వేంగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==చరిత్రలో వివిధ దశలు==
పూర్వ కాలంలో కాలి నడక మార్గాలు, ఓడ రేవులు జనుల ప్రయాణాలకు, వివిధ సంస్కృతుల మేళనానికి ముఖ్యమైన వేదికలు. యాత్రికులు, పండితులు, వ్యాపారులు, కళాకారులు ఈ మార్గాలలో ప్రయాణిస్తూ భిన్న సంప్రదాయాల ఏకీకరణకు కారకులయ్యారు. వీటివల్లనే చరిత్రలో అధిక భాగం అనేక రాజ్యాలుగా ఉన్నా గాని భారతదేశం అనే బలమైన భావన అంకురించడం సాధ్యమయ్యింది. ఆంధ్ర తీరంలో (శాతవాహనుల కాలం నుండి) ఎన్నో [[ఓడ]] రేవులు ఉండేవి. వీటి ద్వారా దేశ, విదేశ వాణిజ్యం జరిగేది. ఈ మార్గాలలో ఆంధ్ర దేశం ముఖ్యమైన కూడలిగా ఉండేది. ఐదు ప్రధాన మార్గాలు "వేంగి" అనే చోట కలిసేవి. అందువల్లనే ఆంధ్ర రాజ్యమంటే వేంగి రాజ్యమని కూడా ఒకోమారు ప్రస్తావించబడేది. వీటిలో [[ఈశాన్యం|పూర్వోత్తర]] మార్గం కళింగ రాజ్యాలకు వెళ్ళేది. [[దక్షిణం|దక్షిణ]] మార్గం ద్రవిడ ప్రాంతాలకు, [[నైఋతి]] మార్గం [[కర్ణాటక]] దిశలోను, [[ఉత్తరం|ఉత్తర]] మార్గం కోసల దేశానికి, [[వాయువ్యం|పశ్చిమోత్తర]] మార్గం [[మహారాష్ట్ర]] ప్రాంతానికి దారి తీసేది. ఇవి ప్రధానంగా బౌద్ధ భిక్షువులు ప్రయాణించి [[బుద్ధుడు]] ఉపదేశించిన సందేశాన్ని వినిపించిన మార్గాలు. ఇప్పుడు బయల్పడిన ప్రధాన బౌద్ధారామ శిధిలాలు దాదాపు అన్నీ ఈ మార్గాలలో ఉన్నాయి. ([[నాగార్జున కొండ]], [[అమరావతి]] లేదా [[ధరణికోట]], ఘంటసాల వంటివి). వీటిలో కొన్ని [[అశోకుడు|అశోకుని]] కంటే ముందు కాలానివి.<ref>http://www.indiaprofile.com/religion-culture/buddhisminandhra.htm ఇది ఒక టూరిజమ్ వెబ్ సైటులో ఉన్నది. వారు ఈ విషయానికి ఆధారాలు తెలుపలేదు.</ref> <ref>http://www.lakehouse.lk/mihintalava/gaya02.htm శ్రీలంక బౌద్ధం సైటులోని సమాచారం</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు