కాదు. విషయ ప్రాముఖ్యతకు కావలసినది విశ్వసనీయమైన, నిర్ధారించుకోదగ్గ, స్వతంత్ర వనరులు ఉనికిలో ఉండడం - అంతేగానీ, వాటిని వ్యాసంలో ఉల్లేఖించారా లేదా అనేది కాదు. వ్యాస విషయ ప్రాముఖ్యతను మదింపు చేసే సంపాదకులు వ్యాసంలో పేర్కొన్న మూలాలను మాత్రమే కాకుండా, వ్యాసంలో ఉల్లేఖించని ప్రాముఖ్యతను-సూచించే మూలాల ఉనికిని కూడా పరిగణించాలి. అందువల్లనే, తొలగింపు కోసం ఒక వ్యాసాన్ని ప్రతిపాదించడానికి ముందుగానీ, తొలగింపు చర్చలో అభిప్రాయాన్ని రాసే ముందుగానీ, సంపాదకులు సదరు విషయపు ప్రాముఖ్యతను నిర్ధారించగల మూలాలను కనుగొనే ప్రయత్నం చెయ్యాలని బలంగా ఉద్బోధిస్తాం.
 
వికీపీడియా వ్యాసాలను తుది ముసాయిదాగా భావించరాదు. వ్యాస విషయ ప్రాముఖ్యతను నిర్ధారించే మూలాలను ప్రస్తుతానికి చూపించి ఉండక పోవచ్చు.., కానీ అవి ఉండే ఉండవచ్చు. ప్రాముఖ్యతను నిరూపించే, సముచితమైన మూలాలు లభించే అవకాశం ఉంటే, విషయ ప్రాముఖ్యత లేదని తొలగించడం సరికాదు. అయితే, విషయ ప్రాముఖ్యతను నిరూపించమని అడిగిన తరువాత, ఆ మూలాను చూపించవలసి ఉంటుంది, ఉన్నాయని లేదా ఉండే ఉంటాయని చెబితే సరిపోదు.
 
==ఇవీ చూడండి==