''' బెజవాడ పాపిరెడ్డి''' : సోషలిస్టు నాయకుడు, లోక్‌నాయక్ [[జయప్రకాశ్ నారాయణనారాయణ్]] అనుచరుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు బెజవాడ పాపిరెడ్డి ఆయన తన 75 ఏట కన్నుమూశారు.
పాపిరెడ్డి [[నెల్లూరు]] జిల్లా [[బుచ్చిరెడ్డిపాలెం]]లో ఆయన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా ఆయన పని చేశారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన 1983లో ఆ పార్టీలో చేరారు. ఆయన 1983 నుంచి 1985 వరకు తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1958 నుంచి 1962 వరకు [[శాసనమండలి]] సభ్యుడిగా, 1967 నుంచి 1972 వరకు [[అల్లూరు(నెల్లూరు)|అల్లూరు]] శాసనసభ్యుడిగా, 1972 నుంచి 1978 వరకు రాజసభ సభ్యుడిగా పని చేశారు. ఈ మూడింటిని కూడా ఆయన ఇండిపెండెంట్‌గానే దక్కించుకున్నారు. 1983లో [[తెలుగుదేశం పార్టీ]] తరఫున [[అల్లూరు(నెల్లూరు)|అల్లూరు]] నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందిన పాపిరెడ్డి పార్టీ ఆదేశానుసారం 1984లో [[ఒంగోలు లోకసభ నియోజకవర్గం|ఒంగోలు]] లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.