వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 6: కూర్పుల మధ్య తేడాలు

పాత చర్చల నిక్షిప్తం జరుగుతున్నది
 
పంక్తి 5:
 
==తెవికీ హిట్లు==
ఇప్పటి వరకు మనకు అందుబాటులో లేని కొన్ని కొత్త గణాంకాలు ఇప్పుడు లభ్యమౌతున్నాయి. [http://wikistics.falsikon.de/wikistics/latest/] తెవికీని ఎంతమంది చూస్తున్నారు అన్న ప్రశ్న శేషప్రశ్నగా మిగిలిపోకుండా ఇప్పుడు చూచాయగానైనా చెప్పగలిగే అవకాశం వచ్చింది. 2008 ఏప్రిల్ నెలలో 14 రోజులపాటు సేకరించిన సమాచారం ప్రకారం సగటున తెవికీకి 67,967 పేజీహిట్లు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే తెలుగు అంతర్జాలంలో తెవికీ ఒక పెద్ద వెబ్ సైటుగా రూపొందినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అన్ని వికీపీడియాల్లో కెల్లా 57వ స్థానంలోనూ, భారతీయ వికీల్లో రెండవ స్థానములోనూ ఉంది. భారతీయ భాషా వికీల్లో తమిళ వికీ 149,408 పేజీహిట్లతో అగ్రస్థానంలో ఉన్నది. మనకంటే తక్కువ పేజీలున్న తమిళవికీకి రెండున్నర రెట్లు ఎక్కువ హిట్లు రావటం ఆలోచించదగ్గ విషయం. మనం ఆ వికీ నుండి ఏం నేర్చుకోగలం? --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 11:35, 14 మే 2008 (UTC)